రక్త దానం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 15:
==రక్తపు వ్యాపారం==
 
మనం రక్తం ఇచ్చినప్పుడు 'దానం' చేస్తాం. ఆసుపత్రి వారు మనకి రక్తం ఎక్కించినప్పుడు డబ్బు వసూలు చేస్తారు. కనుక ఇది ఒక రకమైన 'ధర్మ వ్యాపారం.' సా. శ. 2008 లో ముడి చమురు వెల పీపా ఒక్కంటికి 120 అమెరికా డాలర్లు. అదే పీపాడు రక్తం బజారులో కొంటే సునాయాసంగా $20,000 పైనే పలుకుతుంది. ముడి చమురుని అంశిక స్వేదనం చేసి పెట్రోలు, కిరసనాయిలు, వగైరాలుగా చేసి చిల్లరగా అమ్మితే పీపాకి ఓ $500 రావచ్చు. అదే విధంగా రసిని విడి విడి కారణాంశాలుగా విడగొట్టి అమ్మితే పీపాకి $70,000 పైనే వస్తుంది. సాలుకి సగటున 20 మిలియను గేలన్ల రక్తాన్ని పోగు చేసి వ్యాపారంలో తిప్పుతున్నారు. ఈ రక్తం బజారు వెల $20,000,000,000. ఇంత డబ్బుతో వ్యవహారం అయినప్పుడు అత్యాస కి అవకాశాలు పుడతాయి. ఇలాంటి సందర్భాలలోనే రక్తపు సరఫరా రోగగ్రస్తమయిన రక్తంతో కల్తీ అయే ప్రమాదం ఉంది. కనుక ఒకరి రక్తం మరొకరికి ఎక్కించేటప్పుడు అప్రమత్తతతో ఉండకపోతే కామెర్లు, ఎయిడ్స్ వంటి రోగాలు సంక్రమించే సావకాశం ఉంది.
 
ఈ ప్రమాదాల నుండి తప్పించుకుందుకి ఎవరి రక్తం వారే, ఎవరికి వారే' దానం చేసుకుని 'బేంకు' లో దాచుకుంటారు. ఉత్తరోత్తర్యా వచ్చే అవసరం వెంబడి వాడుకుంటారు. ఇది ఒక కొత్త ధోరణి!
 
==కృత్రిమ రక్తం==
 
==వనరులు==
"https://te.wikipedia.org/wiki/రక్త_దానం" నుండి వెలికితీశారు