ఒరేయ్ బుజ్జిగా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 27:
 
== కథా నేపథ్యం ==
నిడ‌ద‌వోలులోని కాంట్రాక్ట‌ర్‌ కోటేశ్వ‌ర‌రావు (పోసాని కృష్ణ‌ముర‌ళి) కొడుకు శ్రీనివాస్‌ (రాజ్‌త‌రుణ్‌). తల్లి చ‌నిపోవ‌డంతో జ్యోతిష్యుడు చెప్పిన దాని ప్ర‌కారం కొడుకు శ్రీనివాస్‌కు పెళ్ళి చేయాల‌ని కోటేశ్వ‌ర‌రావు భావిస్తాడు. కానీ పెళ్ళి చేసుకోవ‌డం ఇష్టంలేని శ్రీనివాస్ ఊరు వ‌ద‌లి వెళ్లిపోవ‌డానికి రైలు ఎక్కుతాడు. అదే సమ‌యంలో అదే ఊరిలో ఉండే చీఫ్ ఇంజ‌నీర్ చాముండేశ్వ‌రి (వాణీవిశ్వ‌నాథ్‌వాణీ విశ్వ‌నాథ్‌) కూతురు కృష్ణ‌వేణి (మాళ‌విక నాయ‌ర్‌) పెళ్ళి చేసుకోవ‌డం ఇష్టంలేక ఊరు విడిచి వెళ్లిపోతూ అదే రైలు ఎక్కుతుంది. దాంతో శ్రీనివాస్, కృష్ణ‌వేణి లేచిపోయార‌ని ఊర్లో అందరూ అనుకుంటుంటారు. రైలు ప్రయాణంలో శ్రీనివాస్‌, కృష్ణ‌వేణి మంచి స్నేహితులు అవుతారు. శ్రీనివాస్ ముద్దుపేరు బుజ్జిగాడు అని కృష్ణవేణికి తెలియ‌దు. త‌ను నరైలురైలు ఎక్క‌డం వ‌ల్ల బుజ్జిగాడితో కృష్ణ‌వేణి లేచిపోయింద‌నే పుకారు మొద‌లైంద‌నే విష‌యం కృష్ణ‌వేణికి తెలుస్తుంది. దాంతో ఆమె బుజ్జిగాడి మీద కోపం పెంచుకుంటుంది. మ‌రోవైపు కృష్ణ‌వేణి కార‌ణంగా ఇంట్లో స‌మ‌స్య‌లు మొద‌ల‌య్యాయ‌ని తెలుసుకున్న బుజ్జిగాడు, ఆమెను వెతికి ప‌ట్టుకొస్తాన‌ని అమ్మ‌కు మాట ఇస్తాడు. కృష్ణ‌వేణి కూడా స్వాతి అని పేరు మార్చి చెప్ప‌డంతో, బుజ్జిగాడు కూడా కృష్ణ‌వేణినే త‌ను వెతుకుతున్న స్వాతి అని తెలియ‌క ఆమెతో స్నేహం చేస్తాడు. అస‌లు శ్రీనివాస్‌, కృష్ణ‌వేణి వేర్వేరు కార‌ణాల‌తో రైలు ఎక్కార‌నే నిజం తెలియ‌క కుటుంబ స‌భ్యులు గొడ‌వ‌లు ప‌డుతుంటారు. తాను ప్రేమించిన సృజ‌న‌ (హెబ్బాప‌టేల్‌హెబ్బా ప‌టేల్‌) మోసం చేసి పోవ‌డంతో బుజ్జి మ‌ళ్లీ తిరిగి ఊరికి వెళ్ళలేని ప‌రిస్థితి ఏర్పడుతుంది. ఒక‌రంటే ఒక‌రికి తెలియ‌కుండానే శ్రీనివాస్‌, కృష్ణ‌వేణి ప్రేమ‌లో ప‌డతారు. తరువాత ఏం జరిగిందనేది మిగతా కథ.
 
== నటవర్గం ==
"https://te.wikipedia.org/wiki/ఒరేయ్_బుజ్జిగా" నుండి వెలికితీశారు