బ్లేడ్ బాబ్జీ: కూర్పుల మధ్య తేడాలు

చి →‎కథ: AWB తో "మరియు" ల తొలగింపు
చి AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు
పంక్తి 27:
 
== కథ ==
బ్లేడ్ బాబ్జీ (అల్లరి నరేష్), అతని గ్యాంగు రాజమండ్రిలోని ఒక కాలనీలో ఉంటూ చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ కాలం గడుపుతూ ఉంటారు. ఇలా ఉండగా వారు గుడిసెలు వేసుకున్న స్థలం యజమాని ఉన్నఫళంగా ఖాళీ చేయమంటాడు. అలా చేయని పక్షంలో నాలుగు కోట్లు చెల్లించమంటాడు. ఆ కాలనీ వాళ్ళనందరినీ కాపాడటానికి వీళ్ళు ఒక బ్యాంకును దోచుకోవాలని పథకం వేస్తారు. అదే సమయానికి బండ బద్రి (జయప్రకాష్ రెడ్డి) అనే దొంగల నాయకుడు కూడా బ్యాంకు దొంగతనానికి ప్రణాళిక వేస్తాడు. కానీ అతని అనుచరులకు బదులు బాబ్జీ అనుచరులు బ్యాంకులో సొమ్ము దొంగతనం చేసి పారిపోతారు. దాచిన సొమ్మును ఒక నిర్మాణంలో ఉన్న భవనంలో నేలలో దాచి పెట్టి ఓడరేవులోని ఒక పడవలో పడుకుంటారు. తెల్లారి లేచి చూసేసరికి అండమాన్ దీవులకు వెళ్ళే దారిలో ఉంటారు. వాళ్ళు అక్కడి నుంచి తిరిగిరావడానికి ఒక నెల రోజులు పడుతుంది.
 
నెల రోజులకు తిరిగి వచ్చి తాము సొమ్ము దాచిన చోటుకు వెళ్ళగానే అక్కడే ఒక పోలీసు కంట్రోలు రూము దర్శనమిస్తుంది. అక్కడి నుంచి డబ్బు ఎలా సంపాదించాలా అని చూస్తుండగా వాళ్ళకి లంచమిచ్చి పోలీసు ఉద్యోగం సంపాదించిన కృష్ణమనోహర్ (శ్రీనివాస రెడ్డి) తారసపడతాడు. కథానాయకుడూ, అతని బృందం అతన్ని అపహరించి తమ గదిలో బంధించి ఆ స్థానంలో బాబ్జీని పంపిస్తారు.
పంక్తి 51:
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
[[వర్గం:బ్రహ్మానందం నటించిన సినిమాలు]]
"https://te.wikipedia.org/wiki/బ్లేడ్_బాబ్జీ" నుండి వెలికితీశారు