"గర్భం" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి (remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675)
 
స్త్రీ, పురుష ప్రాకృతిక [[సంభోగం]] కార్యంలో [[పురుషుడు]] తన వీర్యాన్ని స్త్రీ యోనిలో స్కలించడం వలన స్త్రీకి మాతృత్వం సిద్ధిస్తుంది. [[పురుషుడు|పురుషుని]] వీర్యంలోని వీర్యకణాలు [[స్త్రీ]] అండాన్ని ఫలదీకరించిన తరువాత ఏర్పడిన [[పిండం]] స్త్రీ [[గర్భాశయం]]లో పెరగడం ప్రారంభిస్తాయి. దీనిని '''గర్భం''' లేదా '''కడుపూ' (Pregnancy) అంటారు. గర్భం ధరించిన స్త్రీని '''గర్భవతి''' లేదా '''గర్భిణి''' అంటారు. గ్రామాల్లో స్త్రీకి గర్భం వస్తే ' ఆమె నీళ్ళు పోసుకుంది ' అని అంటారు. కొంతమందిలో ఒకటి కన్నా ఎక్కువ పిండాలు తయారౌతాయి. ఫలదీకరణం తరువాత తయారైన [[పిండం]] పెరుగుతూ ఉండే కాలాన్ని గర్భావధి కాలం అంటారు. దీని తరువాత శిశువు జన్మిస్తుంది. దీనిని పురుడు అంటారు. క్షీరదాలన్నింటిలో క్షుణ్ణంగా పరిశోధన మానవులలో జరిగింది. ఈ వైద్య శాస్త్రాన్ని ఆబ్స్టెట్రిక్స్ (Obstetrics) అంటారు.
 
గర్భావధి కాలం తరువాత [[శిశువు]] జననం సాధారణంగా 38 - 40 వారాలు అనంతరం జరుగుతుంది. అనగా గర్భం ఇంచుమించు తొమ్మిది నెలలు సాగుతుంది. ఈ సమయంలో [[వెన్నునొప్పి]] కూడా రావచ్చు.
 
ఫలదీకరణం తరువాత ప్రారంభ దశను '[[పిండం]]' అంటారు. '[[శిశువు]]' అని ఇంచుమించు రెండు నెలలు లేదా 8 వారాల తర్వాత నుండి పురిటి సమయం వరకు పిలుస్తారు.<ref>{{cite web |url=http://www.medterms.com/script/main/art.asp?articlekey=3225 |title=Embryo Definition |accessdate=2008-01-17 |work=MedicineNet.com |publisher=MedicineNet, Inc}}</ref><ref>{{cite web |url=http://www.medterms.com/script/main/art.asp?articlekey=3424 |title=Fetus Definition |accessdate=2008-01-17 |work=MedicineNet.com |publisher=MedicineNet, Inc}}</ref>
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3051317" నుండి వెలికితీశారు