బేతాళ కథలు: కూర్పుల మధ్య తేడాలు

చి భేతాళ పంచవింశతి ప్రాముఖ్యత
చి భేతాళ పంచవింశతి – పాఠాంతరాలు, సంకలనాలు, అనువాదాలు
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 87:
 
భారతదేశంలో భేతాళ కథలు బాగా ప్రాచుర్యం పొందాయి. అనేక భారతీయ భాషలలోకి అనువదించబడ్డాయి.<ref>Penzer 1924, Vol VI, p 225.</ref> సంస్కృత పాఠాంతరాలతో పాటు, హిందీ, తమిళం, బెంగాలీ, మరాఠీ భాషలలోని అనువాదాల ఆధారంగా అనేక ఇంగ్లీష్ అనువాదాలు ప్రచురించబడ్డాయి. <ref>Penzer 1924, Vol VI, p 226.</ref> 1855 లో, విలియం బర్క్‌హార్డ్ట్ బార్కర్ దీనిని బైటాల్ పచ్చీసి (25 టేల్స్ అఫ్ ఎ డెమన్) పేరుతొ ఇంగ్లీషులో అనువదించాడు.<ref>{{cite book |last1=William Burckhardt |first1=Barker |title=Baital Pachísí ; or, Twenty-five tales of a demon |publisher=Hertford : Stephen Austin |location=Eton |pages=385 |edition=1855 |url=https://archive.org/details/bub_gb_zX0IAAAAQAAJ/page/n1/mode/2up |accessdate=13 September 2020}}</ref> 1873 లో హెర్మాన్ ఓస్టర్లీ ఈ కథలను జర్మనీ భాషలోకి అనువదించాడు.<ref>{{cite book |last1=Oesterley |first1=Hermann |title=Baitál Pachísí: Oder, die fünfundzwanzig Erzählungen eines Dämon |publisher=Friedrich Fleischer |location=Leipzig, Germany |pages=278 |edition=1873 |url=https://archive.org/details/baitlpachsoderd00oestgoog/page/n7/mode/2up |accessdate=13 September 2020}}</ref> ఇంగ్లీష్ అనువాదాలలో 1870 లో సర్ రిచర్డ్ ఫ్రాన్సిస్ బర్టన్ చేసిన అనువాదం (విక్రమ్ అండ్ ది వాంపైర్) బాగా ప్రసిద్ధి పొందింది. <ref>{{cite book |last1=Burton |first1=Sir Richard F. |title=Vikram and the Vampire |publisher=Longmans, Green and Co |location=London |edition=1870 |url=https://www.gutenberg.org/files/2400/2400-h/2400-h.htm#link2H_PREF |accessdate=13 September 2020}}</ref>ఈ అనువాదానికి మూలం హిందీ నుండి తీసుకున్నప్పటికీ, ఇది అనువాదంలా కాకుండా సృజనాత్మక అనుసరణగా ఉంటుంది.<ref>Penzer 1924, Vol VI, p 227. Penzer goes on to observe "What Burton has really done is to use a portion of the Vetāla tales as a peg on which to hang elaborate 'improvements' entirely of his own invention."</ref>
 
సంస్కృతంలోని భేతాళ పంచవింశతి కథలను తొలిసారిగా తెలుగులోకి తీసుకొనిరావడం షోడశకుమార చరిత్ర కథాకావ్యంతో (15వ శతాబ్దం) ప్రారంభమైంది. దానితోనే అప్పటివరకూ మౌఖికంగా జన శ్రుతిలో ప్రచారంలో వున్న భేతాళ కథలు తెలుగులో తొలిసారిగా లిఖితబద్దమైనాయి. 15 వ శతాబ్దపు ఉత్తరార్ద కాలానికి చెందిన వెన్నెలకంటి అన్నయ్య సంస్కృత భేతాళ పంచవింశతి నుండి కొన్ని కథలను యథాతదంగా స్వీకరించి షోడశకుమార చరిత్రను రాసాడు. అందుచేతనే షోడశకుమార చరిత్ర చాలాకాలం వరకూ భేతాళ పంచవింశతి అనే పేరుతోనే తెలుగునాట ప్రసిద్ధమైంది. తరువాత కాలంలో గోదావరి ప్రాంతానికి చెందిన కవి మిక్కిలి మల్లికార్జునుడు, పద్మనాయక యుగంలో కవి వల్లభటుడూ బేతాళ పంచవింశతి పేరుతో కావ్యాలు రాసినట్లు తెలుస్తుంది. కూచిరాజు ఎర్రన తన సకలనీతి కథావిధానంలో కొన్ని భేతాళ కథలు కనిపిస్తాయి.
 
==భేతాళ పంచవింశతి – అనుకరణలు==
Line 93 ⟶ 95:
 
==భేతాళ పంచవింశతి ప్రాముఖ్యత==
ప్రాచీన భారతీయుల కథాకౌశలానికి, భావనా శక్తికి, కల్పనా చాతుర్యానికి భేతాళ పంచవింశతి కథలు సాటిలేని మేటి ఉదాహరణగా నిలిచాయి. పలు ప్రపంచభాషలలో అనువాదమై ప్రసిద్ద్ధి పొందాయి. ప్రశ్న-సమాధానం ప్రక్రియలో సాగే ఈ కథల సమాహారం భారతీయ సాహిత్యంలోనే కాకుండా ప్రపంచ సాహిత్యంలో కూడా అత్యుత్తమ కథా సంకలనంగా పేరుపొందింది.

చిత్ర విచిత్ర పాత్రలతో, అద్భుత కథా కల్పనతో సాగే ఈ కథలు కేవలం కుతూహలాన్ని రేకెత్తించే ఉల్లాసభరితమైన కాలక్షేప కథలు కావు. నిజానికి ఈ కథలు మానవుల ఊహాశక్తిని తర్కంతో, వివేచనతో ముడిపెడతాయి. ఒక అంశాన్ని వివిధ కోణాల నుండి ఎలా చూడాలో, ఏ మేరకు సమన్వయం చేయాలో. తార్కిక ముగింపు ఎలా ఉండాలో చెపుతాయి. ముఖ్యంగా ఒక సమస్యను విభిన్న కోణాలలో వివేచించగల తార్కిక స్థాయిని మానవులలో పెంపొందింపచేస్తాయి. అందుకే ఈ కథలు పండిత, పామర జన భేదంలేకుండా ప్రజాబాహుళ్యంలో చొచ్చుకుపోయాయి. తదనంతర కవులకు ప్రేరణగా నిలిచింది. తరువాతకాలంలో అనేక మంది కవులు దీనిలోని కథలను తమ కావ్యాలలో యథాతథంగా స్వీకరించారు. మరికొందరు తమ సమకాలీన సామాజిక పరిస్థితులకనుగుణంగా ఈ కథలలో మార్పులు, చేర్పులు చేసుకొనడం జరిగింది.
 
మానవుల తార్కిక శక్తిని పదును పెట్టడానికి మరియు వారి మేథస్సును పెంచడానికి రూపొందించబడిన ఈ భేతాళ పంచవింశతి కథలు, ప్రాచీన భారతీయ కథకుల యొక్క ఊహా శక్తి పటిమకి, కథా సంవిధాన కౌశలానికి చక్కని నిదర్శనంగా నిలిచాయి. రెండు వేల సంవత్సరాలుగా ఇది తరగని జనాదరణతో భారతీయ సాహిత్యంలో ఉత్తమ కథా కావ్యంగా నిలిచింది.
"https://te.wikipedia.org/wiki/బేతాళ_కథలు" నుండి వెలికితీశారు