టంగుటూరి అంజయ్య: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 23:
 
==ముఖ్యమంత్రిగా==
1980 లో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి [[మర్రి చెన్నారెడ్డి]] ప్రభుత్వములో అసమ్మతి ఉధృతమై, అవినీతి ఆరోపణలు పెరిగిపోవడముతో [[భారత జాతీయ కాంగ్రెస్|కాంగ్రెసు పార్టీ]] అధిష్టాన వర్గము ఆయన్ను తొలగించి, కేంద్రములో [[ఇందిరా గాంధీ]] మంత్రివర్గములో కార్మిక శాఖా మంత్రిగా పనిచేస్తున్న అంజయ్యను [[ముఖ్యమంత్రి]] గా నియమించింది. పార్టీలో సొంత వర్గమంటూ లేని అంజయ్య వివిధ వర్గాల వారికి మంత్రివర్గములో పదువులు ఇవ్వాల్సి వచ్చింది. 61 మంది మంత్రులతో, అంజయ్య భారీ మంత్రివర్గాన్ని హాస్యాస్పదంగా ''జంబో మంత్రివర్గమని'' పిలిచేవారు<ref name=anj1>Parties, Elections, and Mobilisation - K. Ramachandra Murty పేజీ.41</ref>. మంత్రుల సభ్యులను తగ్గించాలని అధిష్టానవర్గం ఒత్తిడి తేగా, తొలగించినవారికి పదవులిచ్చి సంతృప్తి పరచడానికి అనేక నిరుపయోగమైన కార్పోరేషన్లు సృష్టించాడు. అసమ్మతిదారుల విలాసాల కోసము హెలికాప్టర్లు, కార్లు వంటి వాటి మీద ఖర్చుచేశాడు<ref name=anj2>Plotting, Squatting, Public Purpose, and Politics: Land Market Development, Low Income Housing and Public intervention in India - Robert-Jan Baken పేజీ.41</ref>. అంజయ్య ప్రభుత్వములో కూడా 1982 కల్లా అసమ్మతి వర్గము పెరిగిపోయినందున, ఈయన అధిష్టానవర్గ ఆదేశముననుసరించి ముఖ్యమంత్రి పదవి నుండి వైదొలగవలసి వచ్చింది.
 
అంజయ్య ముఖ్యమంత్రి కాగానే చేసిన ముఖ్యమైన పనులలో [[పంచాయితీ రాజ్]] సంస్థలకు ఎన్నికలు జరిపించటం ఒకటి.<ref>The Indian Journal of Political Science By Indian political science association Vol. 35, no. 4 (Oct.-Dec. 1974) పేజీ.542 [http://books.google.com/books?id=xg4tAAAAIAAJ&q=t.+anjaiah&dq=t.+anjaiah&pgis=1]</ref>
పంక్తి 32:
*అసలు పేరు తాళ్ళ అంజయ్య కానీ తన పేరు టంగుటూరి కృష్ణారెడ్డి అని, తాను రెడ్డినే అని అంజయ్య ముఖ్యమంత్రి అయిన తరువాత చెప్పాడు.
* [[హిందీ భాష|హిందీ]], [[ఉర్దూ భాష|ఉర్దూ]] మాట్లాడటం, అంజయ్యకు కలిసివచ్చాయి. ముఖ్యమంత్రిగా ఆయన జంబో జెట్ మంత్రివర్గాన్ని 61మందితో ఏర్పరచి ఏమంత్రికి ఎవరి సిఫారసు ఉన్నదో బయట పెట్టాడు. కాదనలేక జాబితా పెంచుతూ పోయాడు.
*అంజయ్య మాట్లాడేదే అసలైన తెలుగని దాశరథి వ్యాఖ్యానించాడు. సముద్రంలో తేల్ పడిందంట లాంటి తెలుగు [[ఉర్దూ భాష|ఉర్దూ]] కలిపిన పదాలు ఆయన ఎన్నో వాడుతుండేవారు.
==మూలాలు==
<references/>
"https://te.wikipedia.org/wiki/టంగుటూరి_అంజయ్య" నుండి వెలికితీశారు