యమునోత్రి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 3:
==స్థల పురాణం==
[[బొమ్మ:యమునోత్రిలో స్నానఘట్టం.JPG|thumb|left|యమునోత్రి స్నానఘట్టం]]
ఈ ఆలయం టెహ్రీ గార్వాల్ మహారాజాచే నిర్మించబడినదని కథనం.ప్రస్తుత ఆలయాన్ని జయపూర్ మహారాణి గులారియా 19వశతాబ్ధంలో నిర్మించబడింది.పాత ఆలయం వాతావరణం మరియు ఇతర కారణాల వలన శ్ధిలస్థితికి చేరుకున్న తరవాత జయపూరు రాణిచే ఆలయం పునర్నిర్మించబడింది.కొన్ని చిన్న చిన్న ఆశ్రమాలు మరియు గెస్ట్‌హౌసులు కాక ఆలయసమీపంలో నివసించడానికి వసతులు తక్కువ.యాత్రీకులు సమీపంలోని రాణిచెట్టి తదితర ప్రాంతాలలో బసచేసి ఆలయానికి చేరి నదీమాతను దర్శించి వెనుతిరుగుతుంటారు.ఇక్కడి ఉష్ణకుండ స్నానం యాత్రీకుల శ్రమతర ప్రయాణానికి కొంత సేదతీరుస్తుంది.
===యమునా నది పురాణ కథనం===
సూర్యుని భార్య అయిన సంధ్యాదేవికి ముగ్గురు సంతానం.వారు శని,యముడు మరియు యమున.సంధ్యాదేవి సూర్యతాపానికి ఓర్వలేక తన ఛాయను తన స్థానంలో తన ఛాయను ఉంచి తపమాచరించడానికి వెళ్ళింది.ఛాయాదేవికి సూర్యుని వలన కలిగారు.తరవాత ఛాయాదేవి సంధ్యాదేవి కుమారుల పట్ల కొంత అశ్రద్ధను చూపించసాగింది.ఒక రోజు ఛాయాదేవి తన కుమారులకు ఆహారాన్ని అందించి సంధ్యా దేవి సంతానానికి ఆహారాన్ని అందించడానికి నిరాకరించడంతో
శని కోపించి ఛాయాదేవిని కాలితో తన్నాడు.ఛాయాదేవి కోపించి శనిని కుంటివాడివికా శపించింది.ఇది గమనించిన సూర్యుడు శనిని తల్లిని తన్నిన కారణమడిగాడు,శని చెప్పినది విని సూర్యునికి ఛాయా దేవి మీద సందేహం కలిగి కన్న తల్లివైతే ఇలా చేయవు అసలు నీవెవరు అని ఆమెను నిలదీయగా
తను సంధ్యను కానని ఆమెచే నియమించబడిన ఛాయాదేవినని నిజం చెప్పింది.ఈ సంఘటన తరవాత శని యమూడు ఆప్రదేశాన్ని విడిచి పోతారు.యముడు
శువునికి సహాయంగా మరణానంతరం ప్రాణులకు పాపం చేసినందుకు దండననిచ్చే నరకాధిపతి అయ్యాడు.దండన ఇవ్వడంలో సమానంగా వ్యవహరిస్తాడని పురాణ కథనం.అన్నదమ్ముల వియోగాన్ని సహించలేక యమున కన్నీరు మున్నీరుగా ఏడ్వగా ఆమెకన్నీరు నదిగా ప్రవహించినట్లు పురాణ కథనం కొన్నిచోట్ల ప్రచారంలో ఉంది.
 
==యమునోత్రి గుడి==
"https://te.wikipedia.org/wiki/యమునోత్రి" నుండి వెలికితీశారు