సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం: కూర్పుల మధ్య తేడాలు

→‎CBI పరిశోధనకై విన్నపం: సినీ పరిశ్రమ లో పక్షపాతం పై చర్చ
పంక్తి 64:
=== సినీ పరిశ్రమ లో పక్షపాతం పై చర్చ ===
సుశాంత్ మరణం బాలీవుడ్ లో వంశ పారంపర్యం మరియు ఇతర దుశ్చర్యలపై చర్చలకు తెర తీసింది. కరణ్ జోహార్, సంజయ్ లీలా భన్సాలీ, [[సల్మాన్ ఖాన్]] మరియు ఏక్తా కపూర్ లతో సహా మరో నలుగురి పై సుధీర్ కుమార్ ఓహ్జా అనే న్యాయవాది పాట్నా ఉన్నత న్యాయస్థానం లో వంశపారంపర్యం వల్లనే సుశాంత్ కు అవకాశాలు కొరవడ్డాయని, అందుకే సుశాంత్ ఆత్మాహుతికి పాల్పడ్డాడని అరోపిస్తూ కేసు వేశారు. కానీ ఈ కేసులో 8 జూలై న కొట్టివేయబడింది. కరణ్ జోహార్ మరియు ఆలియా భట్ లు సాంఘిక మాధ్యమాలలో దూషించబడ్డారు.
 
కంగనా రణావత్ తన అనుచర వర్గం తో బాలీవుడ్ లో వేళ్ళూనుకొని ఉన్న పక్షపాత ధోరణిని దుయ్యబట్టారు. రిపబ్లిక్ టీవీ ముఖ్య ఎడిటర్ అయిన అర్నబ్ గోస్వామి తో ముఖాముఖిలో సుశాంత్ మరణానికి కారణం 'మూవీ మాఫియా' నే అని తెలిపారు. బాలీవుడ్ సినీ నిర్మాణ సంస్థలు అయిన ధర్మా ప్రొడక్షన్స్ మరియు యష్ రాజ్ ఫిలింస్ పనిగట్టుకొని సుశాంత్ వైఫల్యం చవి చూపించారని, సినీ విమర్శకుడు రాజీవ్ మసంద్ సుశాంత్ ను బహిరంగంగా అవహేళన చేసారని తెలిపారు.
 
సిమీ గేరేవాల్, ఏ ఆర్ రెహమాన్ తాము బాలీవుడ్ లో ఎదుర్కొన్న పక్షపాత ధోరణిని బయట పెట్టారు. సినీ సంగీత రంగంలో ఉన్న పక్షపాత ధోరణిని 'మ్యూజిక్ మాఫియా' గా సోనూ నిగం అభివర్ణించారు. పక్షపాతం పై కాదర్ ఖాన్ తీసిన వీడియో సాంఘిక మాధ్యమాలలో ప్రాచుర్యం పొందింది.
 
== ఇవి కూడా చూడండి ==