వికీపీడియా:వాడుకరులకు సూచనలు/మూసపేరు, మూస పేజీపేరు: కూర్పుల మధ్య తేడాలు

Created page with '== మూస "పేరు", మూస "పేజీ పేరు" ఒకటే ఉండాలి == వికీలో ఏదైనా మూసను గమ...'
ట్యాగు: 2017 source edit
 
(తేడా లేదు)

08:41, 24 సెప్టెంబరు 2020 నాటి చిట్టచివరి కూర్పు

మూస "పేరు", మూస "పేజీ పేరు" ఒకటే ఉండాలి మార్చు

వికీలో ఏదైనా మూసను గమనిస్తే దాని పైనున్న పట్టీలో ఎడమ చివర v t e మూడు అక్షరాలను చూడొచ్చు - పక్కనున్న బొమ్మలో లాగా.   అందులో v ని నొక్కితే మూస పేజీని తెరిచి చూడవచ్చు, t ని నొక్కితే దాని చర్చ పేజీ తెరుచుకుంటుంది. e ని నొక్కితే మూస దిద్దుబాటు పేజీ (ఎడిట్ పేజీ) తెరుచుకుంటుంది. ఈ మూడు లింకుల వలన ఉపయోగం ఏంటంటే..

మూసను ఏ పేజీలోనైతే ట్రాన్స్‌క్లూడు చేసారో ఆ పేజీనుంచే నేరుగా, ఈ లింకుల ద్వారా ఈ పేజీలను తెరవవచ్చు. లేదంటే, ఈ ట్రాన్స్‌క్లూడు చేసిన పేజీ దిద్దుబాటు పేజీని తెరచి, మూస "మార్పు" ను నొక్కి, అక్కడి నుండి మూస పేజీకి వెళ్ళాల్సి ఉంటుంది. ఉదాహరణకు విజయవాడ పేజీలో అడుగున, {{విజయవాడ పట్టణ మండలంలోని గ్రామాలు}} అనే మూస ఉంది. ఆ మూసను తెరవాలంటే దాని పట్టీలో ఉన్న v t e అనే లింకులను వాడవచ్చు.

అయితే ఈ v t e లింకులు పని చెయ్యాలంటే కింది కండిషను తప్పనిసరి:

మూసలో ఉండే name, మూస పేజీ పేరు - ఈ రెండూ ఒక్కటే అయి తీరాలి. కింది బొమ్మలు చూడండి:

 
మూస పేజీ పేరు: "చత్తీస్‌గఢ్ లోని జిల్లాలు", మూస లోని పేరు (name): "చత్తీస్‌గఢ్" - రెండూ వేరువేరు, కాబట్టి ఇక్కడ లింకులు పనిచెయ్యవు"
 
మూస పేజీ పేరు: "చత్తీస్‌గఢ్ లోని జిల్లాలు", మూస లోని పేరు (name): "చత్తీస్‌గఢ్ లోని జిల్లాలు" - రెండూ ఒకటే, కాబట్టి ఇక్కడ లింకులు పనిచేస్తాయి

ఏ మూసలోనైనా v t e లను నొక్కినపుడు (ముఖ్యంగా v e లు. ఎంచేతనంటే t పేజీని (చర్చ పేజీ) ఇంకా సృష్టించి ఉండకపోవచ్చు), పేజీ ఉనికిలో లేదు సృష్టించండి అని అన్నదీ అంటే దానర్థం.. పై లోపం ఉన్నట్టే. దీనికి పరిష్కారం: సదరు మూసలో name పరామితిని మార్చడమే.