భారతదేశంలో ఫ్లూ మహమ్మారి (1918): కూర్పుల మధ్య తేడాలు

"1918 flu pandemic in India" పేజీని అనువదించి సృష్టించారు
(తేడా లేదు)

09:14, 22 సెప్టెంబరు 2020 నాటి కూర్పు

ప్రపంచవ్యాప్తంగా సంక్రమించిన  స్పానిష్  ఫ్లూ లో భాగంగా 1918-1920 మధ్య కాలంలో భారతదేశంలో  ప్రాణాంతకమైన ఫ్లూ మహమ్మారి అసాధారణ రీతిలో ప్రబలింది. భారతదేశంలో ఈ అంటువ్యాధిని బాంబే ఇన్‌ఫ్లూయెంజా లేదా బొంబాయి ఫీవర్ గా పిలుస్తారు. [1] [2] ఈ మహమ్మారి భారతదేశంలో సుమారు 1.4 నుంచి 1.7 కోట్ల వరకు ప్రాణాలను పొట్టనపెట్టుకొన్నదని విశ్వసిస్తారు.   ప్రపంచంలోని మరి ఏ ఇతర దేశంలోను ఇంత భారీ సంఖ్యలో ప్రాణాలు కోల్పోవడం జరగలేదు. [3] [4] భారతదేశంలో దీని ప్రభావాన్ని అధ్యయనం చేసిన డేవిడ్ ఆర్నాల్డ్ (2019) ఈ ప్రాణాంతక ఫ్లూ కారణంగా అప్పటి భారతదేశ జనాభాలో 5% మంది అంటే కనీసం 12 మిలియన్ల మంది చనిపోయారని అంచనా వేశారు. [5] ఈ ప్రాణాంతక అంటు వ్యాధి కారణంగా  దేశ జనాభాలో 5% ప్రజలు తుడిచిపెట్టుకుపోవడంతో దాని ప్రభావం జనాభా లెక్కలపైన ప్రతిఫలించింది.  అంతకుముందు దశాబ్దంతో పోలిస్తే 1921 జనాభా గణనలోనే  తొలిసారిగా  భారత జనాభా తగ్గిపోయింది.  భారత జనాభా క్షీణించిన ఏకైక దశాబ్ద కాలంగా  1911-1921 మధ్య గల దశాబ్ద కాలం చరిత్రలో నిలిచిపోయింది. [6] [7] ఈ మహమ్మారి  వినాశనం కారణంగా భారతదేశంలోని బ్రిటిష్ పాలిత జిల్లాల్లో 1 కోటి 38 లక్లల పైగా జనాభా మరణించారు. [8]

  1. "Deja flu: Spanish Lady killed 14 million in British India a century ago". Times of India. 2020-03-08. Retrieved 2020-04-08.
  2. "Coronavirus: What India can learn from the deadly 1918 flu". BBC. 2020-03-18. Retrieved 2020-04-10.
  3. Mayor, S. (2000). "Flu experts warn of need for pandemic plans". British Medical Journal. 321 (7265): 852. doi:10.1136/bmj.321.7265.852. PMC 1118673. PMID 11021855.
  4. "How the Spanish flu changed the course of Indian history". Gulf News. 2015-03-15. Retrieved 2020-04-08.
  5. David Arnold, "Death and the Modern Empire: The 1918–19 Influenza Epidemic in India," Transactions of the Royal Historical Society 29 (2019): 181-200
  6. "Why 1918 matters in India's corona war".
  7. "What the history of pandemics tells us about coronavirus".
  8. Chandra S, Kuljanin G, Wray J (August 2012). "Mortality from the influenza pandemic of 1918–1919: the case of India". Demography. 49 (3): 857–65. doi:10.1007/s13524-012-0116-x. PMID 22661303. {{cite journal}}: Invalid |ref=harv (help)