నాలుగు స్తంభాలాట (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
చి AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు
పంక్తి 11:
music = [[రమేష్ నాయుడు]] |
playback_singer = [[ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం]], [[పి.సుశీల]] |
starring =[[సుత్తివేలుకురుమద్దాలి లక్ష్మీ నరసింహారావు|సుత్తి వేలు]],<br />[[విజయ నరేష్|నరేష్]],<br>[[ప్రదీప్ (నటుడు)|ప్రదీప్]],<br>[[పూర్ణిమ]], [[తులసి (నటి)|తులసి]] |
}}
'''నాలుగు స్తంభాలాట''' [[జంధ్యాల]] దర్శకత్వంలో, [[విజయ నరేష్|నరేష్]], [[ప్రదీప్ (నటుడు)|ప్రదీప్]], [[పూర్ణిమ (నటి)|పూర్ణిమ]], [[తులసి (నటి)|తులసి]] ముఖ్యపాత్రల్లో నటించగా [[నవతా కృష్ణంరాజు]] నిర్మించిన 1982 నాటి చలనచిత్రం. నలుగురు యువతీయువకుల జీవితంతో ప్రేమ, పెళ్ళిళ్ళతో జీవితం ఆడుకున్న ఆటగా ఈ కథను రాసుకున్నారు జంధ్యాల. భారమైన ప్రేమకథలో సినిమాల్లో అంతగా అనుభవం లేని హీరోహీరోయిన్లతో నటింపజేసి జంధ్యాల విజయం సాధించారు. హిందీలో ఈ సినిమాను [[సంజయ్ దత్]], [[అశోక్ కుమార్]], పద్మినీ కొల్హాపురి ముఖ్యపాత్రల్లో బేకరార్ అన్న పేరుతో పునర్నిర్మించారు. ఈ సినిమాలో [[మామిడిపల్లి వీరభద్ర రావు|సుత్తి వీరభద్రరావు]], [[కురుమద్దాలి లక్ష్మీ నరసింహారావు|సుత్తి వేలు]] చేసే హాస్యం చాలా ప్రాచుర్యం పొంది, సుత్తి అన్న పదాన్ని తెలుగు నాట ప్రాచుర్యంలోకి తీసుకువచ్చింది. ఆ సినిమా నుంచి వేలు, వీరభద్రరావుల పేర్లకు సుత్తి అనేది ఇంటిపేరు అయ్యింది.
 
== చిత్ర కథ ==
పంక్తి 21:
=== నటీనటుల ఎంపిక ===
బాల నటుడిగా తెలుగులో [[పండంటి కాపురం]], [[దేవదాసు (1974 సినిమా)|దేవదాసు]], [[సంతానం - సౌభాగ్యం]], మలయాళంలో కవిత వంటి సినిమాల్లో నటించిన నరేష్ కి హీరోగా ఇది తొలి చిత్రం. నరేష్ తల్లి, ప్రముఖ నటి, దర్శకురాలు, నిర్మాత [[విజయనిర్మల]] స్వంత నిర్మాణ సంస్థ మీద [[ప్రేమ సంకెళ్ళు]] హీరోగా నరేష్ తొలిచిత్రంగా తీద్దామనకున్నారు. అయితే ఒక డ్యాన్స్ స్కూలుకి [[కె.విశ్వనాథ్]]తో కలిసి వెళ్ళిన జంధ్యాలకు నరేష్ ని చూడగా, అతని గురించి వాకబు చేసి తెలుసుకున్నారు. ఆపైన విజయనిర్మలను కలిసి తను తీయబోయే తదుపరి చిత్రంలో హీరోగా చేయడం గురించి అడిగారు. బయటి పతాకంపై, వేరే దర్శకుని ద్వారా నరేష్ హీరోగా పరిచయమైతేనే బావుంటుందని ఆమెకూ అనిపించడంతో ప్రేమసంకెళ్ళు ప్రాజెక్టును అప్పటికి పక్కనపెట్టారు. అంతకుముందు నుంచే విజయనిర్మలకీ, జంధ్యాలకీ సన్నిహితుడైన సంగీత దర్శకుడు [[రమేష్ నాయుడు]] నరేష్ తో జంధ్యాల సినిమా తీస్తే బావుంటుందనుకుని ప్రోత్సహించారు. ముద్దమందారంలోనే నరేష్ హీరో అయితే బావుంటుందనుకున్నా, చివరికి నాలుగు స్తంభాలాటలో కుదరడంతో ఆయన చాలా సంతోషించారు. అలా నరేష్ సినిమాలో హీరోగా చేశారు. తన తొలిచిత్రం [[ముద్ద మందారం (సినిమా)|ముద్ద మందారంలో]] హీరోహీరోయిన్లుగా పరిచయం చేసిన ప్రదీప్, పూర్ణిమలకు రెండో సినిమా [[మల్లెపందిరి]]లో అతిథి పాత్రలను ఇచ్చిన జంధ్యాల ఇందులో మళ్ళీ హీరోహీరోయిన్ పాత్రలకు తీసుకున్నారు.<br />
ఈ సినిమాకు రెండేళ్ళ క్రితం [[జాతర (సినిమా)|జాతర]] అనే చిత్రంలో తొలిసారి వెండితెరపై కనిపించిన [[మామిడిపల్లి వీరభద్ర రావు|సుత్తి వీరభద్రరావు]], అంతకుముందే జంధ్యాల తొలిచిత్రంలో చిన్నవేషం వేస్తూ నటునిగా ప్రయత్నాలు చేస్తున్న [[కురుమద్దాలి లక్ష్మీ నరసింహారావు|సుత్తి వేలు]]కూ ఈ సినిమాలో హాస్యం పండించే పాత్రలు వచ్చాయి. ఈ సినిమాలో సుత్తి ట్రాక్ విషయంలో కామెడీ పండించిన వాళ్ళిద్దరికీ స్క్రీన్ నేమ్స్ గా సుత్తి స్థిరపడే స్థాయిలో ఈ సినిమాలో హాస్యం విజయవంతమైంది. నిజానికి సినిమాలో మొదటి సుత్తి మీద ట్రాక్ కానీ, వీరభద్రం (సుత్తి వీరభద్రరావు) పాత్రకు గుమస్తా (సుత్తివేలు) పాత్ర కానీ లేవు. అయితే సుత్తి మీద ఓ చిన్న డైలాగుని స్పాట్లో ఉన్న యూనిట్ బాగా ఆస్వాదించడంతో దాన్ని 15 సీన్లకు పెంచారు, అలానే వీరభద్రం ఇంట్లో వంటవాడి పాత్రను సత్తిబాబు అనే నటుడితో చేయించాలని అనుకున్నారు. అయితే వంటవాడి పాత్ర కథాగమనానికి అడ్డుపడుతోందని భావించి దాన్ని తొలగించి, గుమస్తా పాత్రను సృష్టించారు. అప్పటికే జరుగుతున్న ఈ చిత్ర షూటింగ్ సమయంలో స్నేహితుల ప్రోద్బలంతో తనను కలిసిన వేలుకు ఆ పాత్రని ఇచ్చే ఉద్దేశంతో ఓ నాలుగైదు రోజులు సెలవుపెట్టగలరా అని జంధ్యాల అడిగారు. చాలా అదృష్టంగా భావించిన వేలు సెలవుపెట్టి సినిమాలో భాగమయ్యారు.<ref name="జంధ్యామారుతం" />
 
=== చిత్రీకరణ ===
పంక్తి 39:
* గాయత్రిగా [[రోహిణి (నటి)|రోహిణి]]
* వీరభద్రంగా [[మామిడిపల్లి వీరభద్ర రావు|సుత్తి వీరభద్రరావు]]
* గుర్నాథంగా [[కురుమద్దాలి లక్ష్మీ నరసింహారావు|సుత్తి వేలు]]
* నరేష్ అన్నయ్యగా విజ్జిబాబు
* కమల నాన్న మూర్తిగా శంకర్
పంక్తి 69:
[[వర్గం:విజయ నరేష్ నటించిన చిత్రాలు]]
[[వర్గం:సుత్తి వీరభద్రరావు నటించిన సినిమాలు]]
[[వర్గం:సుత్తి వేలు నటించిన సినిమాలు]]