మిఖాయిల్ గోర్బచేవ్: కూర్పుల మధ్య తేడాలు

2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
ట్యాగు: తిరగ్గొట్టారు
పంక్తి 213:
 
అమెరికాతో మునుపటి చర్చల వైఫల్యాల తరువాత గోర్బచేవ్, 1987 ఫిబ్రవరిలో మాస్కోలో "అణ్వాయుధాలు లేని ప్రపంచం కోసం, మానవజాతి మనుగడ కోసం" అనే పేరుతో ఒక సమావేశాన్ని నిర్వహించాడు. దీనికి వివిధ అంతర్జాతీయ ప్రముఖులు, రాజకీయ నాయకులూ హాజరయ్యారు. {{Sfn|Doder|Branson|1990|pp=208–209}} అణ్వాయుధ నిరాయుధీకరణ కోసం బహిరంగంగా ముందుకు రావడం ద్వారా, గోర్బచేవ్ సోవియట్ యూనియన్‌ను నైతికంగా ఉన్నత స్థానంలో నిలబెట్టడానికి ప్రయత్నించాడు. తమకే నైతిక ఆధిపత్యం ఉందనే పశ్చిమ దేశాల అవగాహనను బలహీనపరిచాడు. {{Sfn|Doder|Branson|1990|p=215}} రీగన్ ఎస్డిఐపై వెనక్కి తగ్గడని తెలుసు కాబట్టి, గోర్బచేవ్ "ఇంటర్మీడియట్-రేంజ్ న్యూక్లియర్ ఫోర్సెస్"ను తగ్గించడంపై దృష్టి పెట్టాడు. దీనికి రీగన్ అంగీకరించాడు. {{Sfn|Taubman|2017|pp=393–394}} 1987 ఏప్రిల్లో, గోర్బచేవ్ మాస్కోలో యుఎస్ విదేశాంగ కార్యదర్శి జార్జ్ పి. షుల్ట్జ్‌తో చర్చించాడు; సోవియట్ యొక్క ఎస్ఎస్ -23 రాకెట్లను తొలగించడానికీ, యుఎస్ ఇన్స్పెక్టర్లను సోవియట్ సైనిక సౌకర్యాలను సందర్శించడాన్ని అనుమతించటానికీ అతడు అంగీకరించాడు. {{Sfn|Taubman|2017|pp=394–396}} దీన్ని సోవియట్ మిలిటరీ వ్యతిరేకించింది. కానీ 1987 మేలో మథియాస్ రస్ట్ అనే పశ్చిమ జర్మన్ యువకుడు ఫిన్లాండ్ నుండి విమానంలో ఎగురుతూ వచ్చి రెడ్ స్క్వేర్‌లో దిగిన సంఘటనలో అతణ్ణి భూమి నుండి ఎవరూ గుర్తించలేదు. దీనిపై కోపించిన గోర్బచేవ్, అసమర్ధత కారణంగా అనేక మంది సీనియర్ సైనిక అధికారులను తొలగించాడు. {{sfnm|1a1=Doder|1a2=Branson|1y=1990|1pp=234–237|2a1=Taubman|2y=2017|2pp=396–397}} 1987 డిసెంబరులో గోర్బచేవ్ వాషింగ్టన్ DC ని సందర్శించాడు. అక్కడ అతడు, రీగన్‌లు ఇంటర్మీడియట్-రేంజ్ న్యూక్లియర్ ఫోర్సెస్ ఒప్పందంపై సంతకం చేశారు.{{sfnm|1a1=Doder|1a2=Branson|1y=1990|1pp=284–285|2a1=McCauley|2y=1998|2p=138|3a1=Taubman|3y=2017|3pp=401–403}} టౌబ్మాన్ దీనిని "గోర్బచేవ్ కెరీర్‌లో ఉచ్ఛతమ బిందువులలో ఒకటి" అని అన్నాడు. {{Sfn|Taubman|2017|p=401}}
[[దస్త్రం:Gorbachev_and_Reagan_1987-11President Ronald Reagan and Nancy Reagan with Soviet General Secretary Mikhail Gorbachev and Raisa Gorbachev.jpg|link=https://te.wikipedia.org/wiki/%E0%B0%A6%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82:Gorbachev_and_Reagan_1987-11President Ronald Reagan and Nancy Reagan with Soviet General Secretary Mikhail Gorbachev and Raisa Gorbachev.jpg|ఎడమ|thumb|రీగన్, గోర్బచేవ్ భార్యలతో (వరుసగా నాన్సీ, రైసా) వాషింగ్టన్, 1987 డిసెంబరు 9 లో వాషింగ్టన్లోని [[ వాషింగ్టన్, DC లోని రష్యా రాయబార కార్యాలయం|సోవియట్ రాయబార కార్యాలయంలో]] విందుకు హాజరయ్యారు.]]
1988 మే- 1988 జూన్ లలో మాస్కోలో రెండవ యుఎస్-సోవియట్ శిఖరాగ్ర సమావేశం జరిగింది. ఇది ఒక ప్రతీక మాత్రంగానే ఉంటుందని గోర్బచేవ్ భావించాడు. మళ్ళీ, అతడు, రీగన్ ఒకరి దేశాన్నొకరు విమర్శించుకున్నరు - మత స్వేచ్ఛపై సోవియట్ ఆంక్షలను రీగన్ ప్రస్తావించగా, గోర్బచేవ్ అమెరికాలో ఉన్న పేదరికాన్ని, జాతి వివక్షతనూ ఎత్తిచూపాడు. కాని వారు "స్నేహపూర్వకంగానే" మాట్లాడుకున్నట్లు గోర్బచేవ్ పేర్కొన్నాడు. {{Sfn|Taubman|2017|p=414}} బాలిస్టిక్ క్షిపణి పరీక్షను నిర్వహించడానికి ముందు ఒకరినొకరు తెలియజేసుకోవాలని వారు ఒక ఒప్పందానికి వచ్చారు. రవాణా, ఫిషింగ్, రేడియో నావిగేషన్‌పై ఒప్పందాలు చేసుకున్నారు. {{Sfn|Taubman|2017|p=415}} శిఖరాగ్ర సమావేశంలో, రీగన్ విలేకరులతో మాట్లాడుతూ, తాను ఇకపై సోవియట్ యూనియన్‌ను "దుష్ట సామ్రాజ్యం"గా పరిగణించడంలేదని చెప్పాడు. ఇరువురూ తమను తాము స్నేహితులుగా భావిస్తున్నామని వెల్లడించారు.{{sfnm|1a1=Doder|1a2=Branson|1y=1990|1p=320|2a1=Taubman|2y=2017|2pp=416–417}}
 
"https://te.wikipedia.org/wiki/మిఖాయిల్_గోర్బచేవ్" నుండి వెలికితీశారు