కులగోత్రాలు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మూలాలు: AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు
చి AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు
పంక్తి 14:
 
==సంక్షిప్త చిత్రకథ==
కామందు భూషయ్య ([[గుమ్మడి వెంకటేశ్వరరావు]]) కొడుకు రవి ([[అక్కినేని]]) [[విశాఖపట్నం]]లో చదువుకుంటూ ఉంటాడు. సరోజ (కృష్ణకుమారి) ఎం. బి. బి. ఎస్ చదువుతూ ఒంటరియైన తల్లి కాంతమ్మతో కలిసి నివసిస్తుంటుంది. తల్లి ఆమె కోసం పెళ్ళి సంబంధాలు చూస్తుంటుంది కానీ ఆమె తండ్రి ఎవరో తెలియకపోవడంతో కులగోత్రాలు లేవని వచ్చిన సంబంధాలన్నీ వెనక్కిపోతుంటాయి. ఒకసారి వరద భాధితుల సహాయార్థం కళాశాల విద్యార్థులందరూ కలిసి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రవి, సరోజ కలిసి ఒక నృత్య ప్రదర్శనలో పాల్గొంటారు. అక్కడ నుంచి సరోజ ఇంటికి వెళుతుండగా చలపతి అనే దొంగ ([[మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి|మిక్కిలినేని]]) ఆమె మెడలో హారాన్ని దొంగిలించబోతే రవి అడ్డుకుని గాయాలపాలవుతాడు. పోలీసులు తరముకు వస్తుంటే తప్పించుకోబోయి చలపతి కాంతమ్మ ఇంట్లో ప్రవేశిస్తాడు. కాంతమ్మను చలపతి మోసం చేసి వదిలేసి ఉంటాడు. ఇన్నాళ్ళు ఆమెను కష్టాలపాలు చేసినందుకు గాను కూతురుకు తండ్రి విషయం తెలియగూడదని ఆమె హెచ్చరించగా బాధతో వెళ్ళిపోతాడు. సరోజ, రవి కలిసి కళాశాల వార్షికోత్సవంలో శకుంతల దుష్యంతుడు నాటకం వేస్తారు. తరువాత ఇద్దరూ ప్రేమించుకుంటారు.
 
కులగోత్రాల పట్టింపు గల భూషయ్య రవి ప్రేమను అంగీకరించడు. సరోజకు యిచ్చిన మాట ప్రకారం రవి ఇల్లు వదలి తండ్రి అభీష్టానికి వ్యతిరేకంగా సరోజను గుడిలో పెళ్ళి చేసుకుంటాడు. ఆ తరువాత సరోజ తల్లి తన బాధ్యతలు తీరిపోవడంతో తీర్థయాత్రలకు వెళ్ళిపోతుంది. రవికి పోలీస్ ఇన్ స్పెక్టరుగా ఆ ఊరిలోనే ఉద్యోగం వస్తుంది. రవి కులగోత్రాలు లేని అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడని రవి చెల్లెలి పెళ్ళి ఆగిపోతుంది. కానీ అదే సమయానికి రవి వరసకి బావ అయిన జాస్తి జోగారావు (పద్మనాభం) ఆమెను పెళ్ళి చేసుకోవడానికి ముందుకు వస్తాడు. తండ్రి పట్టింపుల వల్ల రవి తన చెల్లెలు పెళ్ళికి కూడా వెళ్ళలేక బయటనుంచే అక్షింతలు వేస్తాడు. రవి తన బావ సదానందం (రేలంగి) స్నేహితులతో కలిసి పేకాడుతుంటే అరెస్టు చేస్తాడు. అతన్ని భూషయ్య వెళ్ళి విడిపించాల్సి వస్తుంది. సదానందం, జగదాంబ కలిసి భూషయ్య ఆస్తిని ఎలా తమ పేరున రాయించుకోవాలో చూస్తుంటారు. ఒకరోజు మెట్లమీద నుంచి జారిపడిన భూషయ్య భార్య మంచాన పడుతుంది. అదే సమయానికి రవి వేరే ఊర్లో ఉండటం వలన అతను వెళ్ళి చూడ్డానికి కూడా వీలుపడదు. రవిని తలుచుకొని అతని తల్లి బాధపడి అనారోగ్యంతో మంచం పట్టి మరణిస్తుంది. భార్య గతించాక భూషయ్యలో మార్పు వస్తుంది. రవికి కొడుకు పుడతాడు. భూషయ్య మమతను చంపుకోలేక దొంగచాటుగా వెళ్ళి మనవణ్ణి చూసి ఎత్తుకొని ముచటపడి వాడి మెడలో బంగారు గొలుసు కానుకగా వేస్తాడు. సదానందం చలపతిలో ఒప్పందం కుదుర్చుకుని తన మామ చేత ఆస్తిపత్రాల మీద సంతకం చేయించుకోవాలనుకుంటాడు. కానీ అతను భూషయ్య యింట్లో దొంగతనం చేసే ప్రయత్నంలో వుండగా రవి వచ్చి అతనితో పోరాటానికి దిగుతాడు. అదే సమయానికి అక్కడికి వచ్చిన సరోజ తుపాకీతో చలపతిని కాల్చేస్తుంది. పంతాలు పట్టింపులు వదలి భూషయ్య కొడుకు, కోడలు, మనవణ్ణి యింట్లోకి ఆహ్వానిస్తాడు.
పంక్తి 98:
[[వర్గం:ఘట్టమనేని కృష్ణ నటించిన సినిమాలు]]
[[వర్గం:అల్లు రామలింగయ్య నటించిన చిత్రాలు]]
[[వర్గం:గుమ్మడి నటించిన చిత్రాలు]]
"https://te.wikipedia.org/wiki/కులగోత్రాలు" నుండి వెలికితీశారు