విష్ణుకుండినులు: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర}}
'''విష్ణుకుండినులు''' సామాన్య శకం 4వ శతాబ్దం నుంచి సామాన్య శకం 7వ శతాబ్దం వరకు దక్షిణ తెలంగాణకొన్ని కోస్తాంధ్ర జిల్లాలను పాలించారు. వంశస్థాపకుడు మహారాజేంద్రవర్మ (ఇంద్రవర్మ) .<ref>తెలంగాణ చరిత్ర, డా.సుంకిరెడ్డి నారాయణరెడ్డి, పేజీ 70</ref>. ఇతను [[తెలంగాణ]]లోని ఇంద్రపాలనగరం (ఇంద్రపురి) రాజధానిగా పాలన ప్రారంభించాడు. మొదట దక్షిణ తెలంగాణ జిల్లాలలో పాలన ప్రారంభించి క్రమక్రమంగా తూర్పువైపు [[కృష్ణా జిల్లా|కృష్ణా]]-[[గోదావరి]] మధ్యప్రాంతాలను ఆక్రమించారు. సాతవాహనుల అనంతరము ఆంధ్రదేశమున అత్యధికప్రాంతము పాలించిన రాజవంశమిదియే. విష్ణుకుండినుల వంశావళిని విశేషముగా శోధించిన శంకరనారాయణ ప్రకారము సా.శ. 375 నుండి వంశస్థాపకుడు ఇంద్రవర్మ 25 సంవత్సరాలు పాలించాడు. తరువాత క్రమముగ మొదటి మాధవవర్మ, (సా.శ.400-422), మొదటి గోవిందవర్మ (సా.శ.422-462), రెండవ మాధవవర్మ (సా.శ.462-502), మొదటి విక్రమేంద్రవర్మ (సా.శ.502-527), ఇంద్రభట్టారకవర్మ (సా.శ.527-555), రెండవ విక్రమేంద్రభట్టారక (555-572) పాలించారు. చివరగా మొదటి విక్రమేంద్రవర్మ రెండవ పుత్రుడగు నాలుగవ మాధవవర్మ సా.శ. 613 వరకు పాలించాడు<ref>విజ్ఞాన సర్వస్వము, తెలుగు సంస్కృతి (దేశము-చరిత్ర), మొదటి సంపుటము, 1990, తెలుగు విశ్వవిద్యాలయము, హైదరాబాదు</ref> 4వ మాధవవర్మ "జనాశ్రయఛందోవిచ్ఛితి" రచించాడు. ఇది తెలంగాన నుంచి వచ్చిన మొదటి [[సంస్కృతము|సంస్కృత]] లక్షణ గ్రంథం.
 
విష్ణుకుండినులలో పదునొకండు అశ్వమేధములను, క్రతుసహస్రములను, ఇతర యాగములనెన్నింటినో ఆచరించిన రెండవ మాధవవర్మ చాలా గొప్పవాడు. ఇతడు [[వాకాటకులు|వాకాటకుల]]తో సంబంధ బాంధవ్యములు నెరిపి రాజ్యాన్ని దృఢపర్చుకున్నాడు. ఈతనిని [[త్రికూట మలయాధిపతి]] అంటారు. గుంటూరు జిల్లాలోని [[కోటప్ప కొండ]]యే త్రికూట మలయం. ఇంద్రవర్మ పూర్వదేశాధిపతులతో పెక్కు యుద్ధాలు చేసి దక్షిణ కళింగాన్ని నిలుపుకున్నాడు.
"https://te.wikipedia.org/wiki/విష్ణుకుండినులు" నుండి వెలికితీశారు