లౌలాన్ బ్యూటీ: కూర్పుల మధ్య తేడాలు

చి మూలాలు
చి మూలాలు
పంక్తి 39:
 
==సాంస్కృతిక వివాదం==
చైనీయులకు మరియు ఉయ్ఘర్స్ అని పిలువబడే టర్కిష్ మాట్లాడే ముస్లిం ప్రజల మధ్య గల రాజకీయ-సాంస్కృతిక వివాదానికి లౌలాన్ బ్యూటీ మమ్మీ కూడా ఒక అంశమయ్యింది. తారిమ్ మమ్మీలు బయటపడిన ప్రాంతం వాయువ్య చైనాలోని షిన్జాంగ్–ఉయ్ఘర్ అటానమస్ ప్రాంతానికి చెందినది. ఈ ప్రాంతంలో నివసించే ఉయ్ఘర్లు టర్కిష్ మాట్లాడే ముస్లిం ప్రజలు.<ref name="History 101| 2020"/> సంస్కృతి రీత్యా వీరు బీజింగ్ కన్నా ఇస్తాంబుల్ కి చేరువగా ఉండటమే కాక వీరి ముఖలక్షణాలు కూడా యూరోపియన్ల మాదిరిగానే ఉంటాయి.
 
చైనా దేశానికి సంబంధించినంతవరకూ షిన్జాంగ్–ఉయ్ఘర్ ప్రాంతం మీద చారిత్రిక హక్కు, హాన్ రాజవంశం కాలం (క్రీ.పూ. 2 వ శతాబ్దం) నుంచి మాత్రమే ఏర్పడింది. అంటే క్రీ.పూ. రెండవ శతాబ్దానికి ముందు వరకూ షిన్జాంగ్ ప్రాంతాన్ని కేవలం ఒక జనావాసరహిత ప్రాంతంగా చైనా చరిత్ర పేర్కొంటూ వచ్చింది. కాగా ఆ ప్రాంతంలో దొరికిన లౌలాన్ బ్యూటీతో పాటు ఇతర వందలాది తారిమ్ మమ్మీలు ఈ ప్రాంతానికి సంబందించి మరుగునపడిన వేలాది సంవత్సరాల చరిత్రను ఒక్కసారిగా వెలికితీసాయి. దానితో చైనా పేర్కొనే తొలి రాజ వంశం (హాన్) కాలానికి వేలాది సంవత్సరాలకు మునుపే షిన్జాంగ్ ప్రాంతంలో యూరోపియన్ ముఖలక్షణాలతో కూడిన ప్రజల ఉనికి ఉందని, అందులోను వారు సాంకేతికత అభివృద్ధిలో చైనా నదీ లోయ నాగరికతలను మించిపోయారని ప్రపంచానికి మొదటిసారిగా వెల్లడైంది. ముఖ్యంగా పశ్చిమం నుండి వచ్చిన, యూరోపియన్ ముఖలక్షణాలతో కూడిన చీనియేతర ప్రజల ఉనికి షిన్జాంగ్ ప్రాంతంలో వుందని తేలడం చైనా ప్రభుత్వాన్ని సాంస్కృతికంగా ఇబ్బందిలోకి నెట్టింది.
 
దీనిని ఆధారంగా చేసుకొని, ఆసియన్లగా కంటే యూరోపియన్ల మాదిరిగా ఎక్కువగా కనిపించే ఉయ్ఘర్లు, చైనా ప్రభుత్వం నమ్ముతున్నదాని కంటే చాలా ముందుగానే తమ పూర్వీకులే ఈ ప్రావిన్స్‌కు వచ్చారని, ఈ ప్రాంతం మీద తొలి చారిత్రిక వారసత్వం తమదేనని ప్రకటించుకొన్నారు.<ref name="History 101| 2020"/> దీనికోసం లౌలన్ బ్యూటీ మమ్మీ బయల్పడిన వెంటనే, ఉయ్ఘర్లు వెంటనే ఆమెను తమ పూర్వీకురాలిగా పేర్కొన్నారు.<ref name="History 101| 2020">{{cite web |title=Who was the Sleeping Beauty of Loulan? |url=https://www.history101.com/the-beauty-of-loulan/ |website=history101.com |publisher=Novelty Magazines Inc. |accessdate=18 October 2020}}</ref> చైనీయుల కన్నా మొదటగా తమ ప్రజలు ఈ ప్రాంతంలో వచ్చారని, దానికి తిరుగులేని సాక్ష్యంగా లౌలన్ బ్యూటీతో పాటు మిగిలిన తారీమ్ మమ్మీలు సాక్ష్యమని విశ్వసించారు. లౌలన్ బ్యూటీని తమ ప్రజలతో అనుసంధానించడంకోసం, ఉయ్ఘర్ వేర్పాటు జాతీయ ఉద్యమకారులు సాంస్కృతికంగా లౌలాన్ బ్యూటీని ఒక జాతీయ గౌరవ చిహ్నంగా గుర్తించారు. ఇది చైనా ప్రభుత్వానికి మరిన్ని చిక్కులు తెచ్చిపెట్టింది. అయితే వాస్తవానికి లౌలన్ బ్యూటీ కాకేసియన్ అయినప్పటికీ, ఉయ్ఘర్ల పూర్వీకురాలు ఎంతమాత్రం కాదని, ఆమె జన్మ మూలాలు సెల్టిక్, సైబీరియన్ లేదా స్కాండినేవియన్ ప్రాంతాలకు చెందిన పూర్వికులవని పరీక్షల్లో తేలింది.<ref name="History 101| 2020"/> పైగా చారిత్రక సాక్ష్యాల ప్రకారంగా చూసినా షిన్జాంగ్–ఉయ్ఘర్ ప్రాంతమలో క్రీ.శ. తొమ్మిదవ శతాబ్దం వరకూ ఉయ్ఘర్లు అడుగు పెట్టడమనేదే జరగలేదు. దానితో ఉయ్ఘర్ ప్రజల సాంస్కృతిక వారసత్వానికి, వారు ఆశించినంతగా లౌలాన్ బ్యూటీ ఉపయోగపడదని తేలిపోయింది.
 
==ప్రాముఖ్యత==
"https://te.wikipedia.org/wiki/లౌలాన్_బ్యూటీ" నుండి వెలికితీశారు