ఆనంద శంకర్ జయంత్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 25:
 
==జీవిత విశేషాలు==
[[తమిళనాడు|తమిళ]] బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఆనంద శంకర్ జయంత్ నాలుగేళ్ల ప్రాయం నుంచే పాదాలతో మువ్వల సవ్వడి చేసింది. [[కూచిపూడి (నృత్యము)|కూచిపూడి]], [[భరతనాట్యం]], [[వీణ]] తదితర కళల్లో ప్రావీణ్యం సంపాదించిన ఆమె 17 ఏళ్ల వయసులో [[హైదరాబాదు|హైదరాబాద్‌]]కు తిరిగివచ్చి ఆరుగురు విద్యార్థులతో శంకరానంద కళాక్షేత్ర నృత్య పాఠశాలను ఏర్పాటుచేసి ఎంతోమందికి శాస్ర్తియ [[నృత్యం]]లో శిక్షణ ఇస్తున్నారు. ఆమె రూపొందించిన నృత్య రూపకాల్లో బుద్ధం..శరణం.. గచ్చామి, నేనెవరిని, పంచతంత్ర, శ్రీకృష్ణ వందే జగద్గురుమ్, నవరస, దర్శనం, సత్యం -ఇలా విభిన్న ఇతి వృత్తాలతో రూపొందించిన నృత్య రూపకాలు ప్రపంచ స్థాయి గుర్తింపుపొందాయి. భారతీయ నృత్య రూపకాల ప్రాధాన్యతను వివరిస్తూ ఆమె నేడు దేశ విదేశాల్లో స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలు చేస్తున్నారు. తొలినాళ్లలో హైదరాబాద్‌లోని [[సెయింట్ ఆన్స్ స్కూలోలోహైస్కూలు, సికిందరాబాదు|సెయింట్ ఆన్స్ స్కూలో]]లో చదివిన ఈ 53 ఏళ్ల నృత్యకళాకారిణి హిస్టరీ అండ్ కల్చరల్ కోర్సులో ఎంఫిల్, పర్యాటకంలో పి.హెచ్‌డీ చేసింది. రైల్వే ట్రాఫిక్ సర్వీసులో తొలి మహిళా అధికారిణి. ఆమె ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రదర్శనలు ఇచ్చి నృత్యకళకు సేవనందించారు.
 
[[తమిళనాడు]]లో జన్మించిన ఆమె సికింద్రాబాద్‍లోని [[సెయింట్ ఆన్స్ స్కూల్‍లోహైస్కూలు, సికిందరాబాదు|సెయింట్ ఆన్స్ స్కూల్‍]]లో విద్యనభ్యసించారు. [[ఉస్మానియా యూనివర్సిటీ]]లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. పీజీ చదువుతున్న రోజుల్లోనే యూపీఎస్సీ పరీక్షలపై ఆసక్తి కలిగింది. అప్పటికే యూనివర్సిటీ టాపర్‌. ఆ పట్టుదలతోనే యూపీఎస్సీ పరీక్షల్లో పాసై సౌత్‌ సెంట్రల్‌ రైల్వేలో తొలి మహిళా ఆఫీసర్‌గా బాధ్యతలు చేపట్టారు.
 
ఆనంద శంకర్‌ జయంత్‌ ప్రపంచ ప్రఖ్యాతి కళాక్షేత్రం నుంచి గ్రాడ్యుయేషన్‌ను పూర్తి చేశారు. [[భరతనాట్యం]], కూచిపూడి ప్రదర్శనలో ప్రత్యేతను కనిపించేలా ఆమె సాధన చేశారు. ఆనంద కూచిపూడిలో ప్రావీణ్యాన్ని పి. రామలింగ శాస్త్రి వద్ద సంపాదించారు. దూరదర్శన్‌లో ఆనంద ప్రదర్శనలకు మంచి టిఆర్‌పి ఫాలోయింగ్‌ ఉంది. ఐసిపిఆర్‌ ఆర్టిస్ట్‌గా ఎదిగారామె. భారతదేశంతో పాటు విదేశాలలో అనేక ప్రదర్శనలిచ్చారు. కూచిపూడి ప్రదర్శ నలివ్వాల్సిందిగా ఆమెను కజు రహో, భాగ్యచంద్ర డ్యాన్స్‌ ఫెస్టివల్‌, ఇంపాల్‌ వంటి అనేక ఉత్సవాల నుంచి ఆహ్వానాలందుకున్నారు. ఆమెకు [[అభినయం]]లో మంచి పేరు ఉంది. కూచిపూడి నృత్యకళాకారిణి, కొరియో గ్రాఫర్‌, శిక్షకురాలిగా ఉంటూ ఆమె కళాసేవకే అంకితం అయ్యారు.<ref>[http://www.suryaa.com/features/article.asp?subCategory=2&ContentId=66499 నృత్యమే ఆనందం January 23, 2012]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
"https://te.wikipedia.org/wiki/ఆనంద_శంకర్_జయంత్" నుండి వెలికితీశారు