సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం: కూర్పుల మధ్య తేడాలు

→‎విచారణ: విస్తరణ
పంక్తి 25:
 
25 జూలై న సుశాంత్ తండ్రి కె.కె సింగ్ తను నివసించే పట్టణం [[పాట్నా]] లో రియా మరియు ఆరుగురు ఇతరులు (రియా కుటుంబ సభ్యుల) పై సుశాంత్ ను ఆత్మాహుతికి ప్రేరేపించినట్లు FIR దాఖలు చేసారు <ref>[https://indianexpress.com/article/india/sushant-singh-rajput-case-enforcement-directorate-books-rhea-chakraborty-6532733/ రియా చక్రబొర్తి యే తమ కుమారుడిని ఆత్మాహుతికి ప్రేరేపించింది అని సింగ్ FIR]</ref>. ఈ FIR లో ఇంకా దొంగతనం, నమ్మకద్రోహం మరియు మోసం వంటి ఆరోపణలు కూడా చేశారు. రియా ఆర్థికంగా సుశాంత్ ను మోసం చేసిందని మానసికంగా హింసించిందని పేర్కొన్నాడు <ref>[https://www.hindustantimes.com/india-news/from-theft-cheating-to-breach-of-trust-sushant-singh-rajput-s-father-charges-against-rhea-chakraborty/story-DkKuZSXUmBsxhBip9piO3N.html FIR లో రియాపై మరిన్ని నేరారోపణలు]</ref>. సుశాంత్ మరణంలో తన ప్రమేయం లేదని, సుశాంత్ తండ్రివి తప్పుడు ఆరోపణలని రియా సుప్రీం కోర్టుకు విన్నవించుకొంది <ref> [https://www.dnaindia.com/bollywood/report-rhea-chakraborty-alleges-sushant-singh-rajput-s-father-kk-singh-falsely-implicating-her-in-actor-s-death-case-2835023 తన పై నేరారోపణలు అసత్యాలు అని తెలిపిన రియా]</ref>. పాట్నాలో కేసు తప్పుదోవ పట్టవచ్చని, కేసును ముంబయి కి బదిలీ చేయాలని రియా కోరింది <ref>[https://www.hindustantimes.com/bollywood/rhea-chakraborty-tells-sc-she-was-in-live-in-with-sushant-singh-rajput-for-a-year-his-father-used-influence-to-file-fir-against-her/story-LsI3VTPaIpKN7PpO4PZgQM.html నిష్పక్షపాత విచారణ నిమిత్తం కేసును ముంబయికి తరలించాలని విన్నవించుకొన్న రియా]</ref>. సుశాంత్ తండ్రి యొక్క ఫిర్యాదు మేరకు ఆర్థిక నేరాలను శోధించే Enforcement Directorate 150 మిలియను రూపాయల మనీ లాండరింగ్ కేసును దాఖలు చేసింది. <ref> [https://www.ndtv.com/india-news/sushant-singh-rajput-case-actor-rhea-chakraborty-asked-to-appear-before-enforcement-directorate-by-friday-2274795 రియా పై మనీ లాండరింగ్ ఆరోపణలు చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్]</ref>
 
13 జూన్ న సుశాంత్ తన ఇంట్లో ఒక పార్టీ నిర్వహించాడని పలు నివేదికలు తెలిపిననూ, సుశాంత్ ఇంట్లో పనివారు, వారిని విచారించిన బీహార్ పోలీసులు ఈ వార్తను నిరాకరించారు. తొలుత సుశాంత్ ఇంట్లో ఉన్న CCTV పని చేయటం లేదని తెలిపిన ముంబయి పోలీసులు 3 ఆగస్టు న మాత్రం తాము CCTV ఫుటేజ్ ని పరిశీలించామని ఆ రోజు ఎటువంటి పార్టీ జరుగలేదని ధృవీకరించారు.
 
సుశాంత్ బ్యాంక్ ఖాతాల నుండి రియా చక్రబొర్తి బ్యాంక్ ఖాతాకు ఎటువంటి డబ్బు చేరలేదని ముంబయి పోలీసు కమీషనర్ 3 ఆగస్టు న తెలిపారు. 4 ఆగస్టు న గ్రాంట్ థార్టన్ అనే ఫైనాన్షియల్ ఫోరెన్సిక్ ఆడిటింగ్ సంస్థను ముంబయి పోలీసు నియమించింది.
 
6 ఆగస్టు న భారతదేశ ప్రభుత్వ అత్యున్నత విచారణ సంస్థ అయిన CBI (Central Bureau of Investigation) పాట్నా FIR ఆధారంగా రియా చక్రబొర్తిని ముద్దాయిగా పేర్కొంటూ కేసును తమ అధీనం లోకి తీసుకొంది.
 
19 ఆగస్టున సుప్రీం కోర్టు విచారణ బాధ్యతలు CBI తీసుకోవడాఅనికి అనుమతించటమే కాక, భవిష్యత్తులో సుషాంత్ మరణానికి సంబంధించిన అన్ని చట్టపరమైన కేసులను CBI పర్యవేక్షించాలని అజ్ఞాపించింది. న్యూ ఢిల్లీ కేంద్రంగా పని చేసే AIIMS (All India Institute of Medical Sciences) యొక్క Forensic Medicine HOD అయిన సుధీర్ గుప్తా ను ఈ కేసు లో సహాయసహకారాలను అందించేందుకు CBI నియమించింది. 21 ఆగస్టున గుప్తా "హత్య కోణం లో కూడా మేము దర్యాపు చేస్తాం. అయితే, మిగితా అన్నీ కోణాలను కూడా మేము నిశితంగా పరిశీలిస్తాం." అని PTI (Press Trust of India) కు తెలిపారు. "పోస్టు మార్టం జరిగిన సమయంలో ఇతర సాక్ష్యాధారాలను కూడా పరిగణలోకి తీసుకొని ఆత్మాహుతి, హత్యారోపణల దిశగా పరిశీలిస్తాం." అని ఏషియన్ న్యూస్ ఇంటర్నేషనల్ కు తెలిపారు.
 
== ఇవి కూడా చూడండి ==