శ్రీనివాసరెడ్డి (దర్శకుడు): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 24:
శ్రీనివాసరెడ్డి తన సినీజీవితం ప్రారంభంలో వివిధ దర్శకుల దగ్గర కన్నడ, తెలుగు చిత్రాలకు సహాయ దర్శకుడిగా పనిచేశాడు. 1984లో కన్నడ దర్శకుడు విజయరెడ్డికి సహాయకుడిగా చేరాడు. ఎం. శ్యామ్ ప్రసాద్ రెడ్డి పరిచయంతో తెలుగులో తొలిసారిగా [[ఆహుతి (1987 సినిమా)|ఆహుతి]] సినిమాకు [[కోడి రామకృష్ణ]] ఆధ్వర్యంలో దర్శకత్వ విభాగంలో పనిచేశాడు. తరువాత జి. రామ్ మోహన్ రావు, వై. నాగేశ్వరరావులు దర్శకత్వం వహించిన వివిధ చిత్రాలకు సహాయ దర్శకుడిగా పనిచేశాడు. [[శివనాగేశ్వరరావు]]తో కలిసి మరో మూడు చిత్రాలకు సహ దర్శకుడిగా పనిచేశాడు.
 
అదే సమయంలో శ్రీనివాసరెడ్డి, తన స్నేహితులు (ఆనంద్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, రామలింగేశ్వరారెడ్డి, రామకృష్ణారెడ్డి) సహకారంతో 1997లో [[ఆలీ (నటుడు)|ఆలీ]] హీరోగా వచ్చిన [[ఆషాడం పెళ్ళికొడుకు]] ''సినిమాకు తొలిసారిగా దర్శకత్వం వహించాడు. తరువాత [[సుమన్ (నటుడు)|సుమన్]], [[భానుప్రియ]] ప్రధాన పాత్రల్లో [[ఫిబ్రవరి 14 నెక్లెస్ రోడ్]] పేరుతో సస్పెన్స్ చిత్రానికి దర్శకత్వం వహించాడు. [[ఎం.ఎస్. రెడ్డి]], [[టి. సుబ్బిరామి రెడ్డి]] నిర్మాణంలో అందం అనే చిత్రాన్ని రూపొందించాడు. కానీ ఈ చిత్రం విడుదలకాలేదు. ఆ తరువాత'' 2005లో [[శివాజీ (నటుడు)|శివాజీ]] హీరోగా [[అదిరిందయ్యా చంద్రం]] ''సినిమాను రూపొందించాడు. 2006లో [[టాటా బిర్లా మధ్యలో లైలా|టాటా బిర్లా మధ్యలో లైలా]]'', 2007లో మల్టీస్టారర్ సినిమా ''[[యమగోల మళ్ళీ మొదలైంది]]'' సినిమాలకు దర్శకత్వం వహించాడు.<ref>{{Cite web|url=http://www.idlebrain.com/celeb/interview/srinivasareddy.html|title=Srinivasa Reddy - Telugu Cinema interview - Telugu film director|website=www.idlebrain.com}}</ref> 2008లో ''[[బొమ్మన బ్రదర్స్ చందన సిస్టర్స్]]'' సినిమాకు దర్శకత్వం వహించాడు, ఇది విజయవంతంగా ప్రదర్శించబడింది. <ref>{{Cite web|url=https://telanganatoday.com/lyrical-video-of-ragala-24-gantalo-released|title=Lyrical video of Ragala 24 Gantalo released|website=Telangana Today}}</ref>
 
== సినిమాలు ==