నోరు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 37:
# అథోజిహ్విక
# అథోజంబిక
వీటిలో పెరోటిడ్ గ్రంథులు చెవి దగ్గరగా ఉంటాయి. అథోజిహ్విక, అథో జంభికా గ్రంథులు నాలుక క్రిందకు తెరుచుకుంటాయి. ఈ గ్రంథుల నుంచి లాలాజలం విడుదలౌతుంది. లాలాజలంలో ఎక్కువగా నీరు, కొద్దిగా లవణాలు, ఎమైలేజ్, టయొలిన్ అనే ఎంజైమ్ లు ఉంటాయి. ఈ ఎంజైమ్ లు ఆహారంలోని పిండిపదార్థాన్ని డెక్స్ట్రిన్, మాల్టోజ్ అనే చక్కెరలుగా మారుస్తుంది. డెక్స్ట్రిన్ కూడా చివరకు మాల్టోజ్ గానే మారుతుంది. ఆహారంలోని పిండి పదార్థం నోట్లోనే పాక్షికంగా జీర్ణమవుతుంది. ఆహారం నోటి నుంచి గ్రసని ద్వారా ఆహార నాళంలోకి ప్రవేశిస్తుంది. గ్రసనిలో ఉన్న కొండనాలుక ఆహారం వాయునాళం లోకి పోకుండా కాపాడుతుంది. ఆహార వాహికలో స్రవించే శ్లేష్మం వల్ల ఆహారం సులువుగా కదులుతుంది. ఆహార వాహికలోని కండరాలు ఏర్పరిచే అలల వంటి సంకోచ కదలికలను పెరిస్టాటిక్ చలనాలు అంటారు. ఇవి అనియంత్రితమైనవి.
 
== నోటి వ్యాధులు ==
# [[నోటి పుండు]]: నోటి శ్లేష్మ పొరపై ఏర్పడే పుండు.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/నోరు" నుండి వెలికితీశారు