తులసి (నటి): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 15:
| spouse = శివమణి
}}
 
'''తులసి''' లేదా '''తులసి శివమణి''' [[తెలుగు సినిమా]] నటి.
'''తులసి''' లేదా '''తులసి శివమణి''' [[తెలుగు సినిమా]] నటి. తులసి తల్లి సినీ నటీమణులు [[అంజలీదేవి]]కి, [[సావిత్రి]]కి మంచి స్నేహితురాలు. వీరు తులసి వాళ్ళ ఇంటికి తరచూ వస్తుండేవారు. అప్పట్లో తులసి చురుకైన పిల్ల అని గమనించి సినీరంగములో బాగా రాణించగలదని అనుకున్నారు. [[భార్య (సినిమా)|భార్య]] సినిమా నిర్మాత ఒక బాల్యనటి కోసం వెతుకుతుండగా, వాళ్ళు తులసిని ఆ పాత్రకై సిఫారుసు చేశారు. అప్పటి నుండి అనేక [[సినిమా]]లలో బాల్యనటిగా నటించింది. ఆ సినిమా షూటింగు సందర్భములో [[దాసరి నారాయణరావు]] తులసి యొక్క నటన నచ్చి, ఇతర నిర్మాతలకు కూడా రికమెండ్ చేశాడు.
 
బాల్యనటిగా తులసి ఒకటిన్నర యేళ్ళ వయసులోనే [[భార్య (సినిమా)|భార్య]] చిత్రములో [[రాజబాబు]] కొడుకుగా చలనచిత్ర రంగములో ప్రవేశించింది.<ref>{{Cite web |url=http://www.telugucinema.com/c/publish/stars/Interview_tulasi2007.php |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2008-08-20 |archive-url=https://web.archive.org/web/20131202221805/http://www.telugucinema.com/c/publish/stars/Interview_tulasi2007.php |archive-date=2013-12-02 |url-status=dead }}</ref>
పంక్తి 25:
కథానాయకిగా తులసి తొలిచిత్రం [[జంధ్యాల]] దర్శకత్వం వహించిన [[ముద్ద మందారం]]. ఈ సినిమాలో ప్రదీపు మరదలుగా తులసి నటించింది. ఆ తర్వాత వచ్చిన నాలుగు స్థంబాలాట (1982), శుభలేఖ (1982), మంత్రిగారి వియ్యంకుడు (1984), ప్రేమించు పెళ్ళాడు సినిమాలలో ద్వితీయ కథానాయకిగా నటించింది. శుఖలేఖ చిత్రం మంచి విజయం సాధించి శుభలేఖ సుధాకర్ - తులసిల జంటకు మంచి పేరు రావటంతో ఆ తరువాత అదే తరహా పాత్రలలో ఆమెకు అవకాశాలు వచ్చాయి. మంత్రిగారి వియ్యంకుడు, ప్రేమించు పెళ్ళాడు సినిమాలు కూడా విజయం సాధించటంతో తులసి ఒకటి అరా పాటలున్న చెల్లెలి పాత్రలకు బాగా సరిపోతుందనే ముద్ర పడింది. ఈ మూస చట్రంలోనుండి బయటపడటానికి పూజకు పనికిరాని పువ్వు వంటి స్త్రీ ప్రధాన సినిమాలలోనూ, శ్రీ కట్నలీలలు వంటి సినిమాలో గ్లామర్ పాత్రలు పోషించినా అవి విజయం సాధించలేదు.
 
తులసికి ఒక ప్రముఖ సినీ సంగీతదర్శకుడితో [[పెళ్ళి]] నిశ్చయమైంది కానీ చివరి క్షణంలో పారిపోయి వేరేవ్యక్తిని పెళ్ళి చేసుకున్నదని సినీరంగంలో వందతులున్నాయి. అయితే తెలుగుసినిమా.కాంకు ఇచ్చిన ఇంటర్యూలో ఈ సంగతిని ఆమె ఖండించలేదు. ఆ వ్యక్తి పేరును బయటపెట్టడానికి మాత్రం నిరాకరించింది. తులసి ఒక ప్రముఖ [[కన్నడ భాష|కన్నడ]] దర్శక నిర్మాతను కలిసిన మొదటి రోజే పెళ్ళి చేసుకున్నది.
 
తెలుగులో హీరోయిన్‌గా తులసి చివరిచిత్రం 1999లో విడుదలైన కన్నయ్య కిట్టయ్య. వివాహం తర్వాత తెలుగు చిత్రరంగంతో సంబంధాలన్నీ తెంచేసుకొని సంసారజీవితంలో స్థిరపడింది.
"https://te.wikipedia.org/wiki/తులసి_(నటి)" నుండి వెలికితీశారు