బేతాళ కథలు: కూర్పుల మధ్య తేడాలు

చి భేతాళ పంచవింశతి ప్రాముఖ్యత
పంక్తి 93:
 
==భేతాళ పంచవింశతి ప్రాముఖ్యత==
ప్రాచీన భారతీయుల కథాకౌశలానికి, భావనా శక్తికి, కల్పనా చాతుర్యానికి భేతాళ పంచవింశతి కథలు సాటిలేని మేటి ఉదాహరణగా నిలిచాయి. పలు ప్రపంచభాషలలో అనువాదమై ప్రసిద్ద్ధి పొందాయి. ప్రశ్న-సమాధానం ప్రక్రియలో సాగే ఈ కథల సమాహారం భారతీయ సాహిత్యంలోనే కాకుండా ప్రపంచ సాహిత్యంలో కూడా అత్యుత్తమ కథా సంకలనంగా పేరుపొందింది. చిత్ర విచిత్ర పాత్రలతో, అద్భుత కథా కల్పనతో సాగే ఈ కథలు కేవలం కుతూహలాన్ని రేకెత్తించే ఉల్లాసభరితమైన కాలక్షేప కథలు కావు. నిజానికి ఈ కథలు మానవుల ఊహాశక్తిని తర్కంతో, వివేచనతో ముడిపెడతాయి. ఒక అంశాన్ని వివిధ కోణాల నుండి ఎలా చూడాలో, ఏ మేరకు సమన్వయం చేయాలో. తార్కిక ముగింపు ఎలా ఉండాలో చెపుతాయి. ముఖ్యంగా ఒక సమస్యను విభిన్న కోణాలలో వివేచించగల తార్కిక స్థాయిని మానవులలో పెంపొందింపచేస్తాయి. అందుకే ఈ కథలు పండిత, పామర జన భేదంలేకుండా ప్రజాబాహుళ్యంలో చొచ్చుకుపోయాయి. తదనంతర కవులకు ప్రేరణగా నిలిచింది. తరువాతకాలంలో అనేక మంది కవులు దీనిలోని కథలను తమ కావ్యాలలో యథాతథంగా స్వీకరించారు. మరికొందరు తమ సమకాలీన సామాజిక పరిస్థితులకనుగుణంగా ఈ కథలలో మార్పులు, చేర్పులు చేసుకొనడం జరిగింది.
 
మానవుల తార్కిక శక్తిని పదును పెట్టడానికి మరియు వారి మేథస్సును పెంచడానికి రూపొందించబడిన ఈ భేతాళ పంచవింశతి కథలు, ప్రాచీన భారతీయ కథకుల యొక్క ఊహా శక్తి పటిమకి, కథా సంవిధాన కౌశలానికి చక్కని నిదర్శనంగా నిలిచాయి. రెండు వేల సంవత్సరాలుగా భేతాళ కథలుఇది తరగని జనాదరణతో భారతీయ సాహిత్యంలో ఉత్తమ కథా కావ్యంగా నిలిచింది.
 
.
 
==రిఫరెన్సులు==
"https://te.wikipedia.org/wiki/బేతాళ_కథలు" నుండి వెలికితీశారు