వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
పంక్తి 1,130:
: గాలి ఉంటేనే ఏ జీవి అయినా సంతోషంగా జీవించగలదు, గాలి అనేది లేదు, ఉంటే నాకు చూపించు అంటే ఎవరు చూపించలేరు. నిద్రపోతున్న వారిని లేపగలము గాని, నిద్ర నటిస్తున్న వారిని లేపలేము. సృష్టించబడిన రోజే [[తీగ]] వ్యాసంలో 3000 బైట్లకు మించి తెలుగులో సమాచారం ఉంది. అదనంగా చేర్చబడిన ఆంగ్ల సమాచారం అందరికి అర్థమయ్యే వైర్ అబ్రివేషన్ లకు సంబంధించిన ఒక పెట్టె. పవన్ సంతోష్ గారు మీ ఆరోపణలు నిజమని మీరు తిరుగులేని సాక్ష్యంతో నిరూపించనన్నా నిరూపించాలి లేదంటే క్షమాపణలు చెప్పాలి అని నన్ను అడిగే బదులు, 3000 బైట్లకు మించి తెలుగులో సమాచారం ఉన్న వ్యాసాలను ఎందుకు తొలగిస్తున్నారు, తిరుగులేని సాక్ష్యంతో నిరూపించనన్నా నిరూపించాలి లేదంటే క్షమాపణలు చెప్పాలి అని వ్యాసాలను తొలగిస్తున్న వారిని అడగవచ్చు కదా. [[వాడుకరి:YVSREDDY|YVSREDDY]] ([[వాడుకరి చర్చ:YVSREDDY|చర్చ]]) 16:55, 15 సెప్టెంబరు 2020 (UTC)
:: [[వాడుకరి:YVSREDDY|YVSREDDY]] గారూ, వికీపీడియాలో వ్యాసాలపై తొలగింపు నోటీసులు పెట్టడం, దానిపై చర్చ జరిగి ఉండాలనో, అక్కర లేదనో నిర్ణయం కావడం అన్నది వ్యాసం సృష్టించడం ఎంత సహజమో, అంత సహజమైన ప్రక్రియ. తీగ వ్యాసంలో అనువదించని ఇంగ్లీష్‌ వాక్యాలున్నాయి వారు నోటీసు పెట్టారు. అబ్బే ఇది మంచి వ్యాసమే, ఆకాస్త ఇంగ్లీష్‌ తీసేస్తే పోతుందని మీరు ఆ చర్చలో చెప్పవచ్చు, లేదూ మీరే తీసేయవచ్చు. ఇదంతా కూడా సరైన పద్ధతే! నిర్వహణ మీద శ్రద్ధ ఉన్న వ్యక్తులుగా వెంకటరమణ, ప్రణయ్‌రాజ్‌లు తమ పని తాము చేసినట్లు అక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. ఆమాటకు వస్తే, వారిద్దరూ - తెవికీలోకి వచ్చే ప్రతీ వ్యాసాన్ని తరచి చూసి అందులో సమస్యాత్మకమైన వ్యాసాలపై నోటీసులు పెట్టి, చర్చ చేసి తొలగింపు నిర్ణయాలు తీసుకోవడానికి బోలెడు కృషిచేస్తున్నట్టు వారి వాడుకరి రచనలు చూస్తే తెలుస్తోంది. ఈ తీగ సంగతి పక్కన పెట్టండి - [[వివాహ వార్షికోత్సవం]] అని మీ వ్యాసం ఇంకొకటి ఉంది. దీనిలోనూ అలానే అనువదించని ఇంగ్లీష్‌ పాఠ్యం బోలెడు ఉంది. దీనికీ ప్రణయ్ నోటీస్‌లు పెట్టారు. వెంకటరమణ గారు, మరొక నిర్వాహకులు గతంలో నా వ్యాసాల్లో నాణ్యత తక్కువైన వాటినీ తొలగింపు నోటీసులు పెట్టారు, నేను కృతజ్ఞతలు చెప్పి తొలగించమన్నాను. నిర్వాహకులు రాజశేఖర్ గారు తొలి దశలో చాలా చిన్న చిన్నవీ, విస్తరించే వీలు లేనివీ అయిన వ్యాసాలు రాస్తే, తర్వాతి కాలంలో ఆ వ్యాసాలు అపరిపక్వ దశలో రాశాననీ తొలగించమనీ ఇలాంటి నోటీసులకే చాలా హుందాగా స్పందించారు. మీరు మాత్రం నిర్వహణ పనులు చేసేవారి నైతిక ధైర్యాన్ని దెబ్బతీసేలాంటి వ్యాఖ్యలు నిరాధారంగా చేస్తున్నారని నేను గమనించాను. ఇది కాదని నిరూపించుకోవాల్సిన బాధ్యత, అంటే అవతలి వ్యక్తులు నిర్ద్వంద్వంగా మీ ఒక్కరి మీదే లక్ష్యం చేసుకుని పనిచేస్తున్నారనీ, వారు చేస్తున్నది లక్ష్యం చేసుకోవడమే తప్ప వికీ నిర్వహణ కాదనీ నిరూపించుకోవాల్సిన బాధ్యత మీ మాటల వల్ల మీమీద పడింది. గత చరిత్రలు తవ్వి తీసి నిరూపించుకునేందుకు అవకాశంగా వారం రోజులు ఇచ్చాను. ఇంకో రెండు మూడు రోజులు మిగిలాయి ఆ గడువులో. ఈలోగా మీరు నిరూపించుకోవడమో, క్షమాపణలు కోరడమో, చర్యకు సిద్ధం కావడమో జరగాల్సి ఉంది. ఏ పనిచేసే ముందైనా నాలుగో మూలస్తంభం మరొక్కసారి చదివి చూడండి, అందుకు తగ్గట్టుగా కనీసం భవిష్యత్తులోనైనా వ్యవహరిస్తారని, పొరబాటు దిద్దుకుంటారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 05:56, 19 సెప్టెంబరు 2020 (UTC)
 
#3000 బైట్లకు మించి తెలుగులో సమాచారం ఉన్న వ్యాసాలను ఎందుకు తొలగిస్తున్నారని నిర్వాహకులను అడుగుతుంటే దానికి సమాధానం చెప్పకపోవడం చెవిటోడి ముందు శంఖం ఊదినట్లే వుంది. సాక్ష్యం ఎదురుగా కనబడుతున్నా నిరూపించుకోవాలని కోరడం చిత్రవిచిత్రంగా వుంది. ఒక వ్యాసం ఏదైనా తొలగింపబడితే దాని యొక్క గత చరిత్రలు తవ్వి తీసి నిరూపించేందుకు అవకాశాలు నిర్వాహకులకు మాత్రమే వున్నాయిగాని వాడుకరులకు లేవు. ఒక వాడుకరి ఒక వ్యాసాన్ని సృష్టించి, దానిని ఒక మంచి వ్యాసంగా విస్తరించినా ఆ వ్యాసం తొలగింపబడితే, ఆ వ్యాసం వ్రాసిన వ్యక్తికి కూడా ఆ వ్యాసం గురించిన ఎటువంటి సమాచారం అతనికి లభించదు. ఉదాహరణకు [[వివాహ వార్షికోత్సవం]] అనే తొలగింపబడిన వ్యాసంను పరిశీలిస్తే "06:21, 19 సెప్టెంబరు 2020 Pavan santhosh.s చర్చ రచనలు వివాహ వార్షికోత్సవం పేజీని తొలగించారు" అని మాత్రమే వుంటుంది తప్ప, ఆ వ్యాసాన్ని ఎవరు సృష్టించారు, ఎప్పుడు సృష్టించారు, అందులో ఏమి సమాచారం వుంది అనే విషయాలు ఆ వ్యాసాన్ని సృష్టించిన వాడుకరికి గాని, ఇతర వాడుకరుల గాని తెలియవు. కావున తొలగించబడిన వ్యాసాల గత చరిత్రలు తవ్వి తీసి నిరూపించేందుకు అవకాశాలు వున్న నిర్వాహకులు తొలగించబడిన వ్యాసాల గత చరిత్రలు తవ్వి తీసి నిరూపించవలసిందిగా మనవి.[[వాడుకరి:YVSREDDY|YVSREDDY]] ([[వాడుకరి చర్చ:YVSREDDY|చర్చ]]) 16:47, 21 సెప్టెంబరు 2020 (UTC)
 
== యాంత్రికానువాదాలు ఉడికాయో లేదో.. ఇదుగో పది మెతుకులు చూడండి ==
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:రచ్చబండ" నుండి వెలికితీశారు