సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం: కూర్పుల మధ్య తేడాలు

→‎విచారణ: విస్తరణ
→‎విచారణ: విస్తరణ
పంక్తి 33:
 
19 ఆగస్టున సుప్రీం కోర్టు విచారణ బాధ్యతలు CBI తీసుకోవడాఅనికి అనుమతించటమే కాక, భవిష్యత్తులో సుషాంత్ మరణానికి సంబంధించిన అన్ని చట్టపరమైన కేసులను CBI పర్యవేక్షించాలని అజ్ఞాపించింది. న్యూ ఢిల్లీ కేంద్రంగా పని చేసే AIIMS (All India Institute of Medical Sciences) యొక్క Forensic Medicine HOD అయిన సుధీర్ గుప్తా ను ఈ కేసు లో సహాయసహకారాలను అందించేందుకు CBI నియమించింది. 21 ఆగస్టున గుప్తా "హత్య కోణం లో కూడా మేము దర్యాపు చేస్తాం. అయితే, మిగితా అన్నీ కోణాలను కూడా మేము నిశితంగా పరిశీలిస్తాం." అని PTI (Press Trust of India) కు తెలిపారు. "పోస్టు మార్టం జరిగిన సమయంలో ఇతర సాక్ష్యాధారాలను కూడా పరిగణలోకి తీసుకొని ఆత్మాహుతి, హత్యారోపణల దిశగా పరిశీలిస్తాం." అని ఏషియన్ న్యూస్ ఇంటర్నేషనల్ కు తెలిపారు.
 
26 ఆగస్టున Narcotics Control Bureau రియా, రియా సోదరుడు షోవిక్ మరియు ఇంకొక ముగ్గురి పై FIR దాఖలు చేసింది. ఆర్థిక విచారణలో రియా, షోవిక్ లకు మాదకద్రవ్యాలు అందినవి అని తేలిన తర్వాత, ఇక పై విచారణలో పాల్గొనటానికి ED NCB కి ఆహ్వానం పంపింది. గంజాయి వాడారని తేలడంతో Narcotic Drugs and Psychotropic Substances Act (NDPS Act) చట్టం క్రింద ఈ FIR దాఖలు చేయబడ్డది. ఇదే చట్టం క్రింద 4 సెప్టెంబరున షోవిక్ ను, సుశాంత్ ఇంటి నిర్వాహకుడిని అరెస్టు చేయడం జరిగింది. 9 సెప్టెంబరున NCB రియా ను సుశాంత్ కు డ్రగ్స్ సరఫరా చేసిన అభియోగం పై అరెస్టు చేశారు. సుశాంత్ మరణం పై జరుగుతోన్న విచారణలో మాదకద్రవ్యాల వినియోగానికి సంబంధించి అరెస్టు చేయబడ్డ 20 మంది లో రియా కూడా ఒకరు. 6 అక్టోబరున ముంబయి సెషన్స్ కోర్టు రియా రిమాండు ను 20 అక్టోబరు వరకు పొడిగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ, ఆ తర్వాతి రోజే ముంబయి హై కోర్టు రియాకు బెయిలు మంజూరు చేసింది. సుశాంత్ కు మాదకద్రవ్యాలు అందించి రియా నే అనే NCB వాదన ను ముంబయి హై కోర్టు తోసిపుచ్చింది. పైగా మాదక ద్రవ్యాల వర్తకులతో రియాకు ఎటువంటి భాగస్వామ్యం లేదని తేలింది. దీనితో జస్టిస్ సారంగ్ కొత్వాల్, "తాను ఖరీదు చేసిన మాదకద్రవ్యాలను ఆర్థిక, మరే ఇతర లాభాల కోసం వేరొకరికి అందించ లేదు." అని పేర్కొన్నారు.
 
3 అక్టోబరు న AIIMS కు చెందిన సుధీర్ గుప్తా, "సుశాంత్ ది ఆత్మహత్యే. హత్య అనే వాదనకు తావు లేదు." అని తెలిపారు. ANI కు తెలుపుతూ, "ఉరి తప్పితే అతని శరీరం పై ఎటువంటి గాయాలు లేవు. ఎటువంటి ప్రతిఘటన/గింజుకొనే ప్రయత్నం, అతని శరీరం దుస్తులపై లేదు." అన్నారు. 5 అక్టోబరున AIIMS మెడికల్ బోర్దు CBI కి సుశాంత్ ది ముమ్మాటికీ ఆత్మహత్యే, హత్య కాదు అని నివేదిక సమర్పించినట్లు ANI పేర్కొంది.
 
== ఇవి కూడా చూడండి ==