మొదటి ముఆవియా: కూర్పుల మధ్య తేడాలు

"Muawiyah I" పేజీని అనువదించి సృష్టించారు
"Muawiyah I" పేజీని అనువదించి సృష్టించారు
పంక్తి 8:
'''మొదటి ముఆవియా''' (క్రీ.శ. 597 లేదా 603 లేదా 605 - 680 ఏప్రిల్; పూర్తిపేరు: ''ముఆవియా ఇబ్న్ అబీ సుఫ్యాన్'') [[ఉమ్మయ్యద్ ఖలీఫత్]] వ్యవస్థాపకుడు, తొలి ఉమ్మయ్యద్ ఖలీఫా. 661 నుంచి 680లో అతను మరణించేవరకూ ఖలీఫాగా కొనసాగాడు. ఇతను ఇస్లామిక్ ప్రవక్త [[ముహమ్మద్ ప్రవక్త|ముహమ్మద్]] మరణం తరువాత 30 ఏళ్ళు గడవకుండానే నలుగురు "సరైన మార్గనిర్దేశం గల" (''రషీదున్'') ఖలీఫాల పాలన తదుపరి ఖలీఫా అయ్యాడు. రషీదున్ ఖలీఫాలకున్న న్యాయం, ధార్మిక ప్రవర్తనలతో సరితూగడని భావించినప్పటికీ ముఆవియా తన పేరు నవీనమైన ఇస్లామిక్ సామ్రాజ్యపు నాణేలు, శాసనాలు, పత్రాల్లో కనిపించిన మొదటి ఖలీఫాగా గుర్తింపు పొందాడు.<ref name="RGHIGP2015:98">[[Muawiyah I#RGHIGP2015|Hoyland, ''In God's Path'', 2015]]: p.98</ref>
 
ముఆవియా అతని, తండ్రి అబూ సుఫ్యాన్ తమ ఖురేషీ తెగచెందినవాడూ, దూరపు బంధువు అయిన [[ముహమ్మద్]]‌ను 630లో అతను మక్కాను జయించేవరకు వ్యతిరేకించారు. ఆ తరువాత మువావియా ముహమ్మద్ లేఖకులలో ఒకడు అయ్యాడు. ముహమ్మద్ మరణానంతరం [[అబూబక్ర్|అబూ బక్ర్]] (పరిపానా కాలం 632-634) ఖలీఫా అయ్యాకా ముఆవియా అన్న యాజిద్ ఇబ్న్ అబి సూఫ్యాన్‌ని సిరియా ఆక్రమణకు సైన్య నాయకుల్లో ఒకడిగా పంపాడు. యాజిద్ సైన్యంలో ముందుండే దళానికి నాయకునిగా ముఆవియాను అబూ బక్ర్ నియమించాడు. ఇతను సిరియా ఆక్రమణ తర్వాత పరిపాలనలో పదవి తర్వాత పెద్ద పదవి సంపాదిస్తూ క్రమేపీ ఖలీఫా [[ఉస్మాన్ ఇబ్న్ అఫ్ఫాన్|ఉస్మాన్]] పరిపాలనా కాలం (పరిపాలన. 644-656)లో సిరియా రాష్ట్రపరిపాలకుడుప్రావిన్స్ పరిపాలకుడు (గవర్నర్) అయ్యాడు. ప్రావిన్సులోని శక్తివంతమైన బాను కల్బ్ తెగతో రాజకీయంగా మిత్రత్వం సంపాదించి, తీరప్రాంత నగరాలకు రక్షణ వ్యవస్థ అభివృద్ధి చేసి, [[బైజాంటైన్ సామ్రాజ్యం|బైజాంటైన్ సామ్రాజ్యంపై]] యుద్ధ ప్రయత్నాలు సాగించాడు. ఈ దాడులు ముస్లిం సామ్రాజ్యపు మొట్టమొదటి నౌకా యుద్ధాలుగా పేరుపడ్డాయి.
 
 
[[వర్గం:680 మరణాలు]]
"https://te.wikipedia.org/wiki/మొదటి_ముఆవియా" నుండి వెలికితీశారు