తెలుగు సాహిత్యం యుగ విభజన: కూర్పుల మధ్య తేడాలు

చి
2401:4900:216D:D952:AC60:6705:CD26:D8DD (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 3044692 ను రద్దు చేసారు
ట్యాగులు: తిరగ్గొట్టారు చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
చి (2401:4900:216D:D952:AC60:6705:CD26:D8DD (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 3044692 ను రద్దు చేసారు)
ట్యాగు: రద్దుచెయ్యి
 
==యుగ విభజన సౌలభ్యం==
యుగ విభజన అనేది అధ్యయనంలో ఒక కొండగుర్తుగా ఉపయోగపడుతుంది. కొన్ని విశిష్టమైన, సమానమైన ధర్మాలు గల కాలాన్ని ఒక "యుగం" అని వ్యవహరిస్తారు.<ref name="ReferenceA">ద్వా.నా. శాస్త్రి - తెలుగు సాహిత్య చరిత్ర</ref> అంటే ఒక కాలంలోని సాహిత్యంలో సమానమైన, లేదా విలక్షణమైన అంశాలను ఆ యుగం పేరుతో గుర్తిస్తారు. యుగ in.విభజన ఎలా చేసినా గాని అది సమగ్రం, నిర్దుష్టం అని చెప్పలేము. అందేదో ఒక విధముగా అతి వ్యాప్తి, అవ్యాప్తి దోషములు కనిపిస్తూనే ఉంటాయి. ఒకే విధమైన కావ్యములు వివిధ కాలాలలో వెలువడవచ్చును. ఒకే కాలంలో బహువిధాలైన రచనలు కూడా రావచ్చును. ఒక కాలంలో పెక్కురు ఉద్ధండులైన పండితులుండవచ్చును. వాఙ్మయకారులు తమ అభిరుచిని బట్టి సౌకర్యం కోసం ఎలాగైనా యుగ విభజన చేయవచ్చును.<ref>దివాకర్ల వేంకటావధాని - ఆంధ్ర వాఙ్మయ చరిత్రము</ref>
వాఙ్మయంలో అంతర ప్రవృత్తి, బాహ్య ప్రవృత్తి అనే రెండు అంశాలున్నాయి. ఇవి కాలాన్నిబట్టి మారడం మనం గ్రహించవచ్చును. అందుకు బయటి భాషా, జాతుల సంపర్కం ఒక కారణం. సమాజాంతర్గతమైన మార్పులు మరొక కారణం. సాహితీ ప్రక్రియలలో అంతకు ముందు కాలంనుండి ఒక ముఖ్యమైన మార్పు సంభవించిన "హద్దు"ను యుగం మారందని చెప్పే సమయంగా భావించవచ్చును. సాహిత్య చరిత్రను అధ్యయనం చేసేటప్పుడు సాహితీమూర్తులనే యుగకర్తలుగా గుర్తించడం భావ్యం అని పింగళి లక్ష్మీకాంతం అభిప్రాయం.
 
5,845

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3044761" నుండి వెలికితీశారు