వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1,034:
:::నా వైపుగా నిర్వహక మార్పులు ఏమీ లేవు. ఆరు నెలల్లో నిర్వహక మార్పులు చేయకపోతే నిర్వహకత్వం తొలగింపు అనేదానికి నేను [[వికీపీడియా చర్చ:నిర్వాహకత్వ హక్కుల ఉపసంహరణ#ఆలోచనల్లో|వ్యతిరేకంగానే]] చర్చల్లో నా అభిప్రాయాలు వెలబుచ్చాను. ఇది ఉద్యోగభాద్యతకాదు, వీటికి టార్గెట్స్ ఉండరాదని. అయినా సముదాయపు నియమ నిబందలను గౌరవిస్తూ... నానిర్వహక మార్పులు పాలసీకి అనుగుణంగా లేకపోతే నిర్వహక భద్యతలను తొలగించవచ్చు. దీనిపై అదికారులకు నంపూర్ణ అంగీకారం తెలియచేస్తున్నాను. ధన్యవాదాలు [[వాడుకరి:B.K.Viswanadh|B.K.Viswanadh]] ([[వాడుకరి చర్చ:B.K.Viswanadh|చర్చ]]) 10:13, 9 అక్టోబరు 2020 (UTC)
::::ఇక్కడ ఏ నిర్వాహకునికీ వదులుకోవాలని వికీ సమూహం భావించడం లేదు. నిర్వాహకుల పనితీరు సమీక్ష గురించి సంవత్సరమున్నరగా జరుగుతోంది. ఇప్పటికి మూడు టర్మ్స్ (3*6 నెలలు) గడిచాయి. ఒక 6నెలలకాలంలో కాకపోయినా, ఇంకో 6నెలల కాలంలోనైనా నిర్వాహక పనులు చేయాలి. మొత్తానికి చేయకుండా, నిర్వాహక పదవి పట్టుకొని ఉంటాం అంటే మంచి పద్ధతి కూడా కాదు. అలాగే, నిర్వాహక పదవి నుండి పోవడం అంటే వికీ నుండి వెళ్లిపోవడం కాదు. ఇక్కడ నిర్వాహకత్వం అనేది బలవంతంగా చేయమని వికీసమూహం కోరలేదు. అలాగే స్టీవర్డులు నిర్వాహకునిగా నామినేట్ చేయలేదు. నిర్వాహకులు తమకు తాముగా స్వచ్ఛందంగా వికీకి సేవ చేస్తామనే మంచి తలంపుతో "వికీపీడియా:నిర్వాహక హోదా విజ్ఞప్తి" చేసుకున్నారు. మనమేదో వికీపీడియా అభివృద్ధికోసం ఎంతో కొంత పాటు పడతామని వాడుకరులు ఆ పేజీలో మనపై విశ్వాసముంచి ఓటు చేసారు. అనేక మంది మనపై నమ్మకంతో ఓట్లు వేస్తే ఈ పదవి వచ్చింది. ఇప్పుడు మనకు ఏవో పనులు వున్నాయని, ఉద్యోగ భాద్యత కాదని అనడం సబబు కాదు. ఆరు మాసాల కాలంలో మనం మనకు అభిమానం ఉన్న వికీపై ఒక రోజు సేవ అందించలేమా? కనీసం వారంలో నిర్వాహకత్వ పనుల గురించి ఒక గంట కేటాయించలేమా? కొత్త పేజీలను నెలకు ఒకసారైనా సమీక్షించలేమా? కనీసం ఆలోచించాలి. మనపై ఎంతో అభిమానంతో, విశ్వాసంతో ఓటు వేసిన వికీపీడియా సమాజాన్ని దృష్టిలో ఉంచుకొని పనిచేయాలి. అలా కాకపోతే ఎన్నికల ముందు ప్రజలకు అనేక వాగ్దానాలు చేసి, ఎన్నికలలో గెలిచి పదవులు వచ్చిన తరువాత ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలాని మరచిపోయే కొంతమంది నాయకులకు మనకు ఎటువంటి తేడా లేదు.'''{{Spaced en dash}}''' [[User:K.Venkataramana|''' <span style="font-family:Lucida Handwriting; color: #0000CD"><small>K.Venkataramana</small></span>''']] '''{{Spaced en dash}}''' [[User talk:K.Venkataramana|'''<span style="font-family:Lucida Handwriting; color: green"><big>☎</big></span>''']] 01:38, 10 అక్టోబరు 2020 (UTC)
:::::[[User:K.Venkataramana]] గారు, సంబంధిత విధాన రూపకల్పనలో నేను పాల్గొన్నాను, కాలపరిమితి నిర్ణయం చేయడంలో సరియైన చర్చ జరగలేదు. కావున ఈ విధాన నిర్ణయం ప్రతిపాదించినవారికి సంతృప్తినివ్వనట్లే, నాకు సంతృప్తిగా లేదు. ఈ విధానాన్ని రద్దు చేయడమే మంచిదని నా అభిప్రాయం. [[వాడుకరి:B.K.Viswanadh|B.K.Viswanadh]] గారు కొంత కాలంగా నిర్వాహక పనులలో క్రియాశీలంగా వుండకపోవచ్చు. కాని అయనను, అలాంటివారిని స్వచ్ఛంధంగా విరమించుకోమని కోరడం సరికాదు. నిర్వాహక హోదా అనేదానివలనే సభ్యులకు పెద్దగా ఒనగూరేదిలేదు. ఆన్లైన్ లో జరిగే కృషి కావున నిర్వాహకుల సంఖ్యపై పరిమితి లేదు. వారు నిర్వాహకులైన తరువాత చాలాకాలం క్రియాశీలంగా పనిచేశారు తరువాత వివిధ కారణాల చేత చేయకుండావుండవచ్చు. నా మట్టుకు నేను దాదాపు 1 సంవత్సరంపాటు కృషిచేయకున్నా ఆ తర్వాత మరల క్రియాశీలమై కృషి చేయగలిగాను. కావున మీరు కాని ఇతరులు కాని ఈ విధానాన్ని అమలు పరచాలనే కోరిక వుంటే, మీరే క్రియాశీలంగా లేని నిర్వాహకులని తొలగించండి. ధన్యవాదాలు.--[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 05:15, 14 అక్టోబరు 2020 (UTC)
 
== Call for feedback about Wikimedia Foundation Bylaws changes and Board candidate rubric ==
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:రచ్చబండ" నుండి వెలికితీశారు