భారతదేశంలో ఫ్లూ మహమ్మారి (1918): కూర్పుల మధ్య తేడాలు

"1918 flu pandemic in India" పేజీని అనువదించి సృష్టించారు
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం వ్యాసాల అనువాదం ContentTranslation2
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
 
భారతదేశంలో ఈ మహమ్మారి తొలిసారిగా 1918 జూన్ నెలలో బొంబాయిలో అడుగుపెట్టింది. మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొని ఇండియాకు తిరిగి వచ్చిన సైనికులతో పాటు ఈ ప్రాణాంతక అంటువ్యాధి ముంబై  ఓడ రేవుకు ఒక నౌకలో చేరుకుంది. రెండు నెలల వ్యవధి లోనే ఇది పశ్చిమం నుండి దక్షిణానికి, క్రమంగా తూర్పుకు, ఉత్తరానికి వ్యాపించింది. ఆగస్టు నాటికి దేశంలోని అన్ని ప్రాంతాలకి ప్రాకిపోయిన ఈ అంటువ్యాధి మహమ్మారిగా మారి దేశాన్ని అతలాకుతలం చేసింది. ఇది దేశంలోని వివిధ ప్రాంతాలను అలల మాదిరిగా మూడు సార్లు తాకింది. రెండవ సారి చెలరేగినపుడు అత్యధిక మరణాలు సంభవించాయి. 2018, సెప్టెంబరు చివరి వారంలో బొంబాయిలో గరిష్ట మరణాల రేటు సంభవించింది. మద్రాసులో అక్టోబరు మధ్యలో, కలకత్తాలో నవంబరు  నెలలో మరణాల రేటు గరిష్ట స్థాయికి చేరుకొంది.
 
.
 
ఈ అంటువ్యాధి 20 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు గల యువకులను తీవ్రంగా ప్రభావితం చేసింది, పురుషుల కన్నా స్త్రీలు ఎక్కువగా తల్లడిల్లిపోయారు. <ref name="mills">{{Cite journal|vauthors=Mills, I D|year=1986|title=The 1918-1919 Influenza Pandemic— The Indian Experience|journal=The Indian Economic & Social History Review|volume=23|issue=1|doi=10.1177/001946468602300102}}</ref> 1918 నాటి శానిటరీ కమిషనర్ నివేదిక ప్రకారం, బొంబాయి, మద్రాసు రెండు నగరాలలోను వారానికి 200 మందికి పైగా మరణించారని తెలుస్తుంది.. <ref name="bmc journal">{{Cite journal|vauthors=Chandra S, Kassens-Noor E|year=2014|title=The evolution of pandemic influenza: evidence from India, 1918–19|url=https://bmcinfectdis.biomedcentral.com/articles/10.1186/1471-2334-14-510|journal=BMC Infectious Diseases|volume=14|issue=510}}</ref> అదే సమయంలో రుతుపవనాలు విఫలం కావడం వలన దేశంలో కరువు కాటక పరిస్థితులు తలెత్తాయి. దానితో వ్యాధి మరింత వేగంగా  విస్తరించింది. సరైన తిండి లేకపోవడంతో ప్రజలు పస్తులతోను, నిస్సత్తువతోను  కృశిస్తూ జనసమ్మర్థంతో కూడిన నగరాలకు వలస పోవడం జరిగింది. <ref name="bbc">{{Cite web|url=https://www.bbc.com/news/world-asia-india-51904019|title=Coronavirus: What India can learn from the deadly 1918 flu|date=2020-03-18|website=BBC|access-date=2020-04-10}}</ref> దీనివల్ల  అంటువ్యాధులు మరింతగా విజృంభించడంతో పరిస్థితులు తీవ్రంగా  దిగజారిపోయాయి. మరోవైపు ఈ ఘోర విపత్తును ఎదుర్కొనే సామర్థ్యం వలసపాలకులకు  ఏ మాత్రం లేదు. అనూహ్యంగా  పెరిగిపోయిన వైద్య డిమాండ్లకు తీర్చలేక ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ  కూలిపోయింది. పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పడంతో .... బ్రిటీష్ ప్రభుత్వం భారతీయులను వారి ఖర్మకు వదిలివేసిందని ఆరోపణలు వచ్చాయి. ఇటువంటి  విపత్కర పరిస్థితులలో ఫ్లూ మహమ్మారి దేశంలో విశృంఖలంగా చెలరేగిపోతూ మరణమృదంగం మోగించింది. ఫలితంగా మహమ్మారి ధాటికి దేశ జనాభాలో 5 శాతం పైగా ప్రజలు అంటే కనీసం కోటి ఇరవై లక్షల పైగా జనాభా తుడిచిపెట్టుకుపోయారు. మొదటి ప్రపంచ యుద్ధంలో మొత్తం చనిపోయిన వారి సంఖ్య కన్నా ఇది ఎక్కువ . ఫలితంగా, 1919 సంవత్సరంలో జననాలు 30 శాతం తగ్గాయి. 1911-1921 దశాబ్దంలో భారతదేశ జనాభా వృద్ధి&amp;nbsp; రేటు కేవలం 1.2%, యావత్ [[భారతదేశంలో బ్రిటిషు పాలన|బ్రిటిష్ రాజ్]] పాలనా కాలంలో కనిష్ట జనాభా వృద్ధి  రేటు నమోదైన  దశాబ్దం ఇదొక్కటే. ఉత్తరభారతదేశపు ప్రముఖ హిందీ కవి సూర్యకాంత్ త్రిపాఠి తన జ్ఞాపకాలలో " గంగానది శవాలతో ఉప్పొంగిపోయింది..." అని పేర్కొన్నాడు. 1918 నాటి శానిటరీ కమిషనర్ నివేదిక శవాలు కుప్పలుగా పేరుకుపోయాయని, వాటి దహన సంస్కారాలకు కట్టెల కొరత ఉన్నందున, భారతదేశంలోని నదులన్నీ మృతదేహాలతో మూసుకుపోయాయని , <ref name="ET">{{Cite web|url=https://economictimes.indiatimes.com/news/politics-and-nation/an-unwanted-shipment-the-indian-experience-of-the-1918-spanish-flu/articleshow/74963051.cms|title=An unwanted shipment: The Indian experience of the 1918 Spanish flu|date=2020-04-03|website=Economic Times|access-date=2020-04-08}}</ref> పేర్కొంది.