జిన్: కూర్పుల మధ్య తేడాలు

"Jinn" పేజీని అనువదించి సృష్టించారు
"Jinn" పేజీని అనువదించి సృష్టించారు
పంక్తి 6:
== ఇస్లాం పూర్వపు అరేబియా ==
[[దస్త్రం:Blessing_genie_Dur_Sharrukin.jpg|ఎడమ|thumb|బకెట్, కోన్ రూపంలోని రెక్కలున్న జీనీ. అర్థ దైవిక స్వరూపం, బహుశా ఇస్లాం పూర్వపు దేవతల్లో అగ్రగామి అయివుండవచ్చు. అతను ఇస్లాంలో జిన్ అయ్యాడు. క్రీ.పూ.713-716 నాటిది]]
జిన్లు, వాటి చుట్టూ అల్లుకున్న విశ్వాసాల ఖచ్చితమైన మూలాలు ఏనాటివి, ఏవి అన్న విషయం స్పష్టంగా లేదు.<ref name="Lebling1–10">{{Cite book|url=https://books.google.com/books?id=qKL3AgAAQBAJ&printsec=frontcover&dq=ancient+Mesopotamian+genii+and+Islamic+jinn#v=onepage|title=Legends of the Fire Spirits: Jinn and Genies from Arabia to Zanzibar|last=Lebling|first=Robert|date=2010|publisher=I. B. Tauris|isbn=978-0-85773-063-3|location=New York City, New York and London, England|pages=1–10|ref=harv}}</ref> మధ్యప్రాచ్యంపై అధ్యయనం చేసిన కొందరు పండితులు జిన్‌లు ఎడారులు, అపరిశుభ్రమైన ప్రదేశాలలో నివసిస్తూండే దుష్టశక్తుల నుంచి ప్రారంభమైనట్టూ, ఇవి తరచు జంతువుల రూపాలు తీసుకుంటాయని చెప్తారు. ఇతరులు మాత్రం జిన్‌లు అరేబియాలోని బహుదేవతారాధక మతాల్లోని దేవతలని, కాలక్రమేణా ఇతర దేవతలకు ప్రాధాన్యం హెచ్చడంతో వీరి ప్రాముఖ్యత అణగారిపోయిందనీ చెప్తారు. ఏదేమైనా, ఇస్లామిక్ యుగానికి పూర్వం అరబ్బులు చాలామంది జిన్లను ఆరాధించారు. ఐతే, దేవతలకు అమరత్వం ఉందని భావించగా, జిన్లకు లేదని నమ్మేవారు. అమరత్వం లేకపోవడం వల్ల వారిని దేవతల కన్నా తక్కువవారిగా పరిగణించినప్పటికీ, ఇస్లాం పూర్వపు అరబ్బుల రోజువారీ జీవితంలో జిన్ల ఆరాధనే దేవతారాధన కన్నా ఎక్కువ ప్రాముఖ్యత కలిగివుండేదని తెలుస్తోంది. సాధారణ అరేబియన్ నమ్మకం ప్రకారం, భవిష్యత్తును చెప్పేవారు (జోస్యులు), ఇస్లాం పూర్వపు తత్వవేత్తలు, కవులకు జిన్నే ప్రేరణ. తెగల నాయకులు తమ తెగలోని సభ్యులకు రక్షణగా ఉండడం, తమ సభ్యులను చంపిన ఇతర తెగ సభ్యులను చంపి బదులుతీర్చుకోవడం వంటివి సాగే ఇస్లాం పూర్వపు అరేబియన్ సంస్కృతిలో ఈ జిన్ విశ్వాసాలు ఇమిడి ఉండేది. జిన్ మనుషుల కన్నా శక్తివంతుడైనా కూడా మనిషి ద్వంద్వ యుద్ధంలో తలపడి జిన్‌ని చంపడం సాధ్యమేనని నమ్మేవారు. కానీ, జిన్‌లు వివిధ రూపాలు మారతారనీ, అంతకన్నా ముఖ్యంగా అదృశ్యంగా ఉండి కనిపించకుండా మనిషిపై దాడిచేయవచ్చన్న కారణంగా వాటికి భయపడేవారు.<ref>Umar F. Abd-Allah, “The Perceptible and the Unseen: The Qur’anic Conception of Man’s Relationship to God and Realities Beyond Human Perception,” in Mormons and Muslims: Spiritual Foundations and Modern Manifestations, ed. Spencer J. Palmer (Provo, UT: Religious Studies Center, Brigham Young University 2002), 209–64.</ref> వివిధ వ్యాధులకు, మానసిక అనారోగ్యాలకు జిన్‌లు కారణమని నమ్మేవారు. ఆ కారణంగానూ వారంటే భయం ఉండేది. జూలియన్ వెల్హాసెన్ పరిశోధనలో ఇటువంటి ఆత్మలు నిర్జనమైన, మురికి, చీకటి ప్రాంతాల్లో నివసిస్తాయని ఇస్లాం పూర్వ అరబ్బులు భయపడతారని గమనించాడు.<ref name="Zeitlin59">{{Cite book|url=https://books.google.com/books?id=v_seJ21M0UoC&pg=PT59|title=The Historical Muhammad|last=Irving M. Zeitlin|date=19 March 2007|publisher=Polity|isbn=978-0-7456-3999-4|pages=59–60}}</ref> దీనివల్ల ప్రతీవారూ వారిని జిన్ల నుంచి కాపాడుకోవాలని భావించేవారు. అంతే తప్ప వీరు నిజమైన మతారాధనలో భాగం కాదు. కొంతమంది పండితుల ప్రకారం దేవదూతలను, దెయ్యాలు/రాక్షసులను అరేబియాకు పరిచయం చేసింది [[ముహమ్మద్ ప్రవక్త|ముహమ్మద్ ప్రవక్తే]] అని, ఈ రెండు వర్గాలూ అంతకు పూర్వం అరేబియాలోని జిన్లలో లేరని వాదిస్తారు. మరోవైపు అమిరా ఎల్-జీన్ వాదన ప్రకారం బహుదేవతారాధకులైన అరబ్బులకు దేవదూతలన్న భావన తెలుసనీ, కానీ ''జిన్'' అన్న పదాన్ని మాత్రం వివిధ మతాలూ, ఆరాధన పద్ధతుల్లోని అన్ని రకాల అతీంద్రియ శక్తులకూ కలిపికట్టుగా వాడేవారనీ, అందువల్లనే జొరాస్ట్రియన్, క్రిస్టియన్, యూదు దేవదూతలనూ, దెయ్యాలూ/రాక్షసులనూ కూడా జిన్ అన్న పదంతో వ్యవహరించడం చూడవచ్చని పేర్కొన్నది.<ref name="ReferenceB3">Amira El-Zein ''Islam, Arabs, and Intelligent World of the Jinn'' Syracuse University Press 2009 {{ISBN|9780815650706}} page 34</ref> [[అల్-జాహిజ్]] ప్రకారం ఇస్లాం పూర్వ అరబ్బులు జిన్ల సమాజంలో పలు తెగలు, గ్రూపులు ఉండేవని, తుఫానుల వంటి ప్రకృతి వైపరీత్యాలకు జిన్లు కారణమని విశ్వసించేవారు. వారు దీనితో పాటుగా ఒక జిన్ తలచుకుంటే వ్యక్తులను రక్షించడం, వివాహం చేసుకోవడం, ఎత్తుకుపోవడం, చంపడం చేయగలడని నమ్మేవారు.<ref>https://islamansiklopedisi.org.tr/cin</ref>
 
== ప్రస్తావనలు ==
 
=== గమనికలు ===
{{Notelist}}{{Reflist|group=Note}}
 
=== అనులేఖనాలు ===
{{Reflist|30em}}
 
== గ్రంథ పట్టిక ==
"https://te.wikipedia.org/wiki/జిన్" నుండి వెలికితీశారు