గంగోత్రి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
 
==స్థల పురాణం==
[[బొమ్మ:గంగోత్రిలో భాగీరధుడు.JPG|thumb|left|గంగోత్రిలో భాగీరధుడు తపస్సు చేసిన స్థలం]]
హిందూ పురాణలలో గంగాదేవి స్వర్గ నివాసితురాలని రాజకుమారుడు భాగీరధుడు [[కపిలముని]]చే శపించబడిన తన పూర్వీకులను ఉద్దరించడానికి గంగానదిని స్వర్గంనుండి తీసుకు వచ్చాడని వర్ణించబడింది. గంగా ఉదృతిని భూదేవి భరించలేదని అందువలన శివుడు తన జఠాఝూటాలలో బంధించి భూమికి మెల్లగా పంపాడని ప్రతీతి.<br />
[[సగరుడు]] అనే రాజు రాక్షస సంహారం తరవాత పాప పరిహారార్ధం [[ఆశ్వమేధం]] చేశాడు. [[దేవేంద్రుడు]] సగరుని వైభవాన్ని చూసి కించిత్తు భయపడి సగరుడు తనపదవికి పోటీకి రాగలడన్న భీతితో సాగరుని అశ్వమేధ అశ్వాన్ని అపహరించి దానిని కపిలముని ఆశ్రమంలో కట్టి వేస్తాడు. ఈ విషయం తెలియని 60 వేల సగరుని కుమారులు అశ్వరక్షణార్ధం అశ్వం వెంట వచ్చి కోపంతో కపిల మహాముని ఆశ్రమంలో ప్రవేశిస్తారు. [[తపో దీక్ష]]లో ఉన్న కపిలముని తన తపోభంగానికి కారణమైన సగరుని కుమారులు 60వేల మందిని భస్మం చేస్తాడు. సగరుని మనుమడు తన పితరుల ఊర్ధ్వ గతుల కోసం తపస్సు చేసి గంగాదేవిని ప్రత్యక్షం చేసుకుంటాడు. ప్రత్యక్షం చేసుకున్న గంగాదేవిని స్వర్గంనుండి భూమికి వచ్చి తన పితరులకు మోక్షం ప్రసాదించమని వేడుకుంటాడు. గంగాదేవి తనరాక భూమి భరించలేదని దానిని భరించగలిగినవాడు ఒక్క సాంభ శివుడేనని చెప్తుంది. భాగీరధుడు శివుణ్ణి గంగాదేవిని భూమికి తీసుకువచ్చే ప్రయత్నంలో సహకరించమని కోరుకుంటాడు. శివుడు అందుకు అంగీకరించి గంగానదిని తన జటాఝూటాలలో బంధించి మెల్లగా భూమి మీదికి వదిలినట్లు పురాణాలు చెప్తున్నాయి.
"https://te.wikipedia.org/wiki/గంగోత్రి" నుండి వెలికితీశారు