బేతాళ కథలు: కూర్పుల మధ్య తేడాలు

చి భేతాళ పంచవింశతి ప్రాముఖ్యత
పంక్తి 92:
భేతాళ పంచవింశతి కథలను అనుకరిస్తూ అనేక కథలు చెప్పబడ్డాయి. అటువంటివాటిలో [[చందమామ]] పత్రికలో బేతాళ కథలు శీర్షికన ప్రచురించబడిన కథలు చాలా ప్రాచుర్యం పొందాయి. చందమామ పిల్లల మాసపత్రికలో గుణాడ్యుని బేతాళ కథలను అనుకరిస్తూ దానిలోని మూల కథలను విభిన్నసామాజిక, కాల పరిస్థితులకనుగుణంగా నేర్పుగా మార్చి బేతాళ కథలుగా 600 పైగా తెలుగు కథలను ధారావాహికంగా ప్రచురించారు. కథాకథన పద్ధతి గుణాడ్యుని బేతాళ కథలలో వలనే వున్నప్పటికీ ఈ కథలు తెలుగులో కొత్తగా అనుసృజించబడ్డాయని చెప్పవచ్చు.
 
==భేతాళ పంచవింశతి ప్రాముఖ్యత==
ప్రాచీన భారతీయుల కథాకౌశలానికి, భావనా శక్తికి, కల్పనా చాతుర్యానికి భేతాళ పంచవింశతి కథలు సాటిలేని మేటి ఉదాహరణగా నిలిచాయి. పలు ప్రపంచభాషలలో అనువాదమై ప్రసిద్ద్ధి పొందాయి. ప్రశ్న-సమాధానం ప్రక్రియలో సాగే ఈ కథల సమాహారం భారతీయ సాహిత్యంలోనే కాకుండా ప్రపంచ సాహిత్యంలో కూడా అత్యుత్తమ కథా సంకలనంగా పేరుపొందింది. చిత్ర విచిత్ర పాత్రలతో, అద్భుత కథా కల్పనతో సాగే ఈ కథలు కేవలం కుతూహలాన్ని రేకెత్తించే ఉల్లాసభరితమైన కాలక్షేప కథలు కావు. నిజానికి ఈ కథలు మానవుల ఊహాశక్తిని తర్కంతో, వివేచనతో ముడిపెడతాయి. ఒక అంశాన్ని వివిధ కోణాల నుండి ఎలా చూడాలో, ఏ మేరకు సమన్వయం చేయాలో. తార్కిక ముగింపు ఎలా ఉండాలో చెపుతాయి. ముఖ్యంగా ఒక సమస్యను విభిన్న కోణాలలో వివేచించగల తార్కిక స్థాయిని మానవులలో పెంపొందింపచేస్తాయి. మానవుల తార్కిక శక్తిని పదును పెట్టడానికి మరియు వారి మేథస్సును పెంచడానికి రూపొందించబడిన ఈ భేతాళ పంచవింశతి కథలు, ప్రాచీన భారతీయ కథకుల యొక్క ఊహా శక్తి పటిమకి, కథా సంవిధాన కౌశలానికి చక్కని నిదర్శనంగా నిలిచాయి. రెండు వేల సంవత్సరాలుగా భేతాళ కథలు తరగని జనాదరణతో భారతీయ సాహిత్యంలో ఉత్తమ కథా కావ్యంగా నిలిచింది.
 
తీర్చిదిద్దేవిధంగా
==రిఫరెన్సులు==
* Vikram and the Vampire by Richard F. Burton, Project Gutenberg EBook [https://www.gutenberg.org/files/2400/2400-h/2400-h.htm#link2H_PREF]
"https://te.wikipedia.org/wiki/బేతాళ_కథలు" నుండి వెలికితీశారు