లౌలాన్ బ్యూటీ: కూర్పుల మధ్య తేడాలు

చి జాతి మూలాలు
పంక్తి 33:
 
==జాతి మూలాలు==
లౌలాన్ బ్యూటీ యూరోపియన్ ముఖలక్షణాలను కలిగివుంది. కాకసాయిడ్ జాతికి చెందింది. లౌలాన్ బ్యూటీ మమ్మీ ప్రాచీనతకన్నా విస్పష్టంగా కొట్టొచ్చినట్లు కనిపించే ఆమె యూరోపియన్ ముఖకవళికలు, లక్షణాలుతో కూడిన భౌతిక రూపం, పాశ్చాత్య వస్తు సంస్కృతి ప్రపంచవ్యాప్తంగా పురావస్తు శాస్త్రవేత్తల, పురా మానవ శాస్రవేత్తల దృష్టిని విశేషంగా ఆకర్షించింది. దీనికి ప్రధాన కారణాలు 1. చైనీయులు మంగోలాయిడ్ జాతికి చెందిన ప్రజలు కాగా చైనా దేశంలో లభ్యమైన ఈ మమ్మీ మాత్రం కాకసాయిడ్ జాతికి చెందిన స్త్రీది కావడం. 2. ఈ మమ్మీతో పాటు ఇదే ప్రాంతంలోని బయల్పడిన ఇతర మమ్మీ సమాధులలో లభ్యం అయిన వస్తు సంస్కృతి, పశ్చిమ యురేషియా ప్రాంతానికి చెందిన వస్తు సంస్కృతికి చెందినది కావడం. ఆధునిక డిఎన్ఏ పరిశోధనలను బట్టి ఈ మమ్మీల యొక్క జాతి వారసత్వ మూలాలను డిఎన్ఏ పరిశోధనలను బట్టి పరిశిలిస్తే, తండ్రి వైపు పూర్వీకులు యూరోపియన్ మూలానికి చెందినవారని, తల్లి వైపు పూర్వికులు మాత్రం మిశ్రమ-ఆసియా వారసత్వం కనీసంగా కలిగి ఉన్నట్లు తెలుస్తున్నది. అంటే పశ్చిమ, తూర్పు ప్రాంతాల ఉప మిశ్రమ జాతికి చెందినవారిగా నిర్ధారించాయి. ఈమె బహుశా తొకేరియన్ల పూర్వీకురాలు కావచ్చు. ఈమెను ఖననం చేసిన పద్దతి కూడా పురాతన ఇండో-యూరోపియన్లకు (అఫానస్యేవ్ సంస్కృతి లేదా తొకేరియన్) చెందింది.
 
==ప్రాచీన నాగరికతా మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/లౌలాన్_బ్యూటీ" నుండి వెలికితీశారు