సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం: కూర్పుల మధ్య తేడాలు

→‎విచారణ: ప్రతిస్పందనలు
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 44:
 
15 జూన్ న మహరాష్ట్ర సైబర్ పోలీసు కొందరు అసౌకర్యం కలిగించేలా సుశాంత్ ఫోటోలు పోస్టు చేస్తున్నారని, ఇటువంటి వారి పై చట్టపరమైన చర్యలు తీసుకొనవలసి వస్తుందని హెచ్చరిక జారీ చేసింది.
 
31 జూలై నాటికి కనీసం ముగ్గురు సుశాంత్ అభిమానులు సుశాంత్ వలె నే ఆత్మాహుతికి పాల్పడ్డారు. వీరిలో ఒక టీవీ నటుడు, ఒక 13 ఏళ్ళ బాలిక కూడా కలరు.
 
రియాపై అభియోగాల మోపబడ్డ తర్వాత రియాను దూషిస్తూ, బెదిరిస్తూ భోజ్ పురి భాషలో చిత్రీకరించబడ్డ గీతాలు కొన్ని బీహార్ లో జనాదరణ పొందాయి.
 
సుశాంత్ సోదరి శ్వేతా సింగ్ కీర్తి సుషాంత్ కోసం సామూహిక ప్రార్థన (Global Prayers for SSR) తలపెట్టింది. 15 ఆగస్టు స్థానిక కాలమానం ప్రకారం ఉ: గం| 10.00 | ని కి సుశాంత్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ ఈ ప్రార్థనలో పాల్గొనవలసిందిగా ప్రకటించింది. కుటుంబ సభ్యులు మరియు అభిమానులతో బాటు బాలీవుడ్ కు చెందిన కృతి సనన్, అంకిత లోఖండే మరియు ఏక్తా కపూర్ ఈ ప్రార్థనలో పాలుపంచుకొన్నారు.
 
సుశాంత్ కేసు ప్రసార మాధ్యమాలలో విస్తృతంగా, అవిరామంగా చర్చించబడింది. 3 సెప్టెంబరు 2020 రెండు PIL (Public Interest Litigation) లను పరిగణలోకి తీసుకొంటూ ముంబయి పోలీసు కు వ్యతిరేకంగా "అనుచిత, దురుద్దేశ్యపూర్వకంగా మరియు ప్రసార మాధ్యమాలలో తప్పుడు ప్రచారాన్ని" ఉద్దేశ్యించి బొంబాయి హై కోర్టు, "ఈ కేసు విచారణకు ఏ విధమైన అడ్డుకట్టలు పడకుండా ఉండేలా ప్రసార మాధ్యమాలలో తమ ప్రచారాన్ని నిగ్రహించుకోవాలని కోరుతున్నాం మరియు ఆశిస్తున్నాం". అని సలహా ఇచ్చింది. 5 అక్టోబరు 2020న ముంబయి పోలీసు మరియు దాని అనుబంధ సైబర్ యూనిట్ సాంఘిక మాధ్యమాలు 80,000 కు పైగా ఫేక్ అకౌంట్ ల ను గుర్తించారు. ఆసియా, ఐరోపా ఖండాలలోని వివిధ దేశాల నుండి ఈ అకౌంట్లు వారి అధికారిక విచారణకు అపకీర్తి తెచ్చేలా పోస్టులు చేస్తున్నట్లు తెలిపారు. పోలీసు కమీషనర్ పరం వీర్ సింగ్, "అప్పటికే 6,000 మంది పోలీసు ఉద్యోగులకు కరోనా వైరస్ సోకి ఉంది. 84 పోలీసు ఉద్యోగులు వైరస్ వల్ల మృతి చెందారు. ఈ దుష్ప్రచారాలు మా మీద బురద చల్లటానికి, విచారణను ప్రక్కదారి పట్టించటానికి చేయబడ్డాయి. చట్టాన్ని అతిక్రమించిన వారి పై Information Technology Act చట్టం క్రింద కేసు నమోదు చేస్తాం." అని తెలిపారు.
 
== ఇవి కూడా చూడండి ==