వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

చి మరింతగా వికీకి వడిగా సేవలు అందించాలని ఈ ప్రతిపాదన చేశాను
ట్యాగు: 2017 source edit
పంక్తి 1,035:
::::ఇక్కడ ఏ నిర్వాహకునికీ వదులుకోవాలని వికీ సమూహం భావించడం లేదు. నిర్వాహకుల పనితీరు సమీక్ష గురించి సంవత్సరమున్నరగా జరుగుతోంది. ఇప్పటికి మూడు టర్మ్స్ (3*6 నెలలు) గడిచాయి. ఒక 6నెలలకాలంలో కాకపోయినా, ఇంకో 6నెలల కాలంలోనైనా నిర్వాహక పనులు చేయాలి. మొత్తానికి చేయకుండా, నిర్వాహక పదవి పట్టుకొని ఉంటాం అంటే మంచి పద్ధతి కూడా కాదు. అలాగే, నిర్వాహక పదవి నుండి పోవడం అంటే వికీ నుండి వెళ్లిపోవడం కాదు. ఇక్కడ నిర్వాహకత్వం అనేది బలవంతంగా చేయమని వికీసమూహం కోరలేదు. అలాగే స్టీవర్డులు నిర్వాహకునిగా నామినేట్ చేయలేదు. నిర్వాహకులు తమకు తాముగా స్వచ్ఛందంగా వికీకి సేవ చేస్తామనే మంచి తలంపుతో "వికీపీడియా:నిర్వాహక హోదా విజ్ఞప్తి" చేసుకున్నారు. మనమేదో వికీపీడియా అభివృద్ధికోసం ఎంతో కొంత పాటు పడతామని వాడుకరులు ఆ పేజీలో మనపై విశ్వాసముంచి ఓటు చేసారు. అనేక మంది మనపై నమ్మకంతో ఓట్లు వేస్తే ఈ పదవి వచ్చింది. ఇప్పుడు మనకు ఏవో పనులు వున్నాయని, ఉద్యోగ భాద్యత కాదని అనడం సబబు కాదు. ఆరు మాసాల కాలంలో మనం మనకు అభిమానం ఉన్న వికీపై ఒక రోజు సేవ అందించలేమా? కనీసం వారంలో నిర్వాహకత్వ పనుల గురించి ఒక గంట కేటాయించలేమా? కొత్త పేజీలను నెలకు ఒకసారైనా సమీక్షించలేమా? కనీసం ఆలోచించాలి. మనపై ఎంతో అభిమానంతో, విశ్వాసంతో ఓటు వేసిన వికీపీడియా సమాజాన్ని దృష్టిలో ఉంచుకొని పనిచేయాలి. అలా కాకపోతే ఎన్నికల ముందు ప్రజలకు అనేక వాగ్దానాలు చేసి, ఎన్నికలలో గెలిచి పదవులు వచ్చిన తరువాత ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలాని మరచిపోయే కొంతమంది నాయకులకు మనకు ఎటువంటి తేడా లేదు.'''{{Spaced en dash}}''' [[User:K.Venkataramana|''' <span style="font-family:Lucida Handwriting; color: #0000CD"><small>K.Venkataramana</small></span>''']] '''{{Spaced en dash}}''' [[User talk:K.Venkataramana|'''<span style="font-family:Lucida Handwriting; color: green"><big>☎</big></span>''']] 01:38, 10 అక్టోబరు 2020 (UTC)
:::::[[User:K.Venkataramana]] గారు, సంబంధిత విధాన రూపకల్పనలో నేను పాల్గొన్నాను, కాలపరిమితి నిర్ణయం చేయడంలో సరియైన చర్చ జరగలేదు. కావున ఈ విధాన నిర్ణయం ప్రతిపాదించినవారికి సంతృప్తినివ్వనట్లే, నాకు సంతృప్తిగా లేదు. ఈ విధానాన్ని రద్దు చేయడమే మంచిదని నా అభిప్రాయం. [[వాడుకరి:B.K.Viswanadh|B.K.Viswanadh]] గారు కొంత కాలంగా నిర్వాహక పనులలో క్రియాశీలంగా వుండకపోవచ్చు. కాని అయనను, అలాంటివారిని స్వచ్ఛంధంగా విరమించుకోమని కోరడం సరికాదు. నిర్వాహక హోదా అనేదానివలన సభ్యులకు పెద్దగా ఒనగూరేదిలేదు. ఆన్లైన్ లో జరిగే కృషి కావున నిర్వాహకుల సంఖ్యపై పరిమితి లేదు. వారు నిర్వాహకులైన తరువాత చాలాకాలం క్రియాశీలంగా పనిచేశారు ఇటీవల వివిధ కారణాల చేత చేయకుండావుండివుండవచ్చు. నా మట్టుకు నేను దాదాపు 1 సంవత్సరంపాటు కృషిచేయకున్నా ఆ తర్వాత మరల క్రియాశీలమై కృషి చేయగలిగాను. కావున మీరు కాని ఇతరులు కాని ఈ విధానాన్ని అమలు పరచాలనే కోరిక వుంటే, మీరే క్రియాశీలంగా లేని నిర్వాహకులని తొలగించండి. ధన్యవాదాలు.--[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 05:15, 14 అక్టోబరు 2020 (UTC)
::[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] గారూ, నిర్వాహకులైన తర్వాత చాలా కాలం పాటు విశేష కృషి చేసి తర్వాత వివిధ కారణాల రీత్యా కొంత కాలంపాటు వికీ సెలవు తీసుకొనేవాళ్ళు, తెవికీలోని పనులను క్రియాశీలకంగా చేయలేని వాళ్ళు ఉంటారు. తర్వాత కాలంలో సెలవు నుండి వచ్చిన తర్వాత క్రియాశీలకంగా మారవచ్చు. కనుక ప్రస్తుతం క్రియాశీలకంగా లేని వాడుకరులను తొలగింపు ప్రతిపాదనలు చేసే ఉద్దేశ్యం నాకు లేదు. ఇదివరకు అనేక కార్యక్రమాల్లో క్రియాశీలకంగా పనిచేసే నిర్వాహకులను వికీ నిర్వాహకత్వం నుండి దూరం చేయడం నా అభిమతం కాదు. ఈ విధానం వచ్చిన తర్వాత అత్యంత విలువైన నిర్వాహకులను వికీ కోల్పోవడం బాధాకరం. అలా తొలగించే ఉద్దేశ్యం ఉంటే తక్కువ నిర్వాహక పనులు చేసే వాడుకరులను "నిర్వాహక పనుల సమీక్ష" పేజీ సృష్టించి "నిర్వాహకుల నోటీసు బోర్డు" లో చేర్చే వాడిని. [[వికీపీడియా:నిర్వాహకత్వ హక్కుల ఉపసంహరణ]] విధానం నాకు సంతృప్తి కరంగా లేదు. ఆ చర్చలో నేను పాల్గొనలేదు. ఒక నిర్వాహకుడు రెండు సంవత్సరాల కాలంపాటు మార్పులేవీ చేయకపోతే వారిని తొలగించే విధానం ఉంది. అదే విధంగా నితీరులోపనితీరులో లోపాలు, దుష్ప్రవర్తన మొదలైన వాటి కారణంగా సముదాయం చర్చించి, నిర్ణయించిన మేరకు నిర్వాహకత్వ బాధ్యతలను తొలగించడం ఉంది. విధానం జరిగిపోయింది కానీ అమలు జరగలేదు. ఈ విధానంపై మరల చర్చించి రద్దు చేయడమే మంచిదని నా అభిప్రాయం. కొంతమంది నిర్వాహకులు వాడుకరిగా క్రియాశీలకంగా ఉండి కూడా నిర్వాహక పనుల పట్ల దృష్టి పెట్టక పోవడం బాధాకరం. కొత్త పేజీలను పరిశీలించడం, ఇటీవలి మార్పులు పరిశీలించడం వాడుకరుల దుశ్యర్యలను గమనించడం అనివార్యం కదా. అవి చేయడం లేదని నా అభిప్రాయం.'''{{Spaced en dash}}''' [[User:K.Venkataramana|''' <span style="font-family:Lucida Handwriting; color: #0000CD"><small>K.Venkataramana</small></span>''']] '''{{Spaced en dash}}''' [[User talk:K.Venkataramana|'''<span style="font-family:Lucida Handwriting; color: green"><big>☎</big></span>''']] 05:57, 14 అక్టోబరు 2020 (UTC)
 
== Call for feedback about Wikimedia Foundation Bylaws changes and Board candidate rubric ==
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:రచ్చబండ" నుండి వెలికితీశారు