లౌలాన్ బ్యూటీ: కూర్పుల మధ్య తేడాలు

చి మూలాలు
చి మూలాలు
పంక్తి 11:
 
==జీవితం మరియు మరణం==
క్రీస్తు పూర్వం 1800 లో చనిపోయేనాటికి, లౌలాన్ బ్యూటీ 45 సంవత్సరాల వయస్సు వరకు జీవించింది. ఈమె యూదు మతానికి చెందిన ప్రవక్త ‘అబ్రహం’ జీవించిన కాలంలో వుండేది. ఇసుకపొడి దుమ్ము, బొగ్గు ధూళిమసి మొదలైనవి ఎక్కువగా పేరుకుపోవడం వల్ల ఊపిరితిత్తులు చెడిపోయి ఆమె మరణించింది.{{sfn|Edward, Wong|2008}} <ref name="Chinese Mummies|Robert Cipriani"/>చలిని తట్టుకోవడానికి ఆమెకు తొడిగిన ఉడుపులను, ఇతరత్రా చేసిన ఏర్పాట్లను బట్టి పరిశీలిస్తే, లౌలాన్ బ్యూటీ శీతాకాలంలో మరణించి ఉండవచ్చని పురావస్తు పరిశోధకురాలు, చరిత్ర పూర్వయుగపు వస్త్ర నిపుణులు అయిన ఎలిజబెత్ వేలాండ్ బార్బర్ పేర్కొన్నారు. ఆమె ధరించిన దుస్తుల ముతక స్వరూపాన్ని బట్టి, ఆమె జుట్టులోని పేలును బట్టి చూస్తే, ఆమె కష్టతరమైన జీవితం గడిపినట్లు తెలుస్తుంది.{{sfn|Edward, Wong|2008}}
 
==మమ్మీ వెలికితీత==
తక్లామకాన్ ఎడారి తూర్పు భాగంలో గల ఒక ప్రాచీన ఎడారి నగరం లౌలన్. ఈ నగర శిథిలాల సమీపంలో లోప్ నర్ ఉప్పు నీటి సరస్సు వుంది. ఈ సరస్సుకి ఉత్తరంలో గల తీబాన్హే (Tiebanhe) నదీ స్మశానంలో ఈ మమ్మీ కాకతాళీయంగా బయల్పడింది. సిల్క్ రోడ్ గురించి ఒక డాక్యుమెంటరీని చిత్రీకరిస్తున్న సందర్భంలో చైనీస్ ఆర్కియాలజిస్ట్ ము సన్-ఇంగ్ (穆舜英), షిన్జాంగ్ అకాడమీ ఆఫ్ సోషల్ సైన్సెస్ కు చెందిన ఆర్కియాలజీ ఇన్స్టిట్యూట్ సభ్యులతో కలసి ఈ మమ్మీని 1980 లో వెలికితీశారు. ప్రస్తుతం ఈ మమ్మీని చైనా లోని షిన్జాంగ్ రాజధాని ఉరుంచి నగరంలోని షిన్జాంగ్ అటానమస్ ప్రాంతీయ మ్యూజియంలో రెండవ అంతస్థులో గల మమ్మీ హాలులో ప్రదర్శనార్దం ఉంచారు. <ref>{{cite web|url=https://www.nytimes.com/2008/11/19/world/asia/19mummy.html|title=The Dead Tell a Tale China Doesn't Care to Listen To|publisher=The New York Times|date=November 18, 2008|accessdate=|author=Gilles Sabrie}}</ref>
 
==మమ్మీ సంరక్షణ==
లౌలాన్ బ్యూటీ, కృత్తిమ పద్ధతులలో లేపనాలతో భద్రపరచబడిన మమ్మీ కాదు. కేవలం తక్లమకన్ వేడి ఎడారి ఇసుక క్రింద బహిరంగ శవపేటికలో పాతిపెట్టబడటంతో సహజసిద్ధంగా అతి చక్కగా సంరక్షించబడింది.<ref name="Chinese Mummies|Robert Cipriani">{{cite web |last1=Robert |first1=Cipriani |title=Chinese Mummies |url=https://chinesemummies.weebly.com/beauty-of-loulan.html |website=chinesemummies.weebly.com |accessdate=18 October 2020}}</ref> ఎడారి వేడిమికి ఆమె శరీరం ఎండిపోయి ప్రకృతి సిద్ధంగా మమ్మీగా మారిపోవడానికి ప్రధానంగా [[తక్లమకాన్ ఎడారి|తక్లమకాన్]] శీతల ఎడారి శుష్క వాతావరణం, శీతాకాలంలో ఎడారి ఇసుకనేల యొక్క అధిక లవణీయతలు దోహదం చేశాయి. వేలాది సంవత్సరాలుగా ఎడారి వేడికి ఆమె చర్మం ఎండిపోయి, నల్లబారిపోయినప్పటికీ శరీరం మాత్రం స్పష్టంగా చెక్కు చెదరకుండా వుంది. ఫలితంగా ఆమె శరీరంతో పాటు, ధరించిన వస్త్రాలు సైతం వేలాది సంవత్సరాలుగా సంరక్షించబడి భద్రంగా వున్నాయి. ఈమె జుట్టుతో పాటు కనురెప్పల వెంట్రుకలు సైతం చెక్కు చెదరలేదు.
 
==మమ్మీ స్వరూపం==
Line 32 ⟶ 33:
 
==జాతి మూలాలు==
లౌలాన్ బ్యూటీ యూరోపియన్ ముఖలక్షణాలను కలిగివుంది. కాకసాయిడ్ జాతికి చెందింది. లౌలాన్ బ్యూటీ మమ్మీ ప్రాచీనతకన్నా విస్పష్టంగా కొట్టొచ్చినట్లు కనిపించే ఆమె యూరోపియన్ ముఖకవళికలు, లక్షణాలుతో కూడిన భౌతిక రూపం, పాశ్చాత్య వస్తు సంస్కృతి ప్రపంచవ్యాప్తంగా పురావస్తు శాస్త్రవేత్తల, పురా మానవ శాస్రవేత్తల దృష్టిని విశేషంగా ఆకర్షించింది. దీనికి ప్రధాన కారణాలు 1. చైనీయులు మంగోలాయిడ్ జాతికి చెందిన ప్రజలు కాగా చైనా దేశంలో లభ్యమైన ఈ మమ్మీ మాత్రం కాకసాయిడ్ జాతికి చెందిన స్త్రీది కావడం. 2. ఈ మమ్మీతో పాటు ఇదే ప్రాంతంలోని బయల్పడిన ఇతర మమ్మీ సమాధులలో లభ్యం అయిన వస్తు సంస్కృతి, పశ్చిమ యురేషియా ప్రాంతానికి చెందిన వస్తు సంస్కృతికి చెందినది కావడం. పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ విక్టర్ మెయిర్ మరియు జన్యు శాస్త్రవేత్త పాలో ఫ్రాంకాలాచి 1993 లో బ్యూటీ ఆఫ్ లౌలాన్ యొక్క జన్యు నమూనాలను సంపాదించి ప్రాధమికంగా ఆమె యూరోపియన్ అని తెలియచేసారు. ఆధునిక డిఎన్ఏ పరిశోధనలను బట్టి లౌలాన్ మమ్మీలబ్యూటీ యొక్క జాతి వారసత్వ మూలాలను పరిశిలిస్తే, ఆమె తండ్రి వైపు పూర్వీకులు యూరోపియన్ మూలానికి చెందినవారని, <ref name="lives">{{cite web|url=https://www.washingtonpost.com/wp-dyn/content/article/2010/11/19/AR2010111907467.html|title= A beauty that was government's beast|publisher=The Washington Post|author=Barbara Demick|date=November 21, 2010|accessdate=}}</ref> తల్లి వైపు పూర్వికులు మాత్రం మిశ్రమ-ఆసియా వారసత్వం కనీసంగా కలిగి ఉన్నట్లు తెలుస్తున్నది.<ref>her's a few maternal line was Eastern Asian mixed-blood.</ref> ఈ పరిశోధనలు ఆమె పూర్వికులు, పశ్చిమ, తూర్పు ప్రాంతాల ఉప మిశ్రమ జాతికి చెందినవారిగా నిర్ధారించాయి. ఈమె బహుశా తొకేరియన్ల పూర్వీకురాలు కావచ్చు. ఈమెను ఖననం చేసిన పద్దతి కూడా పురాతన ఇండో-యూరోపియన్లకు (అఫానస్యేవ్ సంస్కృతి లేదా తొకేరియన్) చెందింది.
 
==ప్రాచీన నాగరికతా మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/లౌలాన్_బ్యూటీ" నుండి వెలికితీశారు