పొన్నెగంటి తెలగన్న: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:జన్మస్థలం తెలియని వ్యక్తులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 44:
యయాతి చరిత్రము అరుదైన అచ్చ తెలుగు కావ్యాల కోవలో తొలికావ్యంగా తెలగన్నకు ప్రాచుర్యాన్ని తీసుకువచ్చింది. తెలుగు భాషలో పదాలు సంస్కృత సమాలు, ప్రాకృత సమాలు, సంస్కృత భవాలు, ప్రాకృత భవాలు, దేశ్యాలు, అన్యదేశ్యాలుగా ఆరు రకాలుగా విభజించారు. సంస్కృత సమాలు(నేరుగా సంస్కృతంలోని పదాలకు చివర తెలుగు విభక్తిని కలపగా వచ్చినవి) తప్ప మిగిలినవి అచ్చతెలుగుగా లెక్కిస్తారు. అచ్చతెలుగుకు సంస్కృత సమాలు కలిస్తే మనది ఆంధ్ర భాష లేదా తెలుగు భాష.
 
సంస్కృత సమపదం ఒక్కటి కూడా రాకుండా పద్యాన్ని రచించడం కొంచెం కష్టమైన పనే. తెలుగు (ఆంధ్ర) భాషలో వందల పద్యాలతో రాస్తూ మధ్యలో ఎక్కడయినా ఒకటి అచ్చతెలుగు పద్యం రాస్తే, అది పాఠకునికీ, శ్రోతకీ ఒక విశ్రాంతిగా ఉంటుంది. వైవిధ్యం వల్ల మనస్సుకి ఉల్లాసం కలుగుతుంది. ఐతే మొత్తం పుస్తకమంతా అచ్చతెలుగులోనే చెప్తే, ఇంకెంత సంబరపడతాడు! దాని చందం తెలిసినవాడు ఎంతగా ఆశ్చర్యపడతాడు! శ్రమను గుర్తించి ఎంతగా కొనియాడతాడు! ఊహించలేం. ఈ అభిప్రాయంతోనే తెలగన్న అచ్చతెలుగు కావ్యాన్ని రాశానన్నాడు అవతారిక పద్యంలో. ఇటువంటి కావ్యం కవి భాషా సృజనశక్తికి అద్దంగా పాఠకుని భాషాసంపదకు ఆలంబనగా నిలుస్తుందని విమర్శకులు బేతవోలు రామబ్రహ్మం పేర్కొన్నారు.
 
== శైలి, శిల్పం ==
"https://te.wikipedia.org/wiki/పొన్నెగంటి_తెలగన్న" నుండి వెలికితీశారు