"ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం" కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
 
==బాల్యం, విద్యాభ్యాసం==
బాలసుబ్రహ్మణ్యం 1946, జూన్ 4 న నెల్లూరుతిరువళ్ళురు జిల్లాలో కోనేటమ్మపేట గ్రామంలో జన్మించారు.<ref>{{Cite web|url=https://www.eenadu.net/cinema/latestnews/sp-balasubrahmanyam-actor-to-singer-life-journey/0201/120112193|title=బహుముఖ ప్రజ్ఞాశాలి..ఎస్పీబీ|website=www.eenadu.net|language=te|access-date=2020-09-25}}</ref> ఈ గ్రామం మొదట గోల్కొండ పాలకుల ఆధీనంలో ఉండేది. ఆ తరువాత 1825 నుండి మద్రాసు ప్రెసిడెన్సీలో భాగమయ్యింది.<ref>{{Cite web|url=https://tiruvallur.nic.in/about-district/|title=Ab klout District {{!}} Tiruvallur District {{!}} India|language=en-US|access-date=2020-09-25}}</ref> ఈయన ఒక సాంప్రదాయ శైవ తెలుగు బ్రాహ్మణ కుటుంబములో జన్మించారు. బాలు తండ్రి సాంబమూర్తి, పేరొందిన హరికథా పండితుడు. తల్లి శకుంతలమ్మ. ముగ్గురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు కల పెద్ద కుటుంబములో బాలసుబ్రహ్మణ్యం రెండవ కుమారుడుగా జన్మించారు. తండ్రి భక్తిరస నాటకాలు కూడా వేస్తుండేవారు. తండ్రే తొలి గురువుగా బాల్యము నుండే బాలుకు సంగీతం మీద ఆసక్తి కలిగింది. ఐదేళ్ళ వయసులో తండ్రితో కలిసి భక్త రామదాసు అనే నాటకంలో నటించారు. ప్రాథమిక విద్య నగరి లోని మేనమామ శ్రీనివాసరావు ఇంటిలో ఉంటూ పూర్తి చేశారు. శ్రీకాళహస్తిలోని బోర్డు పాఠశాలలో స్కూలు ఫైనలు చదివాడు. చదువులోనే కాక, ఆటల్లో కూడా మొదటి వాడుగా ఉండేవాడు. శ్రీకాళహస్తిలో చదివేటప్పుడే జి. వి. సుబ్రహ్మణ్యం అనే ఉపాధ్యాయుడు చెంచులక్ష్మి సినిమాలో సుశీల పాడిన ''పాలకడలిపై శేషతల్పమున'' అనే పాటను ఆలపింపజేసి టేపు మీద రికార్డు చేయించారు. రాధాపతి అనే మరో ఉపాధ్యాయుడు ఈయనను ''ఈ ఇల్లు అమ్మబడును'', ''ఆత్మహత్య'' లాంటి నాటకాల్లో నటింప జేశారు. తర్వాత తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర ఆర్ట్స్ కళాశాలలో పియుసి చదువుతుండగా మద్రాసు ఆలిండియా రేడియోలో ప్రసారమయ్యే ఒక నాటికలో స్త్రీ పాత్ర ధరించారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో బాలు స్వయంగా రాసి, స్వరపరిచి పాడిన లలిత గీతానికి బహుమతి లభించింది.
 
తండ్రి కోరిక మేరకు ఇంజనీరు కావాలనే ఆశయముతో [[మద్రాసు]]లో AMIE కోర్సులో చేరారు. ఆ కాలములోనే వివిధ పాటల పోటీలలో పాల్గొని బహుమతులు గెలుచుకొన్నాడు బాలు. బాలసుబ్రహ్మణ్యం చదువుకునే రోజుల్లోనూ, ఆ తర్వాత పాటలు పాడే రోజుల్లో కొన్నేళ్ళు మంచి ఇంజనీర్ కావాలని, ప్రభుత్వ శాఖల్లో ఇంజనీరుగా పనిచేయాలని కలలు కనేవారు.<ref>{{cite interview|last=ఎస్పీ|first=బాలసుబ్రహ్మణ్యం|subjectlink=|interviewer=యమునా కిషోర్|title=ఎస్పీ బాలసుబ్ర హ్మణ్యం ఎక్స్ క్లూసివ్ ఇంటర్వ్యూ {{!}}{{!}} కాఫీ విత్ యమునా కిషోర్|url=https://www.youtube.com/watch?v=LWRleubHaVM|callsign=|city=|date=|program=|accessdate=}}</ref>
1,452

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3041530" నుండి వెలికితీశారు