సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం: కూర్పుల మధ్య తేడాలు

→‎విచారణ: విస్తరణ
→‎విచారణ: ప్రతిస్పందనలు
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 37:
 
3 అక్టోబరు న AIIMS కు చెందిన సుధీర్ గుప్తా, "సుశాంత్ ది ఆత్మహత్యే. హత్య అనే వాదనకు తావు లేదు." అని తెలిపారు. ANI కు తెలుపుతూ, "ఉరి తప్పితే అతని శరీరం పై ఎటువంటి గాయాలు లేవు. ఎటువంటి ప్రతిఘటన/గింజుకొనే ప్రయత్నం, అతని శరీరం దుస్తులపై లేదు." అన్నారు. 5 అక్టోబరున AIIMS మెడికల్ బోర్దు CBI కి సుశాంత్ ది ముమ్మాటికీ ఆత్మహత్యే, హత్య కాదు అని నివేదిక సమర్పించినట్లు ANI పేర్కొంది.
 
== ప్రతిస్పందనలు ==
సుశాంత్ మరణం ఊహించనిదిగా, మరియు ఆశ్చర్యం కలిగించేదిగా అభివర్ణించబడింది. మానసిక ఆరోగ్యం పై పలు చర్చలకు తెర తీసింది. చాలా మంది ప్రముఖ నేతలు మరియు నటీనటులు సాంఘిక మాధ్యమాలలో స్పందించారు. ట్విట్టర్ లో ప్రధాని [[నరేంద్ర మోడీ]] "a bright young actor gone too soon" అని తెలిపారు. క్రికెటీర్లు [[సచిన్ టెండుల్కర్]] మరియు [[విరాట్ కోహ్లి]] లు తమ ఆశ్చర్యాన్ని వెలిబుచ్చారు.
 
సుశాంత్ మరణించిన కొన్ని గంటల వ్యవధిలోనే కాంగ్రెస్ నేత సంజయ్ నిరుపం, 2019 లో విడుదల అయిన చిచోరే వంటి బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించిన తర్వాత సుశాంత్ తొమ్మిది చిత్రాలను ఒప్పుకొన్నాడని, అయితే ఆరు నెలల కాలవ్యవధి లోనే అన్ని అవకాశాలు కనుమరుగైయాయని తెలిపారు.
 
15 జూన్ న మహరాష్ట్ర సైబర్ పోలీసు కొందరు అసౌకర్యం కలిగించేలా సుశాంత్ ఫోటోలు పోస్టు చేస్తున్నారని, ఇటువంటి వారి పై చట్టపరమైన చర్యలు తీసుకొనవలసి వస్తుందని హెచ్చరిక జారీ చేసింది.
 
== ఇవి కూడా చూడండి ==