సిమ్లా ఒప్పందం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
+సియాచెన్ హిమానీనదం లింకు
పంక్తి 1:
'''సిమ్లా ఒప్పందం''' భారత పాకిస్తాన్ల మధ్య 1972 జూలై 2 న, [[హిమాచల్ ప్రదేశ్]] రాజధాని సిమ్లాలో కుదిరింది.<ref name="MEA_site">{{వెబ్ మూలము|url=http://www.mea.gov.in/bilateral-documents.htm?dtl/5541/Simla+Agreement|title=Simla Agreement|work=Bilateral/Multilateral Documents|publisher=Ministry of External Affairs, Government of India|accessdate=27 September 2013}}</ref> 1971 నాటి బంగ్లాదేశ్ యుద్ధంలో పాకిస్తాన్ భారత్ చేతిలో ఓడిన తరువాత ఈ సంధి కుదిరింది.  ఈ యుద్ధంలో  తూర్పు [[పాకిస్తాన్]] గా పిలువబడే భూభాగం పాకిస్తాన్‌నుండి వేరుపడి బంగ్లాదేశ్‌గా ఏర్పడింది. తొలుత బంగ్లా విముక్తి యుద్ధంగా మొదలైన ఈ యుద్ధంలో భారత్ తూర్పు పాకిస్తాన్ కు బాసటగా దిగడంతో ఇది భారత పాకిస్తాన్ [[యుద్ధం]]గా మారింది. సిమ్లా ఒప్పందాన్ని ఇరు దేశాల పార్లమెంట్లూ అదే సంవత్సరం ఆమోదముద్ర వేసాయి.
 
తమ సంబంధాలను విషమం చేస్తున్న ఘర్షణలకు అంతం పలకాలనే రెండు దేశాల నిశ్చయానికి ఫలితంగా ఈ ఒప్పందం కుదిరింది. తమ పరస్పర సంబంధాలను మామూలు స్థాయికి తీసుకువెళ్ళడమే కాకుండా, [[భవిష్యత్తు]]లో ఈ సంబంధాలను నిర్దేశించే సూత్రాలను కూడా ఈ ఒప్పందం నిర్వచించింది.<ref name="IBN_40">{{వెబ్ మూలము|url=http://ibnlive.in.com/news/indopak-shimla-agreement-40-years-later/268913-3.html|title=Indo-Pak Shimla Agreement: 40 years later|date=2 July 2012|work=IANS|publisher=IBN Live, CNN IBN|accessdate=27 September 2013}}</ref>
 
==వివరాలు ==
భారత్భారత ప్రధాని ఇందిరా గాంధీ, పాకిస్తాన్ అధ్యక్షుడు జుల్ఫికర్ ఆలీ భుట్టో ల మధ్య ఈ ఒప్పందం కుదిరింది.<ref>{{Cite web|url=http://pressacademyarchives.ap.nic.in/newspaperframe.aspx?bookid=9493|title=ఆంధ్రపత్రిక|last=|first=|date=1972-07-04|website=pressacademyarchives.ap.nic.in|url-status=live|archive-url=https://web.archive.org/web/20201021062444/http://pressacademyarchives.ap.nic.in/newspaperframe.aspx?bookid=9493|archive-date=2020-10-21|access-date=2020-10-21}}</ref> భుట్టో కుమార్తె, తరువాతి కాలంలో పాకిస్తానుకు ప్రధాని అయిన బేనజీర్ భుట్టో కూడా తండ్రితో ఉంది. ఒప్పందం ద్వారా పాకిస్తాన్ [[బంగ్లాదేశ్]] ఉనికిని గుర్తించింది.ఈ ఒప్పందం జూలై 3 న రాత్రి 12:40 కి సంతకాలైనప్పటికీ అధికార పత్రాలన్నీ 1972 జూలై 2 తేదీతోనే ఉన్నాయి.<ref name="IBN_40">{{వెబ్ మూలము|url=http://ibnlive.in.com/news/indopak-shimla-agreement-40-years-later/268913-3.html|title=Indo-Pak Shimla Agreement: 40 years later|date=2 July 2012|work=IANS|publisher=IBN Live, CNN IBN|accessdate=27 September 2013}}</ref><ref name="KSG">{{వెబ్ మూలము|url=http://ksgindia.com/study-material/editorial-series/3885-relevance-of-simla-agreement.html|title=Relevance of Simla Agreement|work=Editorial Series|publisher=Khan Study Group|accessdate=27 September 2013}}</ref> ఒప్పందం లోని ప్రధాన అంశాలు:
: రెండు దేశాలు తమ వివాదాలను ద్వైపాక్షికంగానే పరిష్కరించుకుంటాయి.<ref name="MEA_site">{{వెబ్ మూలము|url=http://www.mea.gov.in/bilateral-documents.htm?dtl/5541/Simla+Agreement|title=Simla Agreement|work=Bilateral/Multilateral Documents|publisher=Ministry of External Affairs, Government of India|accessdate=27 September 2013}}</ref><ref name="Pradhanmantri">{{cite episode|title=1971 Indo-Pak War|series=Pradhanmantri|date=21 September 2013|url=http://www.newsbullet.in/video/india/45558-watch-pradhanmantri-episode-11-about-1971-indo-pak-war|network=ABP News|season=1|number=11|last=Kapur|first=Shekhar (Narrator)}}{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> తరువాతి కాలంలో [[కాశ్మీరు]] సమస్యలో ఐక్యరాజ్యసమితి జోక్యాన్ని పాకిస్తాన్ ప్రతిపాదించినప్పటికీ, ఈ అంశం ఆధారంగానే భారత్ అంగీకరించలేదు.<ref name="IE">{{వెబ్ మూలము|url=http://www.indianexpress.com/news/india-spikes-pak-call-for-third-party-mediation-says-simla-agreement-tops-all-agendas/1063018/0|title=India spikes Pak call for third party mediation, says Simla Agreement tops all agendas|author=Press Trust of India|date=22 January 2013|publisher=Indian Express|accessdate=27 September 2013}}</ref>
 
: 1971 డిసెంబరు నాటి సంధిరేఖను నియంత్రణ రేఖగా రుఇరు దేశాలూ గుర్తించాయి. "ఏ భిన్నాభిప్రాయాలున్నప్పటికీ, ఇద్దరిలో ఎవరూ కూడా ఏకపక్షంగా ఈ రేఖను మార్చేందుకు ప్రయత్నించకూడదు".<ref name="MEA_site">{{వెబ్ మూలము|url=http://www.mea.gov.in/bilateral-documents.htm?dtl/5541/Simla+Agreement|title=Simla Agreement|work=Bilateral/Multilateral Documents|publisher=Ministry of External Affairs, Government of India|accessdate=27 September 2013}}</ref><ref name="KSG">{{వెబ్ మూలము|url=http://ksgindia.com/study-material/editorial-series/3885-relevance-of-simla-agreement.html|title=Relevance of Simla Agreement|work=Editorial Series|publisher=Khan Study Group|accessdate=27 September 2013}}</ref> ఈ రేఖను ఆంతర్జాతీయ సరిహద్దుగా మార్చాలని రెండు దేశాల అధిపతుల ఆంతరంగిక సమావేశంలో అప్రకటిత ఒప్పందం కుదిరిందని భారత అధికారులు అన్నప్పటికీ పాకిస్తాన్ అధికారులు దాన్ని ఖండించారు.<ref name="IBN_40">{{వెబ్ మూలము|url=http://ibnlive.in.com/news/indopak-shimla-agreement-40-years-later/268913-3.html|title=Indo-Pak Shimla Agreement: 40 years later|date=2 July 2012|work=IANS|publisher=IBN Live, CNN IBN|accessdate=27 September 2013}}</ref><ref name="KSG">{{వెబ్ మూలము|url=http://ksgindia.com/study-material/editorial-series/3885-relevance-of-simla-agreement.html|title=Relevance of Simla Agreement|work=Editorial Series|publisher=Khan Study Group|accessdate=27 September 2013}}</ref> ఈ రేఖను గుర్తించడంతో, భారత పాకిస్తాన్‌లలో ఐక్యరాజ్యసమితి సైనిక పరిశీలకుల బృందానికి (UNMOGIP) పాత్ర ఏమీ లేదని భారత్ చెప్పింది. 1949 లో జరిగిన [[1949 కరాచీ ఒప్పందం|కరాచీ ఒప్పందం]] ద్వారా ఏర్పడిన సంధిరేఖను ఈ బృందం పరిశీలిస్తూ ఉంటుంది. ఇప్పుడా రేఖయే లేదు కాబట్టి ఈ బృందం అవసరం లేదని భారత్ వాదన. అయితే, పాకిస్తాన్ వాదన ఇందుకు భిన్నంగా ఉంది. ఈ బృందం ఇప్పటికీ రెండు దేశాల్లోనూ ఉంది.<ref name="IE">{{వెబ్ మూలము|url=http://www.indianexpress.com/news/india-spikes-pak-call-for-third-party-mediation-says-simla-agreement-tops-all-agendas/1063018/0|title=India spikes Pak call for third party mediation, says Simla Agreement tops all agendas|author=Press Trust of India|date=22 January 2013|publisher=Indian Express|accessdate=27 September 2013}}</ref>
ఈ ఒప్పందానికి పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ 1972 జూలై 15 న ఆమోదముద్ర వెయ్యగా, <ref>{{Cite web|url=http://pressacademyarchives.ap.nic.in/newspaperframe.aspx?bookid=9481|title=ఆంధ్రపత్రిక|last=|first=|date=1972-07-16|website=pressacademyarchives.ap.nic.in|url-status=live|archive-url=https://web.archive.org/web/20201021063440/http://pressacademyarchives.ap.nic.in/newspaperframe.aspx?bookid=9481|archive-date=2020-10-20|access-date=2020-10-20}}</ref> భారత లోక్‌సభ 1972 ఆగస్టు 2 న, రాజ్యసభ ఆ మరుసటి రోజున ఆమోదించాయి.<ref>{{Cite web|url=http://pressacademyarchives.ap.nic.in/newspaperframe.aspx?bookid=9498|title=ఆంధ్రపత్రిక|last=|first=|date=1972-08-03|website=pressacademyarchives.ap.nic.in|page=5|url-status=live|archive-url=https://web.archive.org/web/20201021064701/http://pressacademyarchives.ap.nic.in/newspaperframe.aspx?bookid=9498|archive-date=2020-10-21|access-date=2020-10-21}}</ref> దాంతో ఈ ఒప్పందం 1972 ఆగస్టు 4 నుండి అమల్లోకి వచ్చింది.
 
ఈ ఒప్పందం రెండు దేశాల మధ్య సంబంధాలు క్షీణించి, ఘర్షణల దాకా పోకుండా నివారించలేకపోయింది. 1999 నాటి [[కార్గిల్ యుద్ధం]] ఇందుకో ఉదాహరణ. 1984 లో ఆపరేషన్ మేఘదూత్‌లో భారత్ [[సియాచెన్ హిమానీనదం|సియాచెన్ గ్లేసియరును గ్లేసియరు]]<nowiki/>ను పూర్తిగా ఆక్రమించుకుంది. ఈ ప్రాంతంలో నియంత్రణ రేఖను సిమ్లా ఒప్పందంలో నిర్వచించలేదు. అయితే పాకిస్తాన్ దీన్ని సిమ్లా ఒప్పందపు అతిక్రమణగా భావించింది.
 
==ఒప్పందం పూర్తి పాఠం ==
"https://te.wikipedia.org/wiki/సిమ్లా_ఒప్పందం" నుండి వెలికితీశారు