షాహ్ నామా: కూర్పుల మధ్య తేడాలు

"Shahnameh" పేజీని అనువదించి సృష్టించారు
"Shahnameh" పేజీని అనువదించి సృష్టించారు
పంక్తి 13:
[[దస్త్రం:The_assassination_of_Chosroës_Parvez.jpg|ఎడమ|thumb|283x283px|1535లో అబద్ అల్ సమద్ రూపొందించిన "షాహ్ తహ్మస్ప్ యొక్క షానామా" మాన్యుస్క్రిప్టులో రెండవ ఖుస్రో హత్యా దృశ్యం.]]
977లో ఫిరదౌసి ''షానామా'' రాయడం ప్రారంభించి, 1010 మార్చి 8న పూర్తి చేశాడు. ''షానామా'' కవిత్వంలోనూ, చరిత్ర రచనలోనూ అత్యంత ప్రముఖమైనదిగా నిలిచిపోయింది. ఈ రచన ఫిరదౌసీ, అతని సమకాలీనులు, పూర్వీకులు ఇరాన్ ప్రాచీన చరిత్ర అని దేన్ని భావించారో ఆ వృత్తాంతానికి కవితాత్మక రూపంగా నిలిచింది. ఈ వృత్తాంతాన్ని గద్యరూపంలో రాసిన రచనలు అనేకం ఉన్నాయి. ''అబూ-మన్సూరి షానామా'' ఈ తరహా గద్య రచనలకు ఒక ఉదాహరణ. ''షానామా'' మొత్తంగా చూస్తే పూర్తిగా ఫిరదౌసీయే కల్పించిన రచన కొద్ది భాగమే. అదీ మొత్తం ''షానామా''లో అక్కడక్కడా చెదురుమదురుగా కనిపిస్తూంటుంది.
 
''షానామా'' తొలినాళ్ళకు చెందిన నూతన పర్షియన్ భాషలో 50 వేలకు పైగా ద్విపద కవితల్లో రాసిన ఐతిహాసిక కావ్యం. ఇది ప్రధానంగా ఈనాటి ఈశాన్య [[ఇరాన్]] ప్రాంతంలోని తన ప్రాంతమైన టుస్ నగరంలో ఫిరదౌసి తన జీవితంలోని తొలి దశ గడుపుతున్నప్పుడు రూపొందిన ''షానామా'' అనే మరో గద్య రచన దీనికి ఆధారం. ''షానామా'' అన్న ఈ గద్య రచన ''ఖ్వాదే-నమగ్'' (రాజుల పుస్తకం) అన్న పహ్లవీ (మధ్య పర్షియన్ భాష) రచనకు అనువాదం. ఈ ''ఖ్వాదే-నమగ్'' అన్నది పర్షియాకు చెందిన రాజులు, వీరులకు సంబంధించిన గాథలను పౌరాణిక కాలం నుంచి రెండవ ఖుస్రో (క్రీ.శ. 590-628) కాలం వరకూ సేకరించి చేసిన సంకలనం. ఇది ససానియన్ సామ్రాజ్య కాలపు మలి దశలో రూపొందింది. ''ఖ్వాదే-నమగ్'' లో ససానియన్ సామ్రాజ్యపు మలిదశకు చెందిన చారిత్రక సమాచారం ఉంటుంది, ఐతే క్రీ.శ. 3, 4 శతాబ్దాలకు చెందిన తొలి ససానియన్ సామ్రాజ్యపు దశకు చెందిన వివరాలు మాత్రం చారిత్రక మూలాలు, ఆధారాల నుంచి సేకరించి రాసినట్టుగా కనిపించవు.<ref>{{Cite book|title=Zurvan: a Zoroastrian Dilemma|last=Zaehner|first=Robert Charles|publisher=Biblo and Tannen|year=1955|isbn=0819602809|page=10|author-link=Robert Charles Zaehner}}</ref> ఈ మొత్తం గాథలకు ఫిరదౌసి ఏడవ శతాబ్ది మధ్యకాలంలో ముస్లిం సైన్యాలు ససానియన్లను ఓడించి సింహాసనం నుంచి గద్దెదించిన గాథను చేర్చాడు.
"https://te.wikipedia.org/wiki/షాహ్_నామా" నుండి వెలికితీశారు