అహ్మదాబాద్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 95:
| footnotes =
}}
[[గుజరాత్]] రాష్ట్రంలో అతి పెద్ద పట్టణం అయిన '''అహ్మదాబాద్''' నగరాన్ని [[సుల్తాన్ అహ్మద్ షా]], [[సబర్మతి నది]] ఒడ్డున నిర్మించారు. 1411 ఫిబ్రవరి 26 తేదీన [[సూఫీ]] సన్యాసుల సమక్షంలో ఈ నాడు [[ఎలిస్ బ్రిడ్జ్]] అని పిలవబడే ప్రదేశంలో సబర్మతి నది ఒడ్డున శంకుస్థాపన చేశాడు. ఈ శంకుస్థాపన చేసిన ప్రదేశాన్ని ఇప్పటికీ చూడచ్చు ఈ ప్రదేశాన్ని [[మానెక్ బుర్జ్]] అంటారు. అయితే ఈ శంకుస్థాపన తేది గురించి అనేక వివాదాలున్నాయి. చరిత్రకారులు ఎక్కువగా విశ్వసించే తేది మాత్రం ఇదే. దీనికి ఆధారం [[రత్నమణి భీమ్‌రావ్ జోట్]] 1928లో వ్రాసిన "గుజరాత్‌ను పట్నగర్ అమ్దావాద్", అనేక ఇతర చారిత్రాత్మక పుస్తకాలు. అహ్మదాబాద్ గెజిటీర్ ప్రకారం ఈ పట్టణానికి పునాది రాళ్ళు పడిన తేది 1411 మార్చి 4. "మాంచెస్టర్ ఆప్ ఇండియా" అని యూరోపియన్లతో శతాబ్దాల క్రితం కొనియాడబడిన ఈ నగరంలో ఎన్నో సుందరమైన పురాతన కట్టడాలను ఈ నాటికీ పాత పట్టణం (ఓల్డ్ సిటీ) లో చూడొచ్చు. ప్రహరీ కలిగిన ఈ పాత పట్టణంలో అనేక సుందరమైన రాతి తలుపులు (దర్వాజాలు) మనసుని మైమరిపిస్తాయి. ఇది [[భారతదేశంలోని మెట్రోపాలిటన్ ప్రాంతాల జాబితా|మెట్రోపాలిటన్ ప్రాంతం]].
[[బొమ్మ:Sayyadsiddiki.jpg|thumb|200px|right]]
=== చరిత్ర ===
"https://te.wikipedia.org/wiki/అహ్మదాబాద్_జిల్లా" నుండి వెలికితీశారు