వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
పంక్తి 1,029:

==నిష్క్రియాత్మక నిర్వాహకులు==
::[https://xtools.wmflabs.org/adminstats/te.wikipedia.org/2020-04-01/2020-09-30?actions=delete%7Crevision-delete%7Clog-delete%7Crestore%7Cre-block%7Cunblock%7Cre-protect%7Cunprotect%7Crights%7Cmerge%7Cimport%7Cabusefilter వికీపీడియా (te.wikipedia.org) • 2020-04-01 — 2020-09-30] గణాంకాల ప్రకారం ప్రస్తుతం ఉన్న 13 మంది నిర్వాహకులలో 12 మంది గణాంకాలున్నాయి. ఒక నిర్వాహకునికి ఎటువంటి నిర్వహణ దిద్దుబాట్లు లేనందున ఆ పట్టికలో లేదనుకుంటాను. ఉన్న 12 మందిలో ఐదుగురు నిర్వాహకులు గత ఆరు నెలల కాలంలో మామూలు దిద్దుబాట్లు చేస్తూ కూడా 20 కంటే తక్కువ నిర్వహణా ఎడిట్లు చేసారు. [[వికీపీడియా:నిర్వాహకత్వ హక్కుల ఉపసంహరణ]] విధానం ప్రకారం వారికి వికీపీడియా, మూస పేరుబరిలో కూడా దిద్దుబాట్లు లేవు. మొదటి పేజీ నిర్వహణా దిద్దుబాట్లు కూడా లేవు. కనుక వారు స్వచ్ఛందంగా నిర్వాహకత్వం నుండి విరమించుకొని ఆసక్తి ఉన్న కొత్తవారికి నిర్వాహకత్వాలు ఇచ్చే విధంగా సహకరించాలి. ప్రస్తుతం నిర్వాహకత్వ పనులు అనేకం ఉన్నాయి. పేజీలను పరిశీలించే వారు లేరు. కాపీహక్కుల నిబంధనలను ఉల్లంఘించి యదాతథంగా వెబ్‌సైట్లులనుండి కాపీ పేస్టు చేసే వ్యాసాలను పరిశీలించడం, వాడుకరుల దుశ్చర్యలను పరిశీలించడం, కృత్రిమ అనువాద వ్యాసాలను యదాతథంగా చేర్చడం వంటి అనేక పనులు పరిశీలించడం వంటి కార్యక్రమాలు ప్రస్తుతం క్రియాశీలకంగా ఉన్న నిర్వాహకులు ఎంత పరిశీలించినా ఇంకనూ ఉండిపోతున్నాయని నా అభిప్రాయం. వికీపీడియా అభివృద్ధికి క్రియాశీలక నిర్వాహకుల అవసరం ఎంతైనా ఉంది. '''{{Spaced en dash}}''' [[User:K.Venkataramana|''' K.Venkataramana''']] '''{{Spaced en dash}}''' [[User talk:K.Venkataramana|'''☎''']] 07:15, 8 అక్టోబరు 2020 (UTC)
:::[[User:K.Venkataramana|వెంకటరమణ]] గారూ మంచి విషయం లేవనెత్తారు.దీనిని [[వికీపీడియా:నిర్వాహకత్వ హక్కుల ఉపసంహరణ]] చర్చా పేజీలో లేదా నిర్వహకులనోటీసు బోర్టులో చేర్చితే బాగుంటుందని నా అభిప్రాయం.--[[వాడుకరి:యర్రా రామారావు|యర్రా రామారావు]] ([[వాడుకరి చర్చ:యర్రా రామారావు|చర్చ]]) 07:27, 8 అక్టోబరు 2020 (UTC)
::::[[వాడుకరి:యర్రా రామారావు|యర్రా రామారావు]] గారూ గత ఆరు నెలల్లోనే కాదు అంతకు ముందు ఆరునెలల గణాంకాల ప్రకారం [https://xtools.wmflabs.org/adminstats/te.wikipedia.org/2019-10-01/2020-03-31?actions=delete|revision-delete|log-delete|restore|re-block|unblock|re-protect|unprotect|rights|merge|import|abusefilter 2019-10-01 — 2020-03-31] కాలంలో కూడా నిర్వాహక దిద్దుబాట్లు దిద్దుబాట్లు 20 కంటే తక్కువ చేసిన వారు 8 మంది ఉన్నారు. గత సంవత్సర కాలంలో క్రియాశీలకంగా నిర్వహణ పనులు సుమారు ఏడుగురు మాత్రమే చేస్తున్నట్లుంది. నిర్వాహకత్వం అంటే వికీలో హోదాగా భావించడం మాత్రం కాదుకదా! పనులు కూడా చెయ్యాలి కదా.'''{{Spaced en dash}}''' [[User:K.Venkataramana|''' K.Venkataramana''']] '''{{Spaced en dash}}''' [[User talk:K.Venkataramana|'''☎''']] 07:38, 8 అక్టోబరు 2020 (UTC)
::::::నా వైపుగా నిర్వహక మార్పులు ఏమీ లేవు. ఆరు నెలల్లో నిర్వహక మార్పులు చేయకపోతే నిర్వహకత్వం తొలగింపు అనేదానికి నేను [[వికీపీడియా చర్చ:నిర్వాహకత్వ హక్కుల ఉపసంహరణ#ఆలోచనల్లో|వ్యతిరేకంగానే]] చర్చల్లో నా అభిప్రాయాలు వెలబుచ్చాను. ఇది ఉద్యోగభాద్యతకాదు, వీటికి టార్గెట్స్ ఉండరాదని. అయినా సముదాయపు నియమ నిబందలను గౌరవిస్తూ... నానిర్వహక మార్పులు పాలసీకి అనుగుణంగా లేకపోతే నిర్వహక భద్యతలను తొలగించవచ్చు. దీనిపై అదికారులకు నంపూర్ణ అంగీకారం తెలియచేస్తున్నాను. ధన్యవాదాలు [[వాడుకరి:B.K.Viswanadh|B.K.Viswanadh]] ([[వాడుకరి చర్చ:B.K.Viswanadh|చర్చ]]) 10:13, 9 అక్టోబరు 2020 (UTC)
::::ఇక్కడ ఏ నిర్వాహకునికీ వదులుకోవాలని వికీ సమూహం భావించడం లేదు. నిర్వాహకుల పనితీరు సమీక్ష గురించి సంవత్సరమున్నరగా జరుగుతోంది. ఇప్పటికి మూడు టర్మ్స్ (3*6 నెలలు) గడిచాయి. ఒక 6నెలలకాలంలో కాకపోయినా, ఇంకో 6నెలల కాలంలోనైనా నిర్వాహక పనులు చేయాలి. మొత్తానికి చేయకుండా, నిర్వాహక పదవి పట్టుకొని ఉంటాం అంటే మంచి పద్ధతి కూడా కాదు. అలాగే, నిర్వాహక పదవి నుండి పోవడం అంటే వికీ నుండి వెళ్లిపోవడం కాదు. ఇక్కడ నిర్వాహకత్వం అనేది బలవంతంగా చేయమని వికీసమూహం కోరలేదు. అలాగే స్టీవర్డులు నిర్వాహకునిగా నామినేట్ చేయలేదు. నిర్వాహకులు తమకు తాముగా స్వచ్ఛందంగా వికీకి సేవ చేస్తామనే మంచి తలంపుతో "వికీపీడియా:నిర్వాహక హోదా విజ్ఞప్తి" చేసుకున్నారు. మనమేదో వికీపీడియా అభివృద్ధికోసం ఎంతో కొంత పాటు పడతామని వాడుకరులు ఆ పేజీలో మనపై విశ్వాసముంచి ఓటు చేసారు. అనేక మంది మనపై నమ్మకంతో ఓట్లు వేస్తే ఈ పదవి వచ్చింది. ఇప్పుడు మనకు ఏవో పనులు వున్నాయని, ఉద్యోగ భాద్యత కాదని అనడం సబబు కాదు. ఆరు మాసాల కాలంలో మనం మనకు అభిమానం ఉన్న వికీపై ఒక రోజు సేవ అందించలేమా? కనీసం వారంలో నిర్వాహకత్వ పనుల గురించి ఒక గంట కేటాయించలేమా? కొత్త పేజీలను నెలకు ఒకసారైనా సమీక్షించలేమా? కనీసం ఆలోచించాలి. మనపై ఎంతో అభిమానంతో, విశ్వాసంతో ఓటు వేసిన వికీపీడియా సమాజాన్ని దృష్టిలో ఉంచుకొని పనిచేయాలి. అలా కాకపోతే ఎన్నికల ముందు ప్రజలకు అనేక వాగ్దానాలు చేసి, ఎన్నికలలో గెలిచి పదవులు వచ్చిన తరువాత ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలాని మరచిపోయే కొంతమంది నాయకులకు మనకు ఎటువంటి తేడా లేదు.'''{{Spaced en dash}}''' [[User:K.Venkataramana|''' K.Venkataramana''']] '''{{Spaced en dash}}''' [[User talk:K.Venkataramana|'''☎''']] 01:38, 10 అక్టోబరు 2020 (UTC)

== Call for feedback about Wikimedia Foundation Bylaws changes and Board candidate rubric ==
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:రచ్చబండ" నుండి వెలికితీశారు