పంక్తి 1,023:
== చర్చల్లో "వికీపీడియా తోటి సభ్యులను - వారితో మీరు ఏకీభవించకపోయినా - గౌరవించండి." ==
 
రచ్చబండలో మీరు ప్రారంభించిన "అనువాదంలో మరియు సమస్య" విభాగంలో [https://te.wikipedia.org/w/index.php?title=%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%AA%E0%B1%80%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE%3A%E0%B0%B0%E0%B0%9A%E0%B1%8D%E0%B0%9A%E0%B0%AC%E0%B0%82%E0%B0%A1&type=revision&diff=3047979&oldid=3047584 మీరు రాసిన] పద్ధతి, మరీ ముఖ్యంగా ''ఇటువంటి హాస్యాస్పదమైన రీతిలో చేసిన నిర్ణయాలకు సైతం మద్దతు పలికేవారికి ఈ విధానంలో ఒక ఎంజాయ్మెంట్ కనిపించివుండవచ్చు.'', ''"మేమొక నలుగురం// గిరిగీసిన గదిలో చేరాం// గదిలో మరెవరూ లేరు-వేరెవరూ రారు// మేమెవరినీ పిలవం-వచ్చేవారిని రావద్దనం// చిక్కని చర్చలు మావే-నిక్కచ్చి నిర్ణేతలమూ మేమే" అని నిర్ణయాలు ప్రకటిస్తూ వున్నప్పుడు'' అంటూ మాట్లాడిన ధోరణి "ఇతరులు కూడా మీ అంతే నిబద్ధతతో ఉన్నారని భావించండి - అలా లేరనేందుకు మీదగ్గర తిరుగులేని సాక్ష్యం ఉంటే తప్ప." అన్న నాలుగవ మూలస్తంభం స్ఫూర్తికి విరుద్ధం. వికీపీడియా అన్నదొక ఆన్‌లైన్ వేదిక కావడంతో ఇక్కడ ముఖపరిచయం లేని వ్యక్తులు సంభాషించుకుని, ఒక లక్ష్యంతో పనిచేస్తారు. మీరు నిబద్ధతతో ఉన్నారని వారూ, వారూ నిబద్ధతతోనే ఉన్నారని మీరూ విశ్వసిస్తూనే విషయాన్ని పరిశీలించాలి తప్పించి అవతలివారికి ఉద్దేశాలు ఆపాదించడం తగదు. '''మీరు చర్చలో పాల్గొనడం ఏదో నిర్మాణాత్మకమైన పని సాధించడానికి అయినప్పుడు అవతలి వ్యక్తులు "ఒక ఎంజాయ్మెంట్ కనిపించి" నిబద్ధత లేకుండా ఆ చర్చల్లో పాల్గొన్నారని ఖచ్చితమైన, నిర్ద్వంద్వంగా నిరూపించే ఆధారాలు చూపకుండా అనడం సరికాదు.''' ఐతే, మీరు దురుద్దేశంతో అనలేదనే భావిస్తూ ఈ నిబంధనలు మీకు తెలియజేస్తున్నాను. దయచేసి నిర్మాణాత్మకమైన ధోరణితో వికీపీడియా మూలస్తంభాలను దెబ్బతీయకుండా వ్యవహరిస్తారని ఆశిస్తున్నాను. --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 18:09, 12 అక్టోబరు 2020 (UTC)
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:Vmakumar" నుండి వెలికితీశారు