"మారేమండ రామారావు" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
(1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1)
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
 
'''మారేమండ రామారావు''' గారు ప్రముఖ చరిత్ర పరిశోధకులు.
==జీవిత విశేషాలు==
ఆయన [[1906]] [[నవంబరు 26]] న జన్మించారు (పరాభవ మార్గశిర శుద్ధ తయోదశినాడు).పశ్చిమ గోదావరిజిల్లా పట్టిసీమ సమీపంలోనున్న పోలవరం సమీపంలో జన్మించారు.తల్లి లక్ష్మీభాయమ్మ; తండ్రి వేంకటకృష్ణారావు గారు.రామారావుగారు 1925లో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులయ్యేవరకు రాజమహేంద్రవరంలో విద్యాసముపార్జన గావించారు.వారు బి.ఏ.ఆనర్సు మద్రాసు క్రిస్టియన్ కళాశాలలో చదివి 1928లో డిగ్రీ సంపాదించారు.1928-31 మధ్య ఆచార్య శ్రీ.కె.ఏ.నీలకంఠశాస్త్రి గారి పర్యవేక్షణ క్రింద మద్రాసు విశ్వవిద్యాలయంలో పరిశోధన గావించారు.ఓరుగల్లు ను పాలించిన కాకతీయులు (Kakatiyas of Warangal) అను వారి పరిశోధనా గ్రంధానికి పి.హెచ్.డి పట్టం వచ్చింది.మద్రాసు విశ్వవిద్యాలయంలో చారిత్రక విషయంపై పరిశోధన గావించి పి.హెచ్.డి పట్టాన్ని గైకొన్న ప్రధమాంధ్రులు శ్రీ [[నేలటూరి వేంకటరమణయ్య]] గారు ద్వితీయులు శ్రీ రామారావుగారు. [[మద్రాసు]] విశ్వవిద్యాలయంలో విద్యార్థి దశలోనే చరిత్ర పరిశోధనా రంగంలో ప్రవేశించి గాఢాధ్యయనం చేసారు. ప్రముఖ పరిశోధకుల వద్ద శిక్షణ పొందారు. [[గుంటూరు]] హిందూ కాలేజీలో హిస్టరీ అధ్యాపకునిగా కొద్దికాలం పనిచేశారు. "శాతవాహన చరిత్ర" అంశాంతో ప్రారంభమైన కాలక్రమంలో "ఆంధ్ర చరిత్ర"<ref>[https://books.google.co.in/books/about/Inscriptions_of_A%C5%86dhrad%C4%93%C5%9Ba_Compiled_a.html?id=nrMHMwEACAAJ&redir_esc=y Inscriptions of Aņdhradēśa ... Compiled and edited by Dr. M. Rama Rao]</ref>కు సంబంధించి అన్ని కోణాలలోనూ పరిశోధనా పటిమను వృద్ధి చేసుకున్నారు. వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ([[తిరుపతి]]), నిజాం కళాశాల ([[హైదరాబాదు]]) లలో చరిత్ర అధ్యాపకునిగా ఉంటూ అనేక మంది పరిశోధక విద్యార్థులకు మార్గదశకత్వం యిచ్చారు. స్వయంగా పరిశోధనలు చేసి, తమ కృషికి మెరుగులు పెట్టి వెలువరించిన "[[కాకతీయ సంచిక]]" ప్రసిద్ధి పొందింది<ref>{{Cite web |url=http://www.southasiaarchive.com/Content/sarf.120036/205980/011 |title=Journal of the Andhra Historical Research Society > Volume IX, Issue 3, 1935 > Publications of the Andhra Historical Research Society. Kakatiya Sanchika in (Telugu) |website= |access-date=2015-08-08 |archive-url=https://web.archive.org/web/20151011104708/http://www.southasiaarchive.com/Content/sarf.120036/205980/011 |archive-date=2015-10-11 |url-status=dead }}</ref>. సమకాలికంగా లభ్యమైన శాసనాలూ, ఇతర సాధన సంపత్తి ఆధారంతో సుదీర్ఘమైన ఉపోధ్ఘాతంతో రాసిన ఈ గ్రంథం ఎంతోమందిని ఆకర్షించింది. కొంతమందిని వికర్షించింది. చర్చోపచర్చలకు ఆలవాలమైంది.
4,928

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3036270" నుండి వెలికితీశారు