పాపం పసివాడు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:త్యాగరాజు నటించిన సినిమాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
కథ సంక్షిప్తంగా
ట్యాగు: 2017 source edit
పంక్తి 19:
 
విదేశాల్లో చికిత్స కోసం పైలట్ అయిన మేనమామతో కలిసి ఛార్టర్ విమానంలో బయలు దేరిన ఒక చిన్న పిల్లవాడు, విధి వశాత్తూ విమానం కూలిపోయి ఎడారి పాలవుతాడు. ఆ విపత్కర పరిస్థితులను ఎదుర్కొని తిరిగి తన తల్లిదండ్రులను ఎలా చేరుకున్నాడన్నది ఈ చిత్ర కథాంశం.
 
== కథ ==
ఆగర్భ శ్రీమంతుడైన వేణుగోపాలరావు, జానకి దంపతులకు సంతానం లేనిది ఒకటే లోటు. అదే కుటుంబంలో వేణుగోపాల్ రావు తమ్ముడు నరసింహం బాధ్యతలు తెలియకుండా తిరుగుతుంటాడు. మరో వైపు ఆయన అక్కయ్యలుగా చెప్పుకునే దుర్గమ్మ, సుబ్బమ్మ తమ పిల్లలతో సహా ఆ ఇంట్లోనే తిష్టవేసుకుని కూర్చుని ఉంటారు. వీళ్ళందరికీ వేణుగోపాల్ రావు ఆస్తి మీద కన్ను ఉంటుంది. జానకి తమ్ముడైన పతి వీరందరి ప్రవర్తన గురించి వేణుగోపాల్ రావుకు చెప్పి హెచ్చరిస్తూనే ఉంటాడు. కొంతకాలానికి జానకి గర్భవతి అవుతుంది. ఆ బిడ్డ కడుపులో ఉండగానే చంపాలని వీరందరూ కలిసి ప్రయత్నాలు చేస్తారు. అలా ఒక ప్రయత్నంలో జానకి మెట్ల మీద నుంచి పడిపోతుంది. కానీ వైద్యులు ఆమెను, బిడ్డనూ బతికిస్తారు. కానీ జానకిని మాత్రం జాగ్రత్తగా చూసుకోమనీ, ఆమెను చలి ప్రదేశాలకు తీసుకువెళ్ళకూడదని చెబుతాడు వైద్యుడు.
 
ఆ దంపతులు తమ కొడుక్కి గోపి అని పేరు పెట్టు గారాబంగా పెంచుకుంటూ ఉంటారు. ఇంతలో హఠాత్తుగా ఆ పిల్లవాడికి క్షయ వ్యాధి ఉందని తెలుస్తుంది. వైద్యులు అతన్ని మంచి వైద్య సదుపాయాలున్న స్విట్జర్లాండుకు తీసుకువెళ్ళమని చెబుతాడు. జానకి అక్కడికి వెళ్ళే వీలులేకపోవడంతో పతి తన మేనల్లుడిని తీసుకుని చార్టర్ విమానంలో ముందుగా ఢిల్లీ వెళ్ళి అక్కడి నుంచి స్విట్జర్లాండుకు వెళ్ళాలని అనుకుంటారు. కానీ ఢిల్లీ వెళ్ళక మునుపే పతికి గుండె నొప్పితో విమానాన్ని ఒక ఎడారి ప్రాంతంలో అత్యవసరంగా దింపేసి మరణిస్తాడు. ఈ ప్రమాదాన్ని గురించి తెలుసుకున్న వేణుగోపాలరావు విమానం పడిపోయిన ప్రదేశం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు. విమానం ప్రమాదవశాత్తూ కాలిపోవడంతో గోపి తనతో ఉన్న కుక్కపిల్లను తీసుకుని తనకు తోచిన దారిన బయటకు వెళ్ళాలని ప్రయత్నిస్తాడు. దారిలో అతనికి అనేక ఆటంకాలు ఎదురవుతాయి. ఒక పాము విషం చిమ్మడంతో అతను కంటి చూపు కోల్పోతాడు. తర్వాత ఒక తేలు కాటేయడంతో స్పృహ తప్పి పడిపోతాడు. ఆ స్థితిలో కొంతమంది కోయదొరలు తమ గూడేనికి తీసుకెళ్ళి చికిత్స చేసి బతికిస్తారు.
 
బాబు దొరికాడన్న సంగతి నరసింహానికి తెలిసి ఎలాగైనా అతన్ని అంతమొందించాలని అన్నకు చెప్పకుండా బయలుదేరతాడు. ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న వేణుగోపాలరావు భార్యతో కలిసి వెళ్ళి తమ బిడ్డను కలుసుకుంటారు. అతన్ని చంపాలనుకున్న నరసింహం ప్రమాదవశాత్తూ కార్చిచ్చులో చిక్కుకుని మరణిస్తాడు.
 
== తారాగణం ==
* వేణుగోపాల్ రావుగా [[ఎస్వీఎస్.వి. రంగారావు]]
* జానకిగా [[దేవిక]]
* గోపిగా మాస్టర్ రాము
* [[నగేష్]]
* పతిగా [[నగేష్]], పైలట్
* [[చిత్తూరు నాగయ్య]], వైద్యుడు
* [[త్యాగరాజు]]
* నరసింహంగా [[కైకాల సత్యనారాయణ]], వేణుగోపాల్ రావు తమ్ముడు
* చక్రపాణిగా [[ఎం.ప్రభాకరరెడ్డి]]
* [[రాజబాబు]]
* [[రాజబాబు]], పత్రికా విలేఖరి
* దుర్గమ్మగా [[సూర్యకాంతం]]
* [[ఛాయాదేవి]]
* సుబ్బమ్మగా [[ఛాయాదేవి (తెలుగు నటి)|ఛాయాదేవి]]
* [[నాగశ్రీ]]
 
* [[ఎం.ప్రభాకరరెడ్డి]]
 
==పాటలు==
ఈ చిత్రానికి [[చెళ్ళపిళ్ళ సత్యం]] సంగీతం దర్శకత్వం వహించాడు. ''అమ్మా చూడాలీ'' అనే పాట బహుళ ప్రజాదరణ పొందింది.<ref>డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.</ref>
*అమ్మ చూడాలీ నిన్ను నాన్నను చూడాలి నాన్నకు ముద్దు ఇవ్వాలి నీ వొడిలో నిద్దుర పోవాలి - [[పి.సుశీల]]
*మంచి అన్నదే కాన రాదు - [[పి.సుశీల]]
*అయ్యో పసివాడా పాపం పసివాడా - ([[ఘంటసాల]])
"https://te.wikipedia.org/wiki/పాపం_పసివాడు" నుండి వెలికితీశారు