కె.వాసు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు
పంక్తి 2:
 
==జీవిత విశేషాలు==
ఇతడు [[1951]], [[జనవరి 7]]వ తేదీన [[హైదరాబాదు]]లో కె.ప్రత్యగాత్మ, సత్యవతి దంపతులకు జన్మించాడు. ఇతని తల్లిదండ్రులిద్దరూ కమ్యూనిస్టు ఉద్యమ నేపథ్యం నుండి వచ్చినవారు. ఇతని మేనమామ చలసాని శ్రీనివాసరావు గొప్ప కమ్యూనిస్టువాది. అతడు పోలీసు ఎన్‌కౌంటర్‌లో మరణించిన సంవత్సరానికి ఇతడు జన్మించాడు. ఆయన జ్ఞాపకార్థం ఇతనికి శ్రీనివాసరావు అని నామకరణం చేశారు. ఇతని తాత కోటయ్య గుంటూరులో ఋషీకేశ్ ఆశ్రమాన్ని స్థాపించాడు. వాసు పదవ తరగతి వరకు మద్రాసులోని కేసరి హైస్కూలులో చదివాడు. తరువాత మెట్రిక్యులేషన్ కొరకు గుంటూరు, హైదరాబాదులలో చదివాడు. కానీ ఇతనికి చదువు అబ్బలేదు. ఇతని బాబాయి కె.హేమాంబరధరరావు ఇతనికి తన సినిమాలలో అప్రెంటీస్‌గా చేర్చుకున్నాడు. తరువాత ఛాయాగ్రాహకులు ఎం.జి.సింగ్, ఎం.సి.శేఖర్‌ల వద్ద రెండేళ్ళు కెమెరా అసిస్టెంట్‌గా, ఎడిటర్ బి.గోపాలరావు వద్ద ఎడిటింగ్కూర్పు అసిస్టెంట్‌గా ఒక సంవత్సరం పనిచేశాడు. తరువాత తన తండ్రి ప్రత్యగాత్మ వద్ద ఆదర్శకుటుంబం, మనసు మాంగల్యం, పల్లెటూరి బావ సినిమాలకు అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. తరువాత [[ఆడపిల్లల తండ్రి]] సినిమాకు తొలిసారి 22యేళ్ల పిన్నవయసులో దర్శకత్వం వహించి స్వంతంగా నిర్మించాడు. ఇతడు 1982లో రత్నకుమారిని వివాహం చేసుకున్నాడు. వీరికి అన్నపూర్ణ, దీప్తి అనే అమ్మాయిలు జన్మించారు.
 
==సినిమారంగం==
పంక్తి 66:
 
==మూలాలు==
* [http://telugucinemacharitra.com/దర్శకుడు-కె-వాసు/ సినీగోయర్స్ డాట్ కామ్‌ దర్శకుడు కె.వాసుతో చేసిన ఇంటర్వ్యూ]]
 
[[వర్గం:తెలుగు సినిమా దర్శకులు]]
పంక్తి 73:
[[వర్గం:హైదరాబాదు జిల్లా సినిమా దర్శకులు]]
[[వర్గం:హైదరాబాదు జిల్లా సినిమా నిర్మాతలు]]
[[వర్గం:శోభన్ బాబు నటించిన సినిమాలు]]
"https://te.wikipedia.org/wiki/కె.వాసు" నుండి వెలికితీశారు