"భారతీయ జనతా పార్టీ" కూర్పుల మధ్య తేడాలు

→‎చరిత్ర: అక్షర దోషం స్థిరం, వ్యాకరణం స్థిరం
(Flag_of_the_Bharatiya_Janata_Party.pngను తీసేసాను. బొమ్మను తొలగించింది:commons:User:EugeneZelenko. కారణం: (Copyright violation; see c:Commons:Licensing (F1): Non-trivial political party logo).)
(→‎చరిత్ర: అక్షర దోషం స్థిరం, వ్యాకరణం స్థిరం)
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
భారతీయ జనతా పార్టీ మాతృ పార్టీ అయిన [[జనసంఘ్]] [[1952]]లో ఏర్పాటైంది. దీనిని జాతీయోద్యమ నేత, మాజీ కేంద్ర మంత్రి అయిన [[శ్యాంప్రసాద్ ముఖర్జీ]] ఏర్పాటు చేశాడు. ఇది హిందూ జాతీయవాద సంస్థ [[రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్]]కు రాజకీయ విభాగంగా పరిగణించబడింది. [[జనసంఘ్]] స్థాపకుడు శ్యాం ప్రసాద్ ముఖర్జీ కాశ్మీర్ జైలులో ఉండగా [[1953]]లో మరణించాడు. ఆ తర్వాత జనసంఘ్ 24 సంవత్సరాలు కొనసాగిననూ ఏ రాష్ట్రంలోనూ [[పార్లమెంటు]] లోనూ చెప్పుకోదగ్గ విజయాలు సాధించలేదు. తొలి సార్వత్రిక ఎన్నికలలో ఈ పార్టీ కేవలం 3 స్థానాలను మాత్రమే పొందినది. కాని క్రమంగా పుంజుకుంటూ వచ్చింది. అయిననూ ఇది [[భారత జాతీయోద్యమం]]లో ప్రముఖ పాత్ర వహించిన [[భారత జాతీయ కాంగ్రెస్]]కు గట్టి పోటీ ఇవ్వలేకపోయింది. కాని [[అటల్ బిహారీ వాజ్‌పేయి]], [[లాల్ కృష్ణ అద్వానీ]] లాంటి భవిష్యత్తు నాయకుల తయారీకి మాత్రం దోహదపడింది.
 
[[1975]]లో [[ఇందిరా గాంధీ]] అంతర్గత [[భారత అత్యవసర స్థితి|అత్యవసర పరిస్థితి]]ని విధించి [[రాజ్యాంగం|రాజ్యాంగము]] కల్పించిన అధికారాన్ని దుర్వినియోగపర్చిన తర్వాత జరిగిన [[1977]] ఎన్నికలలో మరో 3 రాజకీయ పక్షాలతో కల్సికలిసి [[జనతా పార్టీ]]గా ఏర్పడి కాంగ్రెస్ తో పోటీకి నిలబడింది. అత్యవసర పరిస్థితి కాలంలో ఎందరో జనసంఘ్ నాయకులను, కార్యకర్తలను జైలులో ఉంచగా ఆ దురదృష్టకర పరిస్థితిని జనతా పార్టీలో భాగంగా ఉన్న మాజీ జనసంఘ్ నేతలు సద్వినియోగపర్చుకున్నారు. [[1977]] [[లోక్‌సభ]] ఎన్నికలలో కాంగ్రేస్కాంగ్రెస్ కు ముఖ్యంగా ఇందిరా గాంధీకి వ్యతిరేకంగా పోరాడి జనతా పార్టీని గెలిపించుకున్నారు. ఆ తర్వాత [[మురార్జీ దేశాయ్]] నాయకత్వంతో కేంద్రంలో ఏర్పడిన తొలి కాంగ్రెసేతర ప్రభుత్వంలో అటల్ బిహారీ వాజ్‌పేయి కీలకమైన [[విదేశాంగ మంత్రి]] హోదా పొందగా, లాల్ కృష్ణ్కృష్ణ అద్వానీ [[సమాచార శాఖా మంత్రి]]గా పదవి బాధ్యతలు చేపట్టాడు.
రెండు సంవత్సరాల స్వల్పకాలంలోనే [[జనతా పార్టీ]] ప్రభుత్వం పతనం కావడం, జనతా పార్టీలో చీలిక రావడంతో పూర్వపు [[జనసంఘ్]] నేతలు ఆ పార్టీని వదలి బయటకు వచ్చి [[1980]], [[ఏప్రిల్ 6]]న <ref>http://www.eenadu.net/ems/emsmain.asp?qry=305ems8{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> భారతీయ జనతా పార్టీని స్థాపించారు.
 
=== తొలి నాళ్ళు ===
 
అటల్ బిహారీ వాజ్‌పేయి, లాల్ కృష్ణ అద్వానీ లచే [[1980]] [[ఏప్రిల్ 6]]న భారతీయ జనతా పార్టీ స్థాపించబడింది. అటల్ బిహారీ వాజ్‌పేయి భాజపా తొలి అధ్యక్షుడిగా నియమించబడ్డాడు. [[1984]]లో, [[ఇందిరా గాంధీ]] హత్య అనంతరం జరిగిన [[లోక్‌సభ]] ఎన్నికలలో[[కాంగ్రెస్ పార్టీ]] విజయదుందుభి మోగించగా, భాజపా 543 నియోజకవర్గాలలో ఒకటి అవిభాజ్య [[ఆంద్రప్రదేశ్]] లోని [[హనుమకొండ]] కాగా, ఏకే పటేల్ అనే బీజేపీ అభ్యర్థి గెలుపొందిన [[గుజరాత్]] లోని మెహ్సానా నియోజక వర్గం రెండోది. [[హనుమకొండ]] నుంచే కాదు మొత్తం [[ఆంద్రప్రదేశ్]] రాష్ట్రం నుంచి లోక్ సభలో బీజేపీకి ప్రాతినిధ్యం వహించిన ఏకైక వ్యక్తి [[చందుపట్ల జంగారెడ్డి]]. ఇక ఆ ఎన్నికల్లో వాజ్ పాయ్వాజ్‌పేయి, అద్వానీ వంటి బీజేపీ అగ్రనాయకులందరూ పరాజయం పాలయ్యారు.543 నియోజకవర్గాలలో కేవలం రెండింటిని గెలుపొందింది. [[లాల్‌కృష్ణ అద్వానీ]] రథయాత్ర ఫలితంగా [[1989]] లోక్‌సభ ఎన్నికలలో 88 సీట్లను గెలుచుకొని [[జనతాదళ్‌]]కు మద్దతునిచ్చి [[వీ.పీ.సింగ్]] నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడటానికి కారణం అయింది. [[అయోధ్య]]లో రామజన్మభూమి మందిరాన్ని కట్టాలనే ప్రయత్నంతో రథయాత్రలో ఉన్న అద్వానీని [[బీహార్]] ముఖ్యమంత్రి [[లాలూ ప్రసాద్ యాదవ్]] అరెస్టు చేసిన సందర్భాన [[అక్టోబరు 23]], [[1990]]న భాజపా తన మద్దతును వెనక్కితీసుకోగావెనక్కి తీసుకోగా తదుపరి నెలలో [[జనతాదళ్]] ప్రభుత్యం పడిపోయింది.
 
[[1991]] లోక్‌సభ ఎన్నికలలో మండలం, మందిర్ ప్రధానాంశాలుగా జరిగిన ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తన స్థానాలను 120కి పెంచుకొని ప్రధాన [[ప్రతిపక్షం]]గా మారింది. కాంగ్రెస్ [[మైనార్టీ ప్రభుత్వం]]గా పాలన కొసాగించింది. [[1996]] లోక్‌సభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అతి పెద్ద రాజకీయ పక్షంగా అవతరించింది. అప్పటి [[రాష్ట్రపతి]] [[శంకర్ దయాళ్ శర్మ]] అటల్ బిహారో వాజ్‌పేయిని ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించగా బి.జే.పి. ప్రభుత్వం లోక్‌సభ విశ్వాసం పొందుటలో విఫలమైంది. తత్ఫలితంగా వాజ్‌పేయి ప్రభుత్వం 13 రోజులకే పతనమైంది. 13 రోజులు అధికారంలో ఉన్నప్పుడు భాజపాకు కేవలం మూడే మూడు మిత్రపక్షాలు (శివసేన, సమతాపార్టీ, హర్యానా వికాస్ పార్టీ) ఉండేవి.
=== మొదటి భాజపా ప్రభుత్వం ===
[[1998]]లో లోక్‌సభ ఎన్నికలను మళ్ళీ నిర్వహించగా భారతీయ జనతా పార్టీకి మళ్ళీ అత్యధిక స్థానాలు లభించాయి. ఈ పర్యాయం భారతీయ జనతా పార్టీ ఇతర రాజకీయ పార్టీలతో కల్సి [[జాతీయ ప్రజాతంత్ర కూటమి]] (NDA) ను స్థాపించంది. NDA కు లోక్‌సభలో బలం ఉన్నందున [[అటల్ బిహారీ వాజపేయి]] [[ప్రధాన మంత్రి]]గా కొనసాగినారు. కాని [[1999]] మే మాసములో [[ఆల్ ఇండియా అన్నా డి.యం.కే]] అధినేత్రి [[జయలలిత]] భారతీయ జనతా పార్టీ నేతృత్వం లోని ఎన్.డి.ఏ. ప్రభుత్వానికి మద్దతును ఉపసంహరించుకొనగా మళ్ళీ [[ఎన్నికలు]] అనివార్యమయ్యాయి. లోక్‌సభలో విశ్వాస సమయంలో వాజ్‌పేయి ప్రభుత్వం కేవలం ఒకే ఒక్క ఓటు తేడాతో విశ్వాసం కోల్పోయింది.
[[1999]] అక్టోబరులో భారతీయ జనతా పార్టీ నేతృత్వం లోనినేతృత్వంలోని ఎన్.డి.ఏ. కూటమి 303 లోక్‌సభ స్థానాలను గెల్చింది. భారతీయ జనతా పార్టీకి ఇదివరకెన్నడు లభించనంత 183 స్థానాలు లభించాయి. అటల్ బిహారీ వాజ్‌పేయి ముచ్చటగా మూడో పర్యాయం ప్రధాన మంత్రి పీఠాన్ని అధిరోహించారు. అద్వానీకి ఉప ప్రధాన మంత్రిప్రధానమంత్రి హోదా లభించింది. ఈ సారి ఎన్.డి.ఏ. సంకీర్ణ ప్రభుత్వం పూర్తి 5 సంవత్సరాల కాలం అధికారంలో కొనసాగింది.
భాజపా ప్రభుత్వం [[ప్రసార భారతి]] బిల్లుకు మద్దతు ఇచ్చి మీడియా ఛానళ్ళకు మరింత స్వయంప్రతిపత్తి కల్పించింది. ఈ బిల్లుకు భాజపా మద్దతు ఉన్న[[నేషనల్ ఫ్రంట్]] హయంలోనే రూపుదిద్దాల్సి ఉన్నా అప్పటినుంచి వాయిదా పడుతూ వస్తోంది.
 
దేశంలో రవాణా సౌకర్యాలలో కూడా భాజపా నేతృత్వంలోని ఎన్.డి.ఏ.ప్రభుత్వం దృష్టి సారించింది. [[స్వర్ణ చతుర్భుజి]] పథకం కింద దేశం లోని నాలుగు మూలలా ఉన్న 4 ప్రధాన నగరాలైన [[ముంబాయి]], [[ఢిల్లీ]], [[చెన్నై]], [[కోల్‌కత]] లను నాలుగు లేన్ల రహదారి ద్వారా కల్పే బృహత్తర పథకానికి శ్రీకారం చుట్టింది.
 
అప్పటి ప్రధాని హోదాలో వున్న వాజపేయి [[పాకిస్తాన్]]తో స్నేహసంబంధాలకై స్వయంగా ఒంటిచేత్తో మూడు నిర్ణయాలు తీసుకున్నారు. [[1999]]లో [[ఢిల్లీ]] - [[లాహోర్]] బస్సును ప్రారంభం చేశారు. పాకిస్తాన్ ప్రధానమంత్రితో లాహోర్ డిక్లరేషన్ పై సంతకం చేశారు. [[2001]]లో కార్గిల్ సంక్షోభం తర్వాత పాకిస్తాన్ అధినేత[[పర్వేజ్ ముషారఫ్]]ను భారత్ పిలిపించి చర్చలు జరిపినారు, కాని ఆ చర్చలు విఫలమయ్యాయి. టెర్రరిస్టుల దాడి తర్వాత రెండున్నర సంవత్సరాలు భారత్-పాక్ సంబంధాలు క్షీణించిపోయాయి. అటువంటి ఆ సమయంలో ఆగస్టు [[2004]] వాజ్‌పేయి పార్లమెంటులో ప్రసంగిస్తూ "పాకిస్తాన్ తో స్నేహసంబంధాలకైనా జీవితంలోనే చివరి గొప్ప ప్రయత్నం చేస్తా"నని ప్రకటించి ప్రపంచ దేశాఅధినేతలనుదేశాధినేతలను ఆకట్టుకున్నారు.
 
[[2002]] [[గుజరాత్]] అల్లర్ల సమయంలో పార్టీ విమర్శల పాలైంది. గుజరాత్ ముఖ్యమంత్రి [[నరేంద్ర మోడి]] అల్లర్ల సమయంలో హిందువుల గుంపులను ఆపలేదని, ముస్లింలను రక్షించుటలో పోలీసులను ఉపయోగించలేదనే విమర్శలున్నాయి. సుమారు 1000 మంది ఈ సంఘటనలో మరణించారు. వేల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు. అయినా భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని తప్పుపట్టడానికి ప్రయత్నించగా పార్టీలోని అతివాదులు దాన్ని అడ్డుకున్నారు. అలాంటి పరిస్థితితో పార్టీ దెబ్బతింటుందని హెచ్చరించారు. కాని ఆ సంఘటన తర్వాత పార్టీకి మద్దతిస్తున్న పక్షాలు కొన్ని దూరం జరిగాయి.
ఓటమి అనివార్యం అని తెలిసిన పిదప, [[భాజపా]] కు చెందిన [[సుష్మా స్వరాజ్]] , [[ఎల్‌.కె. అద్వానీ]] వంటి ‌పలువురు నాయకులు జన్మతః భారతీయురాలు కాని , ఇతరత్రా కారణాలైనటువంటి భారతీయ భాషలలో ప్రావీణ్యం లేకపోవటం, "[[ఇందిరా గాంధీ]] కోడలు అయిన నాడే తాను హృదయంలో భారతీయురాలైనానని" చెబుతూ [[రాజీవ్ గాంధీ]]ని పెళ్ళాడిన తరువాత భారతదేశంలో 15సంవత్సరాలు (దరిదాపు) వుండి కూడా భారతదేశ పౌరసత్వం తీసుకోకపోవడం వంటి ఇతరత్రా కారణాల దృష్ట్యా [[సోనియా గాంధి]] [[ప్రధానమంత్రి]] కాకూడదని పలు ఆందోళనలు జరిపారు.
 
ప్రజలలో [[వాజపేయి]] కున్న పేరు, ఆర్థికరంగ పురోగతి, పాకిస్తాన్ తో శాంతి వంటి పలు అంశాలవలనఅంశాల వలన [[భాజపా]] గెలుస్తుందనుకొన్న ఓటర్లకు, రాజకీయ విశ్లేషకులకు దాని పరాజయం శరాఘాతం అయ్యింది. గెలుపు నల్లేరుమీద నడక అవుతుందనుకున్న కార్యకర్తలు పనిచేయక పోవటం, సంస్థాగతంగా ప్రచారం సరిగా నిర్వహించి ఓటర్లను ప్రభావితం చేయకపోవడం, [[భాజపా]] ప్రచారం కేవలం దూరదర్శిన్దూరదర్శన్, ఆకాశవాణిలకు పరిమితమవటం వల్లనే ఘోర పరాజయం పాలయ్యామనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో నెలకొంది., భావసారూప్యత గల సాంఘికసాంఘీక మతతత్వ సంస్థలైనటువంటి [[రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్]], [[విశ్వ హిందూ పరిషత్]] సంస్థలు రామ మందిర నిర్మాణం, [[ఉమ్మడి పౌరస్మృతి]] మొదలగు [[భాజపా]] సిద్ధాంతపర ఎన్నికల వాగ్ధానాలు నెరవేర్చని కారణంగా సరైన సహకారాలు అందించక పొవటం, అలాగే భారతీయ జనతా పార్టీ అగ్రనేతలు తమ గెలుపుకు ఆయా సంస్థల సహాయసహకారాలు అవసరం లేదనే ధృక్పదంతో వుండటం వంటి విషయాలు పరాజయానికి దోహదం చేశాయని కొందరి నమ్మకం. కాని ఓటమికి ఆర్థిక అభివృద్ధి ఫలాలు అందని వర్గాలు ఒక కారణం కాగా, ఇంకొక కారణం బలం లేని పార్టీలతో జతకట్టడం అని స్వతంత్ర విశ్లేషకులు తేల్చారు. పైగా "భారత్ వెలిగిపొతోంది" అనే నినాదం ప్రయోజనం చేకూర్చకపోగా, బెడిసి కొట్టింది.
 
జాతీయ ప్రజాస్వామ్య కూటమి అంతర్గత సమస్యలు, [[భాజపా]] యువ, ద్వితీయ శ్రేణి నాయకత్వాల కుమ్ములాటల మధ్య [[లాల్‌ క్రిష్ణ అద్వానీ]]ని పార్టీ అధినేతగా నిర్ణయించి రాబోయే సార్వత్రిక ఎన్నికలలో [[జాతీయ ప్రజాస్వామ్య కూటమి|ఎన్.డి.ఎ]]కి సారథ్యం వహించవలసిందిగా కోరింది. [[వాజ్‌పేయి]]ని పార్టీ అధ్యక్షునిగా ఎన్నుకొన్నా, అది నామమాత్ర లేదా గౌరవార్థస్థానమే, కానీ భవిష్యత్తులో ఆయన ప్రాబల్యం తగ్గుతుందనటానికి ఒక సూచన కూడా. పైగా [[వాజ్‌పేయి]] తన ప్రస్తుత పదవీ కాలం ముగిసిన పిదప ఎన్నికలలో పోటీచేయబోనని ప్రకటించాడు.
 
జూన్ 2005లో [[పాకిస్థాన్]] సందర్శన సందర్భంగా [[మహమ్మద్ అలీ జిన్నా]] "లౌకికవాది" అని చేసిన అద్వానీ వ్యాఖ్యలు పెను దుమారాన్ని సృష్ట్టించాయి. తన పార్టీ అధినాయకత్వానికి యెసరు తెచ్చాయి. పాకిస్థాన్ పర్యటనలో తనపై వున్న 'అతివాది' అన్న ముద్ర చెరిపేసుకోవటానికి అద్వాని ప్రయత్నించాడు, పర్యవసానంగా తన పార్టీలోని హిందూ జాతీయవాదుల నుండి తీవ్ర వ్యతిరేకత, విమర్శలవిమర్శలను నెదుర్కున్నారుఎదుర్కున్నారు, పలు పార్టీ శ్రేణులు రాజీనామా కోరడంతో కొన్ని వారాలు సంయమనం కోల్పోయారు. చివరకు రాజీనామా చేసి, ఉపసంహరించుకొని, తాను చేసిన వ్యాఖ్యలపై ప్రజలకు వివరణ ఇచ్చుకున్నారు.
 
డిసెంబర్ 31, 2005న అద్వాని అధికారికంగా అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నారు, ఆ తరువాత [[రాజ్‌నాథ్ సింగ్]] భాజపా అధ్యక్షునిగా ఎన్నికైయ్యారు.
2005:
* స్వీయ తప్పిదాల వలన గోవా ఎన్నికలలో అధిక్యత తరుగదల, స్వతంత్ర అభ్యర్థులతో కలసి ప్రభుత్వ ఏర్పాటు.
* జార్ఖండ్‌ ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రేస్‌కాంగ్రెస్‌ కుయుక్తులను తూర్పారబట్టిన ప్రసారమాధ్యమాలు, ఆ ప్రభుత్వం కుప్పకూలిన తదనంతరం ముఖ్యమంత్రిగా [[అర్జున్‌ ముండా]] పునర్నియామకం.
* బీహార్‌లో జనతాదళ్‌ (యునైటెడ్‌)తో కలసి ఎన్నికల బరిలో పోటి, గణణీయమైన అధిక్యత. భాజపా మాజీ ముఖ్యమంత్రి [[ఉమా భారతి]] తన స్వంత పార్టీ ప్రకటిస్తూ భాజపా నుంచి రెండవసారి నిష్క్రమణ.
2006:
* పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అస్సాం, పాండిచ్చేరి శాసనసభ ఎన్నికలు. కేవలం అస్సాంలో అధికంగా పది స్థానాల పెరుగుదల.
* స్వతంత్ర అభ్యర్థుల మద్దతు ఉపసంహరణతో కుప్పకూలిన భాజపా ప్రభుత్వం.
* అధ్యక్షునిగా[[రాజ్‌నాథ్‌ సింగ్]] ఎకగ్రీవ అన్నికఎన్నిక.
 
== సిద్ధాంతాలు ==
138

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3041422" నుండి వెలికితీశారు