బాలానందం (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
production_company = [[ప్రకాష్ ప్రొడక్షన్స్]]|
}}
బాలానందం 1954లో విడుదలైన మూడు ఉప చిత్రాల సమాహారం. ఇది బాలల చిత్రం. ఇందులో బూరెల మూకుడు, రాజయోగం, కొంటె కృష్ణయ్య అనే ఉప చిత్రాలున్నాయి. ఈ మూడు చిత్రాలను కలిపి "బాలానందం" గా నిర్మించారు. ప్రకాష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని [[కోవెలమూడి సూర్యప్రకాశరావు|కె.ఎస్.ప్రకాశరావు]] స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు. ఈ చిత్రం 1954 ఏప్రిల్ 24న విడుదలైంది. దీనికి [[పెండ్యాల నాగేశ్వరరావు]] సంగీతాన్నందించాడు.<ref>{{Cite web|url=https://indiancine.ma/HCC|title=Balanandham Bhoorelamukudu Rajayogam Konte Kistayya (1954)|website=Indiancine.ma|access-date=2020-09-22}}</ref>
 
== బూరెల మూకుడు ==
 
=== కథ ===
ఒక పురోహితుడు శాస్త్రికి ఒకరోజున మూడు రుపాయల పెళ్ళి సంభావన దొరికింది. సంతోషంతో ఆ విషయాన్ని భార్య వెంకమ్మకు చెతుతాడు. వారు ఆ డబ్బుతో బూరెలు వండాలని నిర్ణయించుకుని తమ పక్కింటి వారి దగ్గర బూరెల మూకుడు తీసుకుని వస్తారు. వండిన వెంటనే తిరిగి ఇచ్చేందుకు ఒప్పందం చేసుకుంటారు. దానితో బూరెలు చేసి బాగా తింటారు. మరి ఆయాసంతో కదల లేద ఆ మూకుడును పక్కింటి వారికి ఇవ్వడానికి వాటాలు వేసుకుంటారు. ఎవరూ లేవడానికి ఇష్టపడక మౌనంగా కూర్చోవాలని, ఎవరు ముందు మాట్లాడితే వారే ఆ మూకుడును పక్కింటికి ఇవ్వాలని పందెం వేసుకుని కదలకుండా కూర్చుంటారు. ఇంతలో ఒక స్నేహితురాలు పేరంటానికి పిలవడానికి ఇంటికి వస్తుంది. కానీ వారు కదలకుండా, మాట్లాడకుండా ఉంటారు. ఆమె భయపడి వెళ్ళిపోతుంది. యింటి యజమాని అద్దె కోసం వస్తాడు. అయినా వారు ఏమీ సమాధానం చెప్పరు. వారు పోలీసులకు పిర్యాదు చేస్తారు. పోలీసులు వచ్చి ఎంత పిలిచినా పలకరు. అతను వారికి జబ్బు చేసిందనే అనుమానంతో వైద్యుడిని పిలుస్తారు. వైద్యుడు చూసి వారికి ఏ రోగం లేదని నిర్థారించుకుని భూత వైద్యుడి వద్దకు వెళ్ళమని సలహా ఇచ్చారు. భూతవైద్యుడు సంగతంతా గ్రహించి వాళ్ల గప్ చుప్ భూతాన్ని వదలగొట్టాలనుకుంటాడు. పోలీసు లాఠీ పుచ్చుకుంటాడు. తరువాత జరిగిన ప్రహసనం ఈ కథలొ ఉంటుంది.
 
=== పాట ===
 
* నా వంతు డబ్బు తేవడం, నావంతు బూర్లు వండటం - నా నోరు ఊటలూరడం, బురెలన్నీ నే తినడం!..
 
=== తారాగణం ===
 
* శాస్త్రి : టి.మోహన్
* వెంకమ్మ: జి.శ్యామల
* శేషాచలం: రామకృష్ణ
* పోలీసు: లక్ష్మణ
* డాక్టరు: వి.రామం
* భూత వైద్యుడు: మాస్టార్ కుందు
* పేరంటం: డి.కల్పన
* స్టుడియో కుక్క.
 
== మూలాలు ==
{{మూలాల జాబితా}}
"https://te.wikipedia.org/wiki/బాలానందం_(సినిమా)" నుండి వెలికితీశారు