రక్త దానం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 8:
==రక్తాన్ని నిల్వ చెయ్యటం==
 
దానం చేసిన రక్తాన్ని అప్పటికప్పుడు, అక్కడికక్కడ వాడుకోవటం కష్టం. కనుక రక్తాన్ని ఏదో ఒక విధంగా నిల్వ చెయ్యాలి. రక్తాన్ని యధాతధంగా నిల్వ చెయ్యటం శ్రేయస్కరం కాదు; అందుకని రక్తంలో ఉన్న భాగాలని విడగొట్టి ఏ భాగానికా భాగాన్ని విడివిడిగా నిల్వ చేస్తారు. ఉదాహరణకి ఎర్ర కణాలని విడగొట్టి బీరువాలో నిల్వ చేస్తే 42 రోజులపాటు పాడు కాకుండా ఉంటాయి. అవే ఎర్ర కణాలని చల్లబరచి, గడ్డకట్టిస్తే 10 సంవత్సరాలు నిల్వ ఉంటాయి. రసిని చల్లబరచి, గడ్డకట్టిస్తే ఒక సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. కాని పళ్ళెరాలు (platelets) అయిదు రోజులు దాటి నిల్వ ఉండటం లేదు. నిల్వ చేసే విధానాల మీద ప్రయోగాలు జరుగుతూ ఉండగా రక్తం చేసే ఉపకారాన్ని రసి (plasma) ఒక్కటీ చెయ్యగలదని కనిపెట్టేరు. కనుక రసి ని నిల్వ చేసి రవాణా చేసే పద్ధతులు కనిబెట్టేరు. రసి మీద అంశిక శ్వేదనం (fractional distillation) వంటి అస్త్రాలని ప్రయోగించి కారణాంశం-1 (factor-1) అనే గుండని విడదీశారు. దీనినే ఫైబ్రినోజెన్‌ (fibrinigen) అని ఇంగ్లీషులోనూ 'తాంతవజని' అని తెలుగు లోనూ అంటారు. అటు తరువాత కారణాంశం-2, కారణాంశం-3 అనే మరొక రెండు పదార్ధాలని విడదీశారు. ఈ రెండు కారణాంశాలలో ముఖ్యంగా ఉండే పదార్ధాల పేరు గ్లాబ్యులిన్‌లు (globulins). శరీరం రోగ గ్రస్తం కాకుండా కాపాడటంలో ఈ గ్లాబ్యులిన్‌లు ప్రముఖ పాత్ర వహిస్తాయి. పాల సముద్రాన్ని మధించినట్లు ఈ రసిని ఇంకా మధిస్తే కారణాంశం-4 వస్తుంది. దీనికే మరొక పేరు [[కోలెస్టరాల్‌]] (cholesterol). ముడి చమురుని అంశిక శ్వేదనం చేసినప్పుడు ఆఖరున తారు లభించినట్లు, రసిని ఇంకా మధిస్తే వచ్చే అయిదవ కారణాంశం పేరు [[ఆల్బ్యుమిన్‌]] (albumin). దీనిని గుండ రూపంలో వెలికి తీసి నిల్వ చెయ్య వచ్చు. ఇంకా కారణాంశాలు ఉన్నాయి. కాని వాటి ప్రస్తావన ప్రస్తుతం అప్రస్తుతం.
 
 
"https://te.wikipedia.org/wiki/రక్త_దానం" నుండి వెలికితీశారు