సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం: కూర్పుల మధ్య తేడాలు

→‎విచారణ: శుద్ధి
పంక్తి 50:
రియాపై అభియోగాల మోపబడ్డ తర్వాత రియాను దూషిస్తూ, బెదిరిస్తూ భోజ్ పురి భాషలో చిత్రీకరించబడ్డ గీతాలు కొన్ని బీహార్ లో జనాదరణ పొందాయి <ref>[https://www.bollywoodhungama.com/news/bollywood/sushant-singh-rajput-death-bihar-breaks-songs-bashing-rhea-chakraborty/ భోజ్ పురి లో రియా కు వ్యతిరేకంగా గీతాలు]</ref> .
 
సుశాంత్ సోదరి శ్వేతా సింగ్ కీర్తి సుషాంత్ కోసం సామూహిక ప్రార్థన (Global Prayers for SSR) తలపెట్టింది. 15 ఆగస్టు స్థానిక కాలమానం ప్రకారం ఉ: గం| 10.00 | ని కి సుశాంత్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ ఈ ప్రార్థనలో పాల్గొనవలసిందిగా ప్రకటించింది <ref>[https://www.dnaindia.com/bollywood/report-global-prayers-for-ssr-ankita-lokhande-sushant-singh-rajput-s-sister-shweta-singh-kirti-request-people-to-share-images-2837601 సుశాంత్ ఆత్మకు శాంతి చేకూరాలని అతని సోదరి ప్రార్థనలు]</ref>. కుటుంబ సభ్యులు మరియు అభిమానులతో బాటు బాలీవుడ్ కు చెందిన కృతి సనన్, అంకిత లోఖండే మరియు ఏక్తా కపూర్ ఈ ప్రార్థనలో పాలుపంచుకొన్నారు <ref>[https://www.indiatoday.in/movies/celebrities/story/kriti-sanon-and-ankita-lokhande-join-sushant-singh-rajput-s-family-in-global-prayers-for-ssr-1711530-2020-08-15 ప్రార్థనలలో పాల్గొన్న కుటుంబ సభ్యులు, సహ నటులు]</ref>. <ref>[https://www.indiatvnews.com/entertainment/celebrities/kriti-sanon-ankita-lokhande-others-join-sushant-singh-rajput-s-family-for-global-prayer-meet-642268 సుశాంత్ ఆత్మశాంతికై ప్రార్థనలు]</ref>
 
సుశాంత్ కేసు ప్రసార మాధ్యమాలలో విస్తృతంగా, అవిరామంగా చర్చించబడింది <ref>[https://www.deccanherald.com/amp/national/media-coverage-in-sushant-singh-rajput-case-opens-up-a-debate-on-role-of-press-887031.html ప్రచార మాధ్యమాలలో విస్తృతంగా చర్చించబడ్డ సుశాంత్ మరణం]</ref> <ref>[https://www.bbc.com/news/amp/world-asia-india-54098615 సుశాంత్ మరణం పై చర్చలు]</ref>. 3 సెప్టెంబరు 2020 రెండు PIL (Public Interest Litigation) లను పరిగణలోకి తీసుకొంటూ ముంబయి పోలీసు కు వ్యతిరేకంగా "అనుచిత, దురుద్దేశ్యపూర్వకంగా మరియు ప్రసార మాధ్యమాలలో తప్పుడు ప్రచారాన్ని" ఉద్దేశ్యించి బొంబాయి హై కోర్టు, "ఈ కేసు విచారణకు ఏ విధమైన అడ్డుకట్టలు పడకుండా ఉండేలా ప్రసార మాధ్యమాలలో తమ ప్రచారాన్ని నిగ్రహించుకోవాలని కోరుతున్నాం మరియు ఆశిస్తున్నాం" <ref> [https://www.thehindu.com/news/national/bombay-high-court-asks-media-to-show-restraint-in-reporting-of-sushant-case/article32516243.ece. మీడియా తమ ప్రచారాన్ని నిగ్రహించుకోవాలని కోరిన ముంబయి హై కోర్టు]</ref> అని సలహా ఇచ్చింది. 5 అక్టోబరు 2020న ముంబయి పోలీసు మరియు దాని అనుబంధ సైబర్ యూనిట్ సాంఘిక మాధ్యమాలు 80,000 కు పైగా ఫేక్ అకౌంట్ ల ను గుర్తించారు. ఆసియా, ఐరోపా ఖండాలలోని వివిధ దేశాల నుండి ఈ అకౌంట్లు వారి అధికారిక విచారణకు అపకీర్తి తెచ్చేలా పోస్టులు చేస్తున్నట్లు తెలిపారు. పోలీసు కమీషనర్ పరం వీర్ సింగ్, "అప్పటికే 6,000 మంది పోలీసు ఉద్యోగులకు కరోనా వైరస్ సోకి ఉంది. 84 పోలీసు ఉద్యోగులు వైరస్ వల్ల మృతి చెందారు. ఈ దుష్ప్రచారాలు మా మీద బురద చల్లటానికి, విచారణను ప్రక్కదారి పట్టించటానికి చేయబడ్డాయి. చట్టాన్ని అతిక్రమించిన వారి పై Information Technology Act చట్టం క్రింద కేసు నమోదు చేస్తాం." అని తెలిపారు <ref>[https://www.hindustantimes.com/mumbai-news/sushant-singh-rajput-death-case-over-80k-fake-accounts-created-to-discredit-mumbai-police-probe/story-qjpqRUsgC95wBwshReLiyI.html ముంబై పోలీసుల పై బురద జల్లేందుకే సృష్టించబడ్డ పలు ఫేక్ ఐడి లు]</ref>.
 
=== CBI పరిశోధనకై విన్నపం ===
పంక్తి 59:
అభిమానులు కూడా పలు సాంఘిక మాధ్యమాలలో CBI పరిశోధన కోరారు. 16 జూలై 2020న హిందుస్తాన్ టైంస్ సుశాంత్ ఆత్మాహుతి నేపథ్యంలో, "పలు కుతంత్రాలతో కూడిన ఒక భారీ ఆన్లైన్ క్యాంపెయిన్ ఈ విషయంలో CBI పరిశోధన అవసరం అనే అగ్నికి ఆజ్యం పోస్తోంది." అని ప్రచురించింది. తనను తాను సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ గా ప్రకటించుకొన్న రియా, [[అమిత్ షా]] సహకారాన్ని కోరుతూ కేంద్ర హోం మంత్రికి CBI పరిశోధన చేయించాలి అని ఒక లేఖలో విన్నవించుకొన్నట్లు హిందుస్తాన్ టైంస్ ప్రచురించింది <ref>[https://www.hindustantimes.com/bollywood/rhea-chakraborty-aks-for-cbi-investigation-into-sushant-singh-rajput-s-death-i-request-you-with-folded-hands/story-3nucScoHVAhKGBxLhVTAIM.html సిబిఐ దర్యాప్తును కోరిన రియా]</ref>. మునుపటి యూనియన్ మినిస్టర్ సుబ్రమణ్యం స్వామి కూడా CBI పరిశోధనకై విన్నవించుకోవటంతో ప్రధాన మంత్రి కార్యాలయం ఈ విన్నపాన్ని అంగీకరించింది. <ref>[https://www.dnaindia.com/bollywood/report-pm-modi-acknowledges-subramanian-swamy-s-letter-demanding-cbi-investigation-in-sushant-singh-rajput-death-case-2834062 సుబ్రమణ్యం స్వామి అభ్యర్థన మేరకు సిబిఐ దర్యాప్తుకు అంగీకరించిన ప్రధాన మంత్రి కార్యాలయం]</ref>
 
అయితే మహరాష్ట్ర హోం మినిస్టర్ అనిల్ దేశ్ ముఖ్ CBI జోక్యం వాదనను త్రోసిపుచ్చారు. "ముంబై పోలీసు ఇటువంటి కేసులను దర్యాప్తు చేయటానికి తగు సమర్థులే <ref>[https://www.mid-day.com/articles/cbi-probe-not-needed-in-sushant-singh-rajput-case-anil-deshmukh/22894322. CBI జోక్యం అవసరం లేదని అభిప్రాయపడ్డ మహారాష్ట్ర హోం మంత్రి.]</ref> " అని 17 జూలై న వెల్లడించారు. 22 జులై న సుశాంత్ అభిమానులు ట్విట్టరులో #Candle4SSR అనే హ్యాష్ ట్యాగును సృష్టించి ఒక క్యాంపెయిన్ నడిపారు. 2 మిలియన్ ట్వీట్లతో ఈ క్యాంపెయిన్ జయప్రదమైంది. ప్రపంచ వ్యాప్తంగా సుశాంత్ అభిమానులు ఈ కేసు CBI చేపట్టాలని కోరుకున్నారు <ref>[https://www.hindustantimes.com/bollywood/peaceful-protest-planned-in-sushant-singh-rajput-s-memory-on-august-7/story-mzepw2xYUw8rFxTaLPF4uM.html ట్విట్టర్ లో సుశాంత్ అభిమానులు CBI విచారణ చేపట్టాలని ఆన్లైన్ క్యాంపెయిన్]</ref>. అయినా 29 జులై న దేశ్ ముఖ్ ఈ కేసు CBI చేపట్టబోదని నొక్కి వక్కాణించారు <ref>[ https://www.ndtv.com/india-news/sushant-singh-rajput-wont-transfer-case-to-cbi-says-maharashtra-minister-2270991 CBIకి ఈ కేసు అప్పగించేది లేదని స్పష్టం చేసిన మహారాష్ట్ర హోమ్]</ref>.
 
5 ఆగస్టు న CBI విచారణ చేపట్టాలనే బీహార్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క సిఫారసును సోలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అయిన తుషార్ మెహతా భారత దేశపు ప్రభుత్వం యొక్క ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ ఆమోదించిందని తెలిపారు <ref>[http://www.ptinews.com/news/11700263_CBI-inquiry-into-Sushant-s-death-to-have-far-reaching.html సుశాంత్ కేసు పగ్గాలు CBI కి]</ref>. దీని ఆధారంగా CBI దర్యాపును మొదలు పెట్టాలని నిర్ణయించుకొన్నట్లు అధికారులు తెలిపారు <ref>[https://www.outlookindia.com/website/story/india-news-cbi-officials-say-agency-will-probe-sushant-singh-rajput-death-case/358058 CBI ధృవీకరణ]</ref>. ఈ కేసును CBI చేపట్టటంలో అవాంఛిత అత్యుత్సాహం ప్రదర్శించిందని మహరాష్ర ప్రభుత్వం సుప్రీం 8 ఆగస్టున కోర్టుకు తెలిపింది. కేసు కోర్టు పరిధిలో ఉండగానే CBI తమ వైపు నుండి కేసును ప్రారంభించడం అనుచితం అని పేర్కొంది <ref>[https://indianexpress.com/article/india/sushant-singh-rajput-case-cbi-investigation-maharashtra-supreme-court-6546302/ CBI ది అత్యుత్సాహంగా పేర్కొన్న మహారాష్ట్ర ప్రభుత్వం]</ref>.
పంక్తి 67:
సాంఘిక మాధ్యమాలలో దూషించబడ్ద కరణ్ జోహార్, ఆలియా భట్]</ref>.
 
కంగనా రణావత్ తన అనుచర వర్గం తో బాలీవుడ్ లో వేళ్ళూనుకొని ఉన్న పక్షపాత ధోరణిని దుయ్యబట్టారు <ref>[https://www.republicworld.com/entertainment-news/bollywood-news/kangana-ranaut-speaks-to-arnab-exposes-movie-mafia-full-interview.html సినీ పరిశ్రమలో వంశ పారంపర్యాన్ని దుయ్యబట్టిన కంగనా రణావత్]</ref>. రిపబ్లిక్ టీవీ ముఖ్య ఎడిటర్ అయిన అర్నబ్ గోస్వామి తో ముఖాముఖిలో సుశాంత్ మరణానికి కారణం 'మూవీ మాఫియా' నే అని తెలిపారు. బాలీవుడ్ సినీ నిర్మాణ సంస్థలు అయిన ధర్మా ప్రొడక్షన్స్ మరియు యష్ రాజ్ ఫిలింస్ పనిగట్టుకొని సుశాంత్ వైఫల్యం చవి చూపించారని, సినీ విమర్శకుడు రాజీవ్ మసంద్ సుశాంత్ ను బహిరంగంగా అవహేళన చేసారని తెలిపారు <ref>[https://www.republicworld.com/entertainment-news/bollywood-news/kangana-ranaut-arnab-asks-why-was-mahesh-bhatt-counselling-sushant.html కొన్ని సినీ నిర్మాణ సంస్థలు, కొందరు విమర్శకులు సుశాంత్ లో ఆత్మన్యూనతాభావాన్ని నూరిపోశారన్న కంగన]</ref>.
 
సిమీ గేరేవాల్ <ref>[https://www.indiatoday.in/movies/celebrities/story/what-sushant-endured-distraught-simi-garewal-applauds-kangana-ranaut-1702189-2020-07-19 కంగన ను సమర్థించిన సిమీ గెరెవాల్]</ref>, ఏ ఆర్ రెహమాన్ <ref>[https://www.dnaindia.com/bollywood/report-people-bashing-kangana-need-to-see-this-netizens-react-to-ar-rahman-s-comment-about-gang-spreading-rumours-2834050 తాను సైతం బాలీవుడ్ లో పక్షపాత ధోరణిని ఎదుర్కొన్నానని తెలిపిన ఏ ఆర్ రెహమాన్]</ref> తాము బాలీవుడ్ లో ఎదుర్కొన్న పక్షపాత ధోరణిని బయట పెట్టారు. సినీ సంగీత రంగంలో ఉన్న పక్షపాత ధోరణిని 'మ్యూజిక్ మాఫియా' గా సోనూ నిగం అభివర్ణించారు <ref>[https://www.news18.com/amp/news/movies/sonu-nigam-calls-out-music-mafia-in-bollywood-warns-about-suicides-in-music-industry-2676533.html మ్యూజిక్ మాఫియా గురించి గాయకుడు సోనూ నిగం]</ref> . పక్షపాతం పై కాదర్ ఖాన్ తీసిన వీడియో సాంఘిక మాధ్యమాలలో ప్రాచుర్యం పొందింది <ref>[ https://www.indiatoday.in/movies/bollywood/story/tuesday-trivia-what-changed-amitabh-bachchan-and-kader-khan-s-friendship-just-a-title-sir-ji-1702887-2020-07-21 పక్షపాతం పై కాదర్ ఖాన్ తీసిన వీడియో వైరల్ ]</ref>.
 
12 ఆగస్టు 2020 న విడుదలైన సడక్ 2 ట్రైలర్ యూట్యూబ్ పై 24 గంటలలో అత్యధిక డిజ్లైక్ లు (అసహ్యించుకోబడ్ద) పొందినదిగా గుర్తించబడింది <ref>[https://www.hindustantimes.com/bollywood/alia-bhatt-s-sadak-2-is-the-most-disliked-trailer-on-youtube-as-fans-demand-justice-for-sushant-singh-rajput/story-iEvKT1u4XhRDsM9RvtN8CJ.html సడక్ 2 కు అత్యధిక డిజ్లైకులు గా రికార్డు]</ref>. సుశాంత్ మరణానికి బాలీవుడ్ లో పక్షపాత ధోరణే కారణం అని భావించిన అతని అభిమానులే దీనిని అసహ్యించుకోన్నారు. మహేశ్ భట్ ను, ఈ చిత్ర దర్శకుణ్ణి, ఒక ముఖాముఖి లో ఒక ప్రశ్నకు సమాధానంగా మాట వరస కి "సుశాంత్ ను చంపేస్తాను" అని అన్న ఆలియా భట్ ను తీవ్రంగా దుయ్యబట్టారు <ref> [https://www.ndtv.com/entertainment/why-the-internet-is-hitting-dislike-on-alia-bhatts-sadak-2-trailer-2278443 సడక్ 2లో అవకాశం కోల్పోవటం వలనే సుశాంత్ ఆత్మాహుతికి ఒడిగట్టాడని భావించిన అతని అభిమానులు]</ref>.