వికీపీడియా చర్చ:యాంత్రికానువాదాల నాణ్యతా నియంత్రణ విధానం-2: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 144:
:* 30% పరిమితి విధించాక ఉన్న పరిస్థితిని కూడా చూసాం. ఈ రెండో అనుభవం మీకు ఎలా ఉందో కూడా వెనక్కి తిరిగి చూసుకుంటే తెలుస్తుంది. (మచ్చుకు కావాలంటే రచ్చబండలో నేను పెట్టిన జాబితాను పరిశీలించండి.)
: ఈ రెంటినీ బేరీజు వేసుకోండి, చాలు. ఏదేమైనప్పటికీ, సముదాయ నిర్ణయం మనందరికీ శిరోధార్యం. ఆ నిర్ణయం ప్రతికూల ప్రభావం కలిగిస్తే ప్రతికూలతను తగ్గించుకుని దాన్ని అనుకూలంగా మార్చుకునేందుకు కోర్స్ కరెక్షను చేసుకుందాం (ఒకవేళ ఆ పరిమితిని ఇప్పుడు తొలగిస్తే, మళ్ళీ ఆ పరిమితిని విధించుకోవాలి అనేది నా ఉద్దేశం కానే కాదు. ఉన్న పరిస్థితిని మెరుగు పరచుకునే మార్గాలను చూసుకోవాలి.) ప్రతిపాదన పెట్టడం తోనో, దానిపై చర్చలో పాల్గొనడంతోనో, వోటు వెయ్యడం తోనో, మన బాధ్యత తీరిపోదని మాత్రం మనందరం గుర్తించాలి. __[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 05:47, 17 సెప్టెంబరు 2020 (UTC)
 
== ఓటింగ్ పద్ధతి సరిగా లేదు, ఓటింగ్‌ కి పెట్టిన విషయమూ సరిగాలేదు ==
నేను ఎన్నో అనువాదాలను ఈ ట్రాన్సలేషన్ టూల్ వాడి చేశాను. అనువాదం చేసేప్పుడు యాంత్రిక అనువాదం మీద ఆధారపడకూడదని చెప్పను కానీ వాక్యాలను చాలా వరకూ మార్చేయవలసి వస్తుంది. గూగుల్ అనువాదం ఎంత తప్పుల తడకతో ఉంటుందో గతంలో గూగుల్ అనువాద వ్యాసాల్లో చూడడమే కాదు ఈనాటికీ ఎవరైనా అనువాదం చేసుకుని గమనించవచ్చు. చదువరి గారు కనీసం 30 శాతం మార్చితే కానీ ఆ అనువాదాన్ని టూల్ నుంచి ప్రచురించలేమన్న నియమం పెట్టడం చాలా అనుభవంతో చేసిన సరైన పని అని నా అభిప్రాయం. అటువంటిది ఆ నిబంధన తొలగించాలనడం ఒక పొరబాటు, అది తీసేసి కొత్తగా వచ్చిన వాడుకరులకు మాత్రమే ట్రాన్సలేషన్‌ టూల్ తో చేసిన అనువాదాలు నేరుగా మొదటి పేరుబరిలో ప్రచురిచనివ్వకూడదనడం మరో పొరబాటు. ఎందుకంటే, నేను 2015లో ఇక్కడికి వచ్చాను. వచ్చేనాటికే నేను ఎంతో భాష నేర్చుకునే వచ్చాను. అదే 2020లో వస్తే ఈ నిబంధన ప్రకారం నాకు భాష రాదన్నట్టు, నేను నేరుగా ప్రచురించకూడదన్నట్టు అవుతుంది కదా. అలాగే ఎందరో అనుభవజ్ఞులు తప్పులు చేయవచ్చు. ఇక చర్చ ఆసాంతం చదివితే ఈ ప్రతిపాదనలు ఇప్పటికే తిరస్కరణ పొందాయని తెలుస్తోంది. అలాంటప్పుడు ఓటు ఎందుకు వేయాలంటూ ఓటింగ్ ప్రక్రియను తిరస్కరిస్తున్న సభ్యుల నిర్ణయం చాలా సముచితం, న్యాయం. కానీ, అలాగని ఊరుకుంటే ఈ ప్రతిపాదనలు గెలుస్తాయి. కాబట్టి, నేను ఈ ఓటింగ్ ని తిరస్కరిస్తూనే ప్రతిపాదనలో వ్యతిరేక ఓటు వేయాలని నిర్ణయించుకున్నాను. ఆలస్యంగా ఈ చర్చ చూడడం చాలా పెద్ద పొరబాటయింది. కనీసం, ఇప్పటికైనా నా వ్యతిరేకతను నమోదు చేయగలగడం సంతోషంగా ఉంది. --[[వాడుకరి:Meena gayathri.s|Meena gayathri.s]] ([[వాడుకరి చర్చ:Meena gayathri.s|చర్చ]]) 11:11, 20 సెప్టెంబరు 2020 (UTC)
Return to the project page "యాంత్రికానువాదాల నాణ్యతా నియంత్రణ విధానం-2".